Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఆనాడు నృసింహ సరస్వతి, తరువాత అక్కల్కోట మహారాజ్, ఆ తరువాత సాయిబాబా. వీరందరూ ఒక్కటే! ఒకటే అని తెల్పటానికి నేటికి వారందరూ కృషి చేస్తున్నారు.
అక్కల్కోట మహారాజ్ తానే నృసింహ సరస్వతి అని అనేక రుజువులు ద్వారా తెలియచేశారు.
అక్కల్కోట స్వామి అక్కల్కోటలోని వేప చెట్టు సగ భాగాన్ని తీపిగా చేసి, గానుగాపురం నుండి వచ్చిన భక్తులకు తానే నృసింహ సరస్వతులనే అనుభవాన్ని ఇచ్చారు.
అక్కల్కోట మహారాజ్ మహాసమాధి చెందుతారన్న వార్తను బాలప్ప, అక్కల్కోట మహారాజు భక్తుడైన కేశవ్ నాయక్ గారికి తంతి పంపాడు.
వెంటనే కేశవ్ నాయక్ తన కుమారుడైన రామచంద్రునితో అక్కల్కోట స్వామి వద్దకు వెళ్ళాడు. ”ఇప్పుడు నాకు, నా పిల్ల వానికి దిక్కెవరు” అని విలపించాడు కేశవ్ నాయక్.
స్వామి సమర్ధ తన పాదుకలను ఇచ్చి ”వీటిని పూజించుకో” అన్నారు. ఇంకా ”అహమ్మద్ నగర్ జిల్లాలోని షిరిడీ గ్రామంలో నా అవతారం ఉన్నది.
నన్ను ఎలాగైతే భక్తి ప్రేమలతో పూజించుకుంటున్నారో అలానే అక్కడ కూడా చేయి. అప్పుడు నీ మనసుకు సుఖ సమాధానాలు లభ్యమవుతాయి” అన్నారు.
స్వామి సమర్ధ మహాసమాధి చెందారు. మరో ఇద్దరు అక్కల్కోట మహారాజ్ భక్తులతో ఆ తండ్రి, కొడుకులు షిరిడీకి వెళ్ళి, సాయిని దర్శించారు.
ఆ ఫకీరు ఆ ఇద్దరిని చూచి, అక్కల్కోటలో జరిగిన సంభాషణ చెప్పారు. ”నీవు నీ కుమారుడు ఇక్కడకు రావచ్చును” అని వేప చెట్టును చూపి చెట్టు ఆకులను తెమ్మన్నారు.
ఆ ఆకులను ఆ తండ్రి, కుమారులు, వారితోపాటు వచ్చిన అక్కల్కోట మహారాజ్ భక్తులు తిన్నారు.
ఆ తండ్రీ కుమారులకు మాత్రం ఆ వేపాకులు మధురంగా ఉన్నాయి. మిగిలిన అక్కల్కోట మహారాజ్ భక్తులకు చేదుగానే ఉన్నాయి.
ఆ తండ్రి, కుమారులు సాయిబాబా, అక్కల్కోట మహారాజ్ ఒక్కటేనని విశ్వసించారు.
అనుభవాలను ప్రసాదించినా, విశ్వాసం లేనిదే ఫలితం ఉండదు.
ఎందరెందరో సత్పురుషులు తామంతా ఒక్కటే అనే అనుభవాలను ఇస్తున్నా, పేర్లు మార్పే గాని అందరూ ఒక్కటే అనే సత్యాన్ని తెలియ చేస్తున్నా చాలా మంది దానిని గ్రహించలేక పోతున్నారు.
రామచంద్ర నాయక్ ‘సాయి లీల’ మ్యాగజైన్ సంపాదకులకు జూలై 25, 1925న ఈ సంఘటనను ఉత్తరం ద్వారా తెలియ చేశారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- దృఢ నిశ్చయానికి ఊతం సాయి …..సాయి@366 సెప్టెంబర్ 25…Audio
- శ్రీ స్వామి సమర్థ జై జై స్వామి సమర్థ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 1
- వైశ్వ దేవం …..సాయి@366 జూలై 28….Audio
- కరుణ కోసం తపన…. మహనీయులు – 2020… నవంబర్ 22
- షిరిడీ పెరటిలోని చెట్టు…..సాయి@366 జూన్ 19….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments