Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
సాయి ధర్మాన్ని పాటింపుమని చెబుతాడు. అది రాజశాసనం లాగా ఉండదు. ఆప్త మిత్రుని వాక్కులా ఉంటుంది.
అందరూ వైశ్వదేవము – అన్నమును అగ్నికి ఆహుతి చేయమని చెప్పారు సాయి.
సాయి తనకు తెలిపిన వైశ్వ దేవమును గూర్చి సగుణమేరు నాయక్ శ్రీ బీ.వి. దేవు గారితో సంభాషించాడు.
ఆ దినం జూలై 28, 1921. అనంతరం సగుణమేరు నాయక్ శ్రీ బీ.వి. నరసింహ స్వామి గారితో కూడా అనేక విషయాలను ముచ్చటించాడు. అందులో ఒకటి వైశ్వదేవము.
1912లో సగుణ్ షిరిడీకి వచ్చాడు. ఉద్యోగం ఏమీ లేదు. తరువాత టీ, ఫలహారముల అంగడి నడిపే వాడు. సాయిబాబాకు నైవేద్యం వండి, నివేదించటం మొదలు పెట్టాడు.
అలా రెండు సంవత్సరాలు గడిచాయి.
ఒక రోజు సాయి కలలో సాక్షాత్కరించారు. ”నాకు మెత్తగా ఉడికించిన అన్నం ఉపాహారంగా తీసుకుని రా” అని ఆయన ఆదేశించారు.
ఆ స్వప్నంలో తాను ధుని వద్ద నిలబడినట్లు కనుగొన్నాడు సగుణమేరు నాయక్.
మరనాడు ఉదయము మెత్తటి అన్నాన్ని, అప్పడాన్ని, పెరుగును తీసుకుని వెళ్ళి సాయికి సమర్పించాడు. ఈ విధంగా ఉదయం ఏడు గంటలకు సాయికి సమర్పించాడు రెండు ఏండ్ల పాటు.
ఒక రోజు యధా విధిగా అన్నాన్ని తెచ్చాడు సగుణ్. ”అన్నం మీద నేతిని వేశావా?” అని సాయి ప్రశ్నించాడు.
”లేదు” అని సమాధానమిచ్చాడు సగుణ్.
”ఇకనుండి కొంచెం నెయ్యి కలిపి తే” సాయి ఆదేశించాడు.
సగుణ్ అలాగే తెచ్చాడు నేతిని కలిపి. సాయి బాబాయే ఒకటి, రెండు పిడికిళ్ళ ఆ అన్నాన్ని ధునికి సమర్పించారు.
”ఇకనుండి ధునికి కొంత అన్నాన్ని (నేతిని కలిపిన) సమర్పించి మిగిలినది నాకు ఇవ్వు” అన్నారు సాయి.
సగుణ్ అలానే సాయి మహా సమాధి చెందే వరకు ఆ వైశ్వ దేవ పూజ (అగ్నికి అన్నమును ఆహుతి చేయుట) చేసేవాడు.
మహా సమాధి తరువాత నేతిని కలిపిన అన్నాన్ని మసీదుకు తీసుకు వెళ్ళి, ముందు కొంత ధునికి అర్పించి, మరి కొంత సాయి పటం ముందుంచి మరి కొంత కొలంబాలో ఉంచి మిగిలినది కుక్కలకు వేసేవాడు.
ఇది సాయి పాటించి తెలిపిన వైశ్వ దేవము.
పస్తుతం దీనిని మధ్యాహ్నం షిరిడీ సంస్థాన పూజారి ద్వారకామాయిలో నిర్వహిస్తున్నారు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సాయి భక్త సగుణమేరు నాయక్ – రెండవ బాగం…..
- సాయి భక్త సగుణమేరు నాయక్ – మూడో బాగం…..
- ‘‘అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది”
- విదేశాల్లో ప్రథమ సాయి మందిరం…..సాయి@366 జూలై 29….Audio
- ప్రకృతిని శాసించే సాయి …..సాయి@366 జూలై 12….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments