Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా సాహిత్యం పరిశీలిస్తే, ఇతర యోగులతో కన్నా అక్కల్ కోట మహారాజుతో తన బంధం ఎక్కవగా కనబడుతుంది.
బాపూ సాహెబ్ జోగ్ మొదట అక్కల్ కోట మహారాజును, అనంతరం సాయిబాబాను సేవించిన భక్తుడు.
వామన్ బువా అక్కల్ కోట స్వామి కోసం అన్వేషిస్తూ బయలుదేరాడు.
ఒకనాడు ప్రాతః కాల సమయాన మహత్తరమైన తేజస్సు కలిగిన వ్యక్తి నడుములోతు నీళ్ళలో ప్రార్థనచేయటం చూచి, ఆయనే అక్కల్ కోట మహారాజుగా గుర్తించి, వినమ్రుడై, శిరస్సు వంచి నమస్కరించాడు.
తిరిగి తలను పైకెత్తేసరికి అక్కల్ కోట మహారాజు స్థానంలో మూడు తలలతోను, ఆరు చేతులతోను దత్తాత్రేయస్వామిగా కనిపించారు.
వామన్ కు ఒడలు పులకరించింది. మరి కాసేపటికి అక్కల్ కోటా మహారాజుగా దర్శనమిచ్చారు.
“మియా! హైదరాబాదు నుండి వచ్చావా? నిన్నిక్కడకు ఎవరు రప్పించారు? సయ్యద్ భయ్యా! నీవు రోజు ఖురాన్ శ్రద్దగా చదువుతున్నావా?” అని అక్కల్ కోట మహారాజ్ తనవద్దకు మొదటిసారిగా వచ్చిన వ్యక్తిని పలకరించారు.
ఆ వ్యక్తి ఆశ్చర్యపోలేదు. కానీ అక్కడున్నవారంతా ఆశ్చర్యపోయారు. స్వామి చెప్పిన వివరాలన్నీ సరైనవే.
అతను “రోజూ శ్రద్దా భక్తులతో ఖురాన్ చదువుతున్నాను. కానీ నా మనసులో ఎదో అశాంతి, ఆరాటం. ఆ తపన నాకు పోవటం లేదు.
మౌల్వీలను, సాధు సన్యాసులను విచారించాను. మీ పేరు విని ఇక్కడకు వచ్చాను” అన్నాడు.
అతడు స్వామి ముఖం చూడగా, ఆయన ముఖం కనబడలేదు. ఏదో లోపల గుహలా కనిపించింది. ప్రకాశవంతమైన వెలుగు ఉంది.
స్వామి ” నేనిక్కడ ఉన్నాను” అని విచిత్రమైన కంఠంతో పలికారు. శబ్దం వచ్చిన చోటువైపు చూచాడు.
“యా అల్లా” అని సయ్యద్ అరిచాడు. “యా అల్లా, యా ఖుదా, యా పర్వర్థిగార్” అంటూ దర్శనానుభూతిని పొందాడు.
అతని అశాంతి మాయమైంది. కాసేపటికి అతను ఆ ప్రభావం నుండి బయటపడ్డాడు.
“నీవు పవిత్రుడవు. నీ జీవితం భగవంతునికి అర్పింపబడినది. నీవు ధన్యుడవు” అన్నారు మహారాజ్ అతనిని చూస్తూ.
ఒంబాగార్డన్ క్రైస్తవుడు. అక్కల్ కోటలో రాజ ప్రతినిధిగా ఉండేవాడు. అతనిని ఏదో పురుగు కుట్టింది. ఏ వైద్యం ఉపకరించలేదు.
స్వామి సమర్థ(అక్కల్ కోట మహారాజ్) అతనిని కాలును మర్దన చేయించుకొనుమని, బియ్యము కడిగిన నీళ్లు, నిమ్మరసం కలిపి రోజుకు మూడుసార్లు చొప్పున మూడు రోజులు త్రాగమన్నారు.
ఈ వింత చికిత్సతో అతను రోగ విముక్తుడయ్యాడు. అతనికి స్వామి క్రీస్తు అవతారమనే భావన కలిగింది.
మత ప్రమేయం లేకుండా, అందరికీ వారి వారి ఇష్టానుసారంగా దర్శనమిచ్చి, సన్మార్గంలో పెట్టిన అక్కల్ కోట మహారాజు 1878 చైత్ర శుద్ధ త్రయోదశి (సామాన్యంగా ఏప్రియల్ నెలలో వస్తుంది) నాడు మహాసమాధి చెందారు.
అక్కల్ కోట మహారాజును స్మరించెదము గాక.
“శ్రీ స్వామి సమర్థ! జై జై స్వామి సమర్థ”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పేరు మార్పు – అంతే …..సాయి@366 జూలై 25…Audio
- కరుణ కోసం తపన…. మహనీయులు – 2020… నవంబర్ 22
- స్వామి నారాయణ …. మహనీయులు – 2020… జూన్ 1
- సాయి మార్గములో పెద్దలు(శ్రీ పూర్ణానంద స్వామి – శ్రీశైలం)
- స్వర్ణ పత్రంలో స్వామి భోజనం…. మహనీయులు – 2020… నవంబర్ 16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments