కరుణ కోసం తపన…. మహనీయులు – 2020… నవంబర్ 22



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అక్కల్ కోటలో స్థిరపడిన స్వామి సమర్థుల వారి శిష్యులలో ప్రఖ్యాతి చెందిన మహనీయుడు బీడ్కర్ మహారాజ్. ఈయన నవంబరు 22, 1839న జన్మించాడు. ఈయన కుల దైవం హనుమంతుడు.

ఈయన మహా భక్తుడు. బాల్యంలో పాండురంగని దర్శిద్దామని పండరీపురం వెళ్లాడు. కానీ ఇసుక వేస్తే రాలనంతమంది ఆ దినం రంగని దర్శనానికై ఉన్నారు.

ఇక తనకు దర్శనం లభించనే లభించదని రూఢీ చేసుకున్నాడా బాలుడు. వెంటనే ఏడుపు లంకించుకున్నాడు.

ఆ ఏడుపు విని పండరీపుర మందిరంలో పనిచేసే అర్చకుడు వచ్చి, ఆ బాలుని వెంట తీసుకుని దర్శనం చేయించాడు.

దర్శనమే కాదు, పాండురంగనిపై ఉన్న ఒక చిన్న పూల దండను తీసి ఇచ్చాడా బాలునకు. ఆ అర్చకుడెవరో కాదు. సాక్షాత్తు పాండురంగడే.

పెద్ద వాడైనాడు. నలుగురితో పాటుగా సప్తశృంగి దేవతను దర్శించటానికి వెళ్లాడు.

అందరూ చూస్తుండగా సప్తశృంగి దేవత నోటి నుండి తాంబూలం (పాన్ బీడా) ఆతని చేతిలో పడింది.

అంతవరకు అమ్మ నోటి నుండి తాంబూలం పడలేదు. ఇదే అందరినీ ఆకర్షించింది. అమ్మ కృపకు పాత్రుడైనాడని అందరూ గ్రహించారు.

అనుకోని విధంగా ధనికుడైనాడు. సర్వ వ్యసనాలకు బానిసైనాడు. సర్వ సుఖాలు పొందాడు.

చివరకు విరక్తి కలిగింది. ఎందరినో దర్శించాడు ఆత్మ శాంతి పొందటానికి. ఆత్మ శాంతిని ప్రసాదించగల గురువు లేడు. ఆవేదన ఎక్కువ కాసాగింది.

కుల దేవత అయిన హనుమంతుడు అక్కల్ కోటలో నివసిస్తున్న స్వామి సమర్దను దర్శింపమని ఆదేశించాడు.

అది తిరుగులేని ఆజ్ఞగా భావించాడు. ఆయన వద్ద చేరి సేవ చేయ నారంభించాడు. విసుగు విరామం లేకుండా సద్గురు సేవ చేసేవాడు.

ఒకనాటి రాత్రి స్వామి సమర్థులు నిద్రిస్తున్నారు. గురు నిద్రకు భంగం కలగ  కూడదని సున్నితంగా పాదాలను ఒత్తుతున్నాడు. అప్పుడే ఒక పాము వచ్చింది.

పాద సేవ చేయనీయకుండా అది అడ్డు పడుతోందని భావించాడు. పాద సేవ వదలలేదు. బుస్సు మని కరవటానికి వచ్చింది. అయినా ఆతడు చలించకుండా పాద సేవ చేస్తున్నాడు.

అక్కల్ కోట స్వామి నిద్ర నుండి లేచి “రాక్షసుడా పో” అని అక్కల్ కోట మహారాజ్ చెంప దెబ్బలు కొట్టారు. రెండు రోజులపాటు అతను అతీతానందం అనుభవించాడు.

అంకిత భక్తుడు, ప్రముఖ శిష్యుడైనాడు. బీడ్కర్ స్వరూప సాంప్రదాయాన్ని నెలకొల్పాడు.

అక్కల్ కోట మహారాజ్ వలె బీడ్కర్ తన భక్తులను సందర్శకులను దైవంపై చింతను బోధించే వాడు, పెంపొందించే వాడు.

నేడు నవంబర్ 22. బీడ్కర్ మహారాజ్ జయంతి.

అన్ని దుర్వసనాలను నిర్ములించి, సన్మార్గమున సద్గురువు మనలను నడిపింప వలెనని ప్రార్దించుదాం!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles