Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
స్వామి శివానందులు నవంబరు 16, 1854లో జన్మించారు. రామకృష్ణ పరమహంస నుండి సన్యాస దీక్షను పొందిన మహనీయుడు.
ఒకసారి స్వామి శివానందను ఒక గృహస్థుడు భోజనానికి ఆహ్వానించాడు.
భోజనం చేసి తిరిగి సందు దాటే ముందు కొంతమంది పేదవారు, ఎవరో వదిలేసిన ఆహారం కోసం పోట్లాడుకోవటం చూచి, ఆ దృశ్యాన్ని భరించ లేకపోయారు.
ఆ గృహస్తును వారందరకీ భోజనం పెట్టమన్నారు. గృహస్తు అలాగే చేసాడు. ఒకరి ఆకలిని మనం గ్రహించగలిగితే, దైవం మన ఆకలిని తీర్చుతాడు.
స్వామి శివానంద ఖండేరావ్ బాబాను సందర్శించటానికి వెళ్లారు. దర్శనం అయ్యేదాకా నిరాహారిగానే ఉన్నారు ఆయన (శివానంద).
సమయం దాటిపోయింది. కానీ ఆకలి వేస్తోంది. తినేందుకు ఏమీ దొరకలేదు. ఆ చుట్టుప్రక్కల గ్రామమే లేదు.
ఆయన కూర్చున్న చెట్టు నుండి బాగా మాగిన ఒక పెద్ద వెలగ పండు పడ్డది. చుట్టూరా ఎవరైనా ఉన్నారా, వారికి కొంత ఇద్దామనుకున్నారాయన.
ఎవరూ లేరు, రాలేదు. ఆ పండు, భగవంతుడు ఇచ్చిన పండు, ఆకలిని తీర్చింది.
ఉదక మండలంలో ఆయన. ఆయన సేవకుడు ఉన్నారు కొంతకాలం, ఒకసారి షికారు వెళ్లారు.
దారిలో క్రైస్తవ మత ప్రచారకురాలైన మహిళ కనిపించింది. ఆమెకు ‘శుభోదయం’ అని అభివాదం చేశారు ఆయన.
కానీ ఆమె ఆయనను తిరస్కార దృష్టిలో చూచి వెళ్లిపోయింది.
“చూడండి, ఆమె మిమ్ములను అవమానించి వెళ్లిపోయింది” అన్నాడు సేవకుడు. “ఫర్వాలేదు. ప్రపంచ మందలి స్త్రీలందరిలో జగజ్జనని ఉంది”. అన్నారు శివానంద.
మంత్ర దీక్ష కావాలని ఎవరైనా వచ్చారేమో చూచి రమ్మని స్వామి శివానంద, ఒక వ్యక్తిని పంపారు.
ఆ వ్యక్తి ఒక మహిళ “వారిని (మహాపురుష్) (స్వామి శివానందను) ఇప్పుడు కలవవచ్చా?” అని అడిగి తన దుర్భర గాథను వెల్లడించింది.
ఆ వ్యక్తి ఆమెను స్వామి శివానందులవారి వద్దకు తీసుకు వెళ్లాడు.
ఆమె కొంత దూరంలో ఉండగా “మహారాజ్! ఒక స్త్రీ వచ్చింది. కానీ ఆమె…” అని చెప్పబోయాడు.
“అదేముంది. ఆమెను గంగా నదిలో స్నానం చేసి, దేవాలయం దర్శించి రమ్మను” అన్నారు శివానందులు. ఆమెతో ఆ వ్యక్తి అలాగే చెప్పాడు.
ఆమెకు మంత్ర దీక్ష ఇచ్చారు స్వామి శివానంద.
మహాత్ముల చల్లని చూపులకు అందరూ అర్హులే.
నేడు నవంబర్ 16. స్వామి శివానందుల జయంతి దినం.
వారి ఉన్నత భావములు అందరనూ ఉత్తేజ పరచుగాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- అడ్డదారి …. …. మహనీయులు – 2020… ఆగస్టు 3
- ప్రార్దించు! …. మహనీయులు – 2020… జూలై 14
- శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 1
- శీతల కిరణాలు…. మహనీయులు – 2020… నవంబర్ 3
- భిక్షాన్న నివేదన …. మహనీయులు – 2020… ఏప్రిల్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments