Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
ఖాన్ అబ్దుల్ కరీంఖాన్ సాహెబ్ హిందుస్తానీ సంగీతంలో ఉద్దండుడు. ఆయన 1914లో అమల్నేర్‌లో కచేరి చేయగా బూటీ ఆయనను షిరిడీకి ఆహ్వానించాడు.
ఆయన ఇతర చోట్లకు వెళ్ళటం మానుకొని షిరిడీకి వచ్చాడు. షిరిడీకి వచ్చింది ఆ జగదీశ్వరుడైన సాయి కోసమే.
ఆయన సాయిని యోగీశ్వరునిగా గుర్తించాడు. కుశల ప్రశ్నల అనంతరం ఖాన్ సాహెబ్‌ను మరాఠీలో భజన పాటను పాడమని సాయి అడిగాడు.
ఖాన్ సాహెబ్ తుకారాం అభంగాన్ని పీలూరాగంలో పాడాడు –
”హేచీ దాన దేగే దేవా…” అంటూ
అయన ఎంతో భక్తితో పాడాడు. సాయిబాబా కనులు మూసుకుని శ్రద్ధగా ఆ భజనను విన్నారు.
భజన పూర్తి అయ్యాక సాయి బాబా కనులు తెరచి ”ఎంత అద్భుతంగా పాడాడు. ఎంత భక్తిగా ప్రార్ధించాడు. వినగానే అతడి ప్రార్ధనను మన్నించాలనిపించేలా ఉన్నది” అన్నారు.
సాయి ”ఇక్కడ నుండి తొందరగా వెళ్ళవద్దు” అన్నారు ఆయనతో. అయితే ఆ మరునాడే ఆయన కుమార్తెకు అనారోగ్యంగా ఉంది రమ్మని ఉత్తరం వచ్చింది. ఆ ఉత్తరాన్ని సాయికి చూపాడు
సాయి మాటకు తిరుగులేదు. ఆ కుటుంబం వచ్చింది షిరిడీకి. మొత్తం 20 మంది.
ఆయన ఆ కుటుంబాన్ని చూసే బాధ్యతను తాత్యా కోతే పాటిల్‌కు అప్పగించారు. ఆయన భార్య తాహెరా తమ వంట తాము చేసుకుంటామన్నది తాత్యా కోతే పాటిల్ భార్యతో.
”వద్దు. బాబా దీనిని అంగీకరించరు. ఆతిధ్యం ఇచ్చే బాధ్యత మాది. మీకు ఏమి కావాలో, ఏమి వద్దో చెప్పండి” అన్నది ప్రేమగా తాత్యా భార్య.
షిరిడీకి రాగానే సుస్తీతో ఉన్న కూతురును సాయి వద్దకు తీసుకు వెళ్ళాడు ఖాన్ సాహెబ్. సాయి తీర్థం, ఊది ఇచ్చారు. రెండు రోజులలో ఆమె పూర్తిగా ఆరోగ్యవంతురాలైంది.
ఖాన్ సాహెబ్ భార్య ”ఘాలీన లోటాంగ..” ఆనందభైరవి రాగంలో పాడి సాయిని సంతోషపరచింది. ఆ కుటుంబం షిరిడీలో పది రోజులు ఉంది.
ఒక రోజు ద్వారకామాయిలో గ్రామస్తులందరి సమక్షంలో ఖాన్ సాహెబ్ తెల్లవారు రెండు గంటల వరకు కచ్చేరి చేసాడు.
సాయి ఆయనను ఆశీర్వదించి రూపాయి ఇచ్చి దీనిని ఖర్చుపెట్టవద్దు అని ఖాన్ సాహెబ్ భార్యకు ఐదు రూపాయలు పెద్ద డబ్బానిండా పేడాలు ఇచ్చారు.
ఖాన్ సాహెబ్ నవంబరు 11, 1872న జన్మించాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- మతిభ్రమించిన మహ్మద్ ఖాన్ ను రక్షించుట
- నేను నిన్ను మరవకుండా ఉండే వరమివ్వు-అబ్దుల్ కరీం ఖాన్ (ఖాన్ సాహెబ్ )–Audio
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- అదృశ్య గురువు…. మహనీయులు – 2020… జూన్ 7
- ప్రాపంచికమా? ఆధ్యాత్మికమా? …..సాయి@366 జనవరి 22…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments