భిక్షాన్న నివేదన …. మహనీయులు – 2020… ఏప్రిల్ 16



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా భిక్ష చేసిన ఇండ్లనుండి తెచ్చుకున్న ఆహార పదార్దాలను తినేవారు. సాయి ఎప్పుడైన భిక్షకు పోనప్పుడు ఇతరులను బిక్ష కోసం పంపేవాడు.

తిక్కయ్యస్వామి నార్పల సమీపంలో మహాసమాధి చెందారు.

మహాసమాధి అనంతరం ఒక కావడిలో బిక్ష తెచ్చి, ఆ భిక్షాన్నాన్ని మహాహాసమాధి చెందిన తిక్కయ్య స్వామికి నివేదించి ఆ ప్రసాదాన్ని అందరకూ పంచేవారు.

స్వామికి నైవేద్యంగా తెచ్చే కావడి అన్నం 20 లేక 30 మందికి భక్తులకు సరిపోయేటంత ఉంటుంది. కానీ వందమందికి పెట్టినా ఇంకా మిగిలే ఉండేది. నార్పల తిక్కయ్యస్వామిది గురు భక్తి.

తిక్కయ్యస్వామి ప్రతి దినం భక్తుడైన ఒక వ్యక్తికి సారాయి దుకాణం ఉంటె, వెళ్ళి సారాయి త్రాగేవాడు.

ఎంత త్రాగినా మత్తు అనేది తిక్కయ్యస్వామిలో ఎవరూ చూడలేదు. దైవ భక్తిలో నిండా మునిగిన వానికి సారాయి ఏం మత్తు ఇవ్వగలదు?

ఒకసారి ఆ సారా దుకాణం యజమానికి తిక్కయ్యస్వామికి సారా ఇవ్వటంవలన నష్టం వస్తోందనే ఆలోచన వచ్చింది.

ఒకనాడు అప్పుడే అంగడికి సారాయి జాడీలు వచ్చాయి. బోణీ కాలేదు. మూతలనైనా తీయలేదు. తిక్కయ్యస్వామి వచ్చారు ప్రతిదినం వచ్చినట్లు “ఈ దినం సారాయి లేదు స్వామి” అన్నాడు ఆ దుకాణదారుడైన భక్తుడు.

“లేకపోతె పోనీలే” అంటూ వెనుదిరిగిపోయాడు తిక్కయ్యస్వామి. తరువాత జాడీ మూత తీసి చూస్తే ఒక చుక్కయినా సారాయి లేదు. తన తప్పును తెలుసుకున్నాడు దుకాణదారుడు.

వెంటనే స్వామి ఎక్కడున్నాడో పోయి ఆయన పాదాలపై పడ్డాడు “ఏమిటి సారాయి లేదా?” అంటూ స్వామి వెళ్లి ఆ జాడీపై చేయి పెట్టారు. సారాయి జాడీనుండి పొంగిపొర్లింది.

ఈ లీల అంతటా వ్యాపించింది. ఒకసారి స్వామి భక్తుడైన సంజప్పతో “నీ భుజాలపై నన్ను కూర్చుండపెట్టుకొని మోసుకుపోరా” అన్నారు. అతడు అంగీకరించాడు.

దృడంగా ఉండే స్వామి నెత్తుకుని నడుస్తుంటే, దూది మూటవలె ఇంత తేలికగా ఉన్నదే స్వామి అంటూ నడుస్తున్నాడు.

కొంత దూరం పోయిన తరువాత స్వామిని మోయలేకపోయాడు. “స్వామి మోయలేను” అన్నాడు. స్వామి నవ్వి ఫర్వాలేదు అన్నాడు. వెంటనే అయన దూది మూటంత బరువే ఉన్నాడు నంజప్పకు.

ఇటువంటి సంఘటన సాయిబాబా భయ్యాజీ పాటిల్ కు చూపారు.

యరపరెడ్డి స్వామి భక్తుడు. యరపరెడ్డి గృహాన్ని దహనం చేద్దామనే కక్షతో అయన విరోధులు ఆ ఇంటికి వచ్చారు.

ఆ సమయంలో యరపరెడ్డి నిద్రపోతున్నాడు. దుండగులు ఇంటికి నిప్పు అంటించబోతుంటే, వారి కండ్లు మసకబారి చూపు కనబడలేదు.

స్వామి యరపరెడ్డిని నిద్రలేపి మాయమయ్యారు. పరిస్థితిని చూచి యరపరెడ్డి తక్షణ చర్య తీసుకున్నాడు.

నార్పల తిక్కయ్యస్వామి చైత్ర (సామాన్యంగా ఏప్రియల్ లో వస్తుంది) శుద్ధ షష్టినాడు దేహాన్ని విసర్జించాడు. స్వామి మనలను కూడా ప్రాపంచిక విషయముల నుండి కాపాడు గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles