‘‘అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!

ముందు భాగం కోసం ఇక్కడ  క్లిక్ చేయండి

 

(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)

‘‘పొయ్యండి పొయ్యండి’’ అంటూ వేడి నీటిలో గరిటెలా తన చేతిని పోనిచ్చి కలయబెట్టసాగారు బాబా.‘‘బాబా బాబా’’ ఆందోళన చెందారంతా. అయన చేయి కాలిపోతుందని, పొరలు పొరలుగా చర్మం లేచి వస్తుందని భయపడ్డారంతా. అదేం జరగలేదు. తట్టలోని బియ్యం గంగాళంలో పోసే వరకు చేత్తో కలియబెట్టి, తర్వాత చేతిని తీసి, కఫనీకి తుడుచుకున్నారు బాబా.

‘‘అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది. ఆకలితో ఉన్నవారికి మనం రెండు ముద్దలు పెడితే అల్లా మనకి వంద ముద్దలు పెడతాడు.

అన్ని జీవులకీ ఆకలి ఒకటే! కుక్క, పిల్లి, కోతి, ఈగ, చీమ దేని ఆకలి తీర్చినా మనకంతా మంచే జరుగుతుంది. చరాచర జీవరాసులన్నిటా అల్లా ఉన్నాడు. ఎవరికి ఏది నైవేద్యం చేసినా ఆఖరికి అది అల్లాకే చెందుతుంది.’’ అన్నారు బాబా.

కుత కుత ఉడుకుతున్న గంగాలంలోని అన్నాన్ని చూశారు. ఉడికిందీ లేనిదీ చూసేందుకు మరోసారి అందులో చెయ్యి పెట్టారు. వద్దని వారించబోయారు భక్తులు. పట్టించుకోలేదు బాబా. గంగాలం అడుగు నుంచి పిడికెడు అన్నం తీశారు. పిసికి చూశారు.

‘‘మెత్తగా మల్లెపువ్వులా ఉడికింది. బాగానే ఉంది.’’ అన్నారు బాబా. ఆసరికి మౌల్వీ వచ్చాడక్కడికి.‘‘అల్లాకి నైవేద్యం పెట్టు’’ అన్నారు బాబా. చిన్నపాత్రలోకి వేడివేడి అన్నాన్ని చేత్తో తీసి ఇచ్చారు. అలాగే మరో పాత్రలోనికి మరింత అన్నాన్ని తీసి, మహల్సాపతికి అందజేశారు.

‘‘తీసుకుని వెళ్ళి ఖండోబాకి నైవేద్యం పెట్టండి. ఆ ప్రసాదాన్ని మీరు స్వీకరించండి.’’ అన్నారు బాబా. సరేనన్నట్టుగా అక్కణ్ణుంచి కదిలాడు మహల్సాపతి.

వందలాదిగా నిల్చున్న భక్తుల్ని చూశారు బాబా. తల్లిలా వారి ఆకలిని తెలుసుకున్నారు.‘‘వడ్డించండి వాళ్ళకి’’ అన్నారు.శ్యామా, కాశీరాం, షిండే, తాత్యా విస్తర్లు వేసి అన్నాన్ని వడ్డించసాగారు.

వేడి వేడి అన్నాన్ని గరిటెలతో వడ్డిస్తూ, ఆ వేడిని వాళ్ళు తట్టుకోలేకపోయారు. పదే పదే ‘ఉఫ్‌ ఉఫ్‌’మని ఊదుకోసాగారు.

అంతటి వేడిలో గరిటెలా చేతిని ఉంచారు బాబా. ఏమనుకోవాలి ఆయన్ని? అంతుచిక్కలేదెవరికీ.అన్నదానం పూర్తయింది. భక్తులు కడుపు నిండా తిని వెళ్ళారు.

శ్యామా, షిండే, కాశీరాం, తాత్యా తినాల్సి ఉంది.

తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles