మొక్కును పూర్తిగా తీర్చాలి…..సాయి@366 నవంబర్ 24….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


శ్రీమతి బాపత్‌ సాయి భక్తురాలు. ఒకసారి ఆమె సాయిబాబాకు ఎనిమిది అణాలు దక్షిణగా సమర్పించదలచింది.

మరల మనసుమార్చుకుని నాలుగు అణాలు మాత్రమే దక్షిణగా సమర్పించింది. సాయి అప్పుడు ఆమెతో ”అమ్మా! మిగిలిన నాలుగు అణాలు ఇవ్వక ఎందుకు ఈ పేద బ్రాహ్మణున్ని మోసగిస్తావు?” అన్నారు.

ఆమె తన తప్పుకు సిగ్గుపడి, నాలుగు అణాలను సమర్పించింది.

ఒకసారి సద్గురువుకు సమర్పిద్దామనుకున్న పైకం వారిదే అవుతుంది. సాయి తన భక్తుల్ని అటువంటి  పాపాలనుండి కాపాడుతాడు.

సాయి మహా సమాధి చెందారు. సమాధి అనంతర లీలలూ ఉన్నాయి ఈ విషయంలో.

జంషెడ్‌పూరు నివాసి శ్రీ పరశురాంగోర్‌ 9-7-1966 సాయంత్రం ఇంటికి తిరిగి వెళ్ళేటప్పుడు పార్శ్వపు పక్షవాతానికి గురయ్యాడు.

వైద్యుడు పరీక్ష చేసి మరునాడు ఉదయం ఆసుపత్రిలో చేరమని సలహా ఇచ్చాడు. ఆసుపత్రిలో చేరాడు.

శారీరక బాధ, దానికి జతగా మానసిక అస్వస్థత అతనిని కృంగతీస్తున్నాయి. అనేక బాధలకు అతడు గురయ్యాడు. గోరే కుటుంబం సాయి బాబా భక్తులు.

ఆ సమయమున ఆతని కుటుంబ సభ్యులు సాయి బాబాను ప్రార్ధించి ”తండ్రీ! మీరు ఆయన వ్యాధిని త్వరగా నయము చేసినచో షిరిడీ సాయి సంస్థానమునకు పది రూపాయలు పంపెదము” అని మ్రొక్కుకున్నారు.

ఆసుపత్రిలో ఎట్టి మార్పు లేకుంటే ఇంటికి పంపివేశారు. సాయి కృపచే, ఇంటి వద్దనే వైద్యము చేయించగా స్వస్థత చేకూరింది.

సాయి సంస్థానమునకు వారు అయిదున్నర రూపాయలు మాత్రమే పంపిరి. సంస్థానము వారు దాసగణూగారి 4 అధ్యాయాలు, సచ్చరిత పంపారు. ఊదీ మాత్రము వారికి అందలేదు.

పరశురాంగోర్‌ మామూలు మనిషి అయ్యాడు. విధులను నిర్వర్తించుటకు తగినట్లుగా ఉన్నాడనే పత్రాన్ని ఫ్యాక్టరీ డాక్టరు ఇచ్చుట లేదు.

ఆ కుటుంబం తీవ్రంగా ఆలోచించి, సాయికి పది రూపాయలు పూర్తిగా పంపకుండుట కారణమని పది రూపాయలు పంపారు.

ఒక వృద్ధ బిక్షకుడు వస్తే ఆ కుటుంబం వారు రెండు పైసలు ఇచ్చారు. ”నీ భర్త కుదుటపడును” అని గోరే భార్యతో అన్నాడు. ఇది 24-11-1966న జరిగింది. అంటే ఆ దినం దక్షిణ పూర్తిగా ముట్టింది.

డాక్టరు పరీక్షచేసి, విధులకు తగియున్నాడని పత్రం ఇచ్చాడు. దానితో ఆ కుటుంబం సంతసించి ఇదంతా సాయి మహిమయే అని తెలుసుకున్నారు.

మొక్కు విషయంలో అప్రమత్తత కూడదు.

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles