Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ప్రంపంచంలో ఎన్నో మతాలున్నాయి. వాటికి సంబంధించిన పవిత్ర గ్రంథాలూ ఉన్నాయి.
క్రిస్టియన్ మతానికి బైబుల్; మహమ్మదీయ మతానికి ఖురాన్, జైన మతానికి ఆగమాలు, బౌద్ధ మతానికి త్రిపిటకాలు మొదలైనవి.
మహమ్మదీయ మతంలో ఖురాన్ ఆవిర్భవించినది రంజాన్ మాసంలో అది అతి పవిత్ర మాసం.
సిక్కుల గురుగ్రంథం సాహెబ్ సిక్కుల మత గ్రంథంగానే కాకుండా అది 11వ సిక్కుల గురువుగా 20 అక్టోబరు 1708 నుండి మన్ననలందుకుంటోంది.
హిందువులకు భగవద్గీత అతి పవిత్రమైన గ్రంథము. ఇది ఆవిర్భవించిన దినం గీతా జయంతి అంటారు. అది ముక్కోటి ఏకాదశి దినాన అంటే మార్గశిర శుద్ధ ఏకాదశినాడు వస్తుంది.
ఇక సాయి సాంప్రదాయం కూడా ఇతర మతాలకంటే భిన్నం కాదు. సాయి బాబా విజయదశమి నాడు (1918లో) తనువు చాలించాడు.
ఆయన ఎవర్నీ తన వారసునిగా, శిష్యునిగా, గురు పరంపరను కొగసాగించేందుకు నియమించ లేదు.
అదీకాక ఆయన ఏ గ్రంథాన్నీ రచించలేదు. ఐతే, సాయి శరీరం విసర్జించిన తరువాత సాయి సాంప్రదాయానికి ఒక పవిత్ర గ్రంథంగా ఒక రచనను చేయించారు. అదియే శ్రీ సాయి సచ్చరిత.
సాయి మహత్తును, తత్వాన్ని ఒక రచన ద్వారా తెలుపుదామనే కోరిక హేమాడ్పంత్కు కలిగింది. హేమాడ్పంత్కు కోరిక కలగటం కాదు, సాయియే అట్టి ఆలోచనను కలిగించారు.
సాయి ఆ రచనను చేయటానికి అంగీకరించారు. సూచనలిచ్చారు. అయితే సాయి మహా సమాధి అనంతరం శ్రీ సాయి సచ్చరిత తయారైంది.
మణిగారు ”సాయి బాబా సంకల్ప శక్తి, క్రియా శక్తి, జ్ఞాన శక్తి యొక్క పవిత్ర త్రివేణీ సంగమం శ్రీ సాయి సచ్చరిత్ర.
సాయి అపార అనుగ్రహం, హేమాడ్పంత్ కలం ద్వారా ప్రవహించింది.
శ్రీ సాయి సచ్చరిత పవిత్ర గంగ. గంగా స్నానం జీవులను పావనం చేసినట్లుగా, శ్రీ సాయి సచ్చరిత శ్రవణం భక్తులను పునీతులను చేస్తుందని శ్రీ సాయి సచ్చరితలో అనేక సార్లు వక్కాణింపబడ్డది.
సాయి తండ్రి వాత్సల్య రసపాత్ర శ్రీ సాయి సచ్చరిత” అంటారు. పేరుకు రచయిత హేమాడ్పంత్. వ్రాసినది సాయినాథుడే.
శ్రీ సాయి సచ్చరిత నవంబరు 26, 1930న వెలువడింది. ఈ దినం సాయి సచ్చరిత జయంతి. సాయి భక్తులకు అందచేసినది శ్రీ రామచంద్ర ఆత్మారాం తర్కడ్.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- జగమే ‘జ్ఞానేశ్వరి’ ….సాయి@366 సెప్టెంబర్ 17…Audio
- శ్రీ సాయి సచ్చరిత OVI TO OVI (మణెమ్మ)
- కడివెడు మజ్జిగ…..సాయి@366 ఆగస్టు 28…Audio
- మొక్కును పూర్తిగా తీర్చాలి…..సాయి@366 నవంబర్ 24….Audio
- అతిథి దేవోభవ…..సాయి@366 నవంబర్ 4….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments