దైవానుగ్రహం …. మహనీయులు – 2020… నవంబర్ 10



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


మార్టిన్ లూథర్ అసలు పేరు మార్టిన్ లూడర్ (Martin  Luder). ఈయన మాతృ భాష జర్మనీ. ఒకసారి మాత్రమే జర్మనీ దేశము నుండి బయటకు వెళ్ళాడు. చదువులో చురుకైన వాడు.

న్యాయ శాస్తమును చదువదలచాడు. కానీ దైవము నిర్ణయం వేరుగా ఉంది.

ఒకసారి మార్టిన్ లూథర్ భయంకరమైన తుఫానులో చిక్కుకు పోయాడు. తుఫాను నుండి బ్రతికి బయటపడితే క్రైస్తవ మతానికి జీవితాన్ని అంకితం చేస్తానని వేడుకున్నాడు.

తుఫాను గండం నుండి బయటపడ్డాడు. క్రైస్తవ సన్యాసిగా మఠంలో చేరాడు.

క్రైస్తవ మతంలో ఉన్న 95 విషయాలపై బహిరంగ చర్చకు ఆ మతాధికారులను రమ్మని పిలుపునిచ్చాడు.

పశ్చాత్తాప పత్రములను కొనినంత మాత్రమున వ్యక్తి పరిశుద్ధుడు కాలేడని, అంతరంగంలో మార్పు ఉండాలని అయన తెలిపాడు.

దైవంపై అచంచల విశ్వాసమే మనుగడకు దారి అని, నిజమైన ప్రశ్చాత్తాపము అవసరం ఎంతేని ఉన్నదని అయన భోధించేవాడు.

ఇటువంటివి మతాధికారులకు నచ్చలేదు. ఒక దశలో ఆయనకు శారీరక హాని సంభవించే సమయంలో, తన స్నేహితుడైన మార్టిన్ లూథర్ ను దాచివేయటం జరిగింది.

అలా దాచివేయ బడిన కాలాన్ని ఆయన వృధా చేసుకోలేదు. అంతవరకు లాటిన్ భాషలో ఉన్న పరిశుద్ధ గ్రంథమును తేటతెల్లమైన జర్మనీ భాషలోకి ఆయన అనువదించి, ప్రతి సామాన్య మానవుడు కూడా అర్ధము చేసుకోగలిగినట్టు చేసిన మార్టిన్ లూథర్ ధన్యజీవి.

అంతవరకు సంస్కృత భాషలోనే ఉన్న భగవద్గీతను, భావార్థదీపిక అను పేరుతొ జ్ఞానేశ్వరుడు మరాఠీ భాషలోకి అనువదించి ప్రజలకు అందుబాటులోనికి తెచ్చాడు.

ఈయన క్రీస్తు జనన దినమైన డిసెంబర్ 25 ప్రాముఖ్యతను అందరికి తెలిపి, ఆ దినమునకు విశేష ప్రాధాన్యత కలుగ చేసిన చిరస్మరణీయుడు.

ఈయన భావములు తిరుగుబాటుగా కనిపించినను, క్రైస్తవ మతములో పునరాలోచనలకు చోటిచ్చాయి.

క్రైస్తవ మతాధిపతులు అవివాహితముగా ఉండవలననే నియమాన్ని ఈయన కాదన్నాడు. కేథరినా అనే మహిళను వివాహం చేసుకుని ఆదర్శ పురుషుడయ్యాడు.

ఈయన నడిపినది మానవ చరిత్రలోని అత్యంత విశేషమైన ఉద్యమం.

అలభ్యంగా ఉండే పరిశుద్ధ గ్రంథం అందరికి లభ్యం కావటం, విశ్వసించే వారికి కృపతో దైవానుగ్రహం లభిస్తుందని అందరకూ ఆయన వలననే తెలిసినవి.

ఈయన జన్మించినది నవంబర్ 10, 1483.

నేడు నవంబర్ 10. మార్టిన్ లూథర్ జయంతి.

ఆయనను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles