“సాయి, ఆ వుంగరాలు అన్ని మీరే తీసేసుకున్నారా! నేను ధన్యురాలను తండ్రి”



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అది 2006 వ సంవత్సరం నేను, నా భర్త, పిల్లలు, శ్రావణ మాసంలో శిరిడీకి వెళ్ళాము.

బాబా దర్శనం సమాధి మందిరం లో అయ్యాక ద్వారకామాయి లో దర్శనానికి వెళ్లి దర్శనం అయ్యాక అక్కడే కూర్చున్నాము.

అప్పుడు నా మనసులో ఒక ఆలోచన వచ్చింది. నేను నా భర్తతో అన్నాను. ‘ మనం ఏప్పుడు శిరిడీ వచ్చినా వెండిది బాబా వుంగరం కొనుకుంటాము కదా! అలా చాలా వెండి వుంగరాలు అయ్యాయి.ఇవన్ని ఒక వెండి దుకాణంలో అమ్మేసి కొత్తవి కొనుక్కుందాము.

దానికి మా వారి సమాధానం ఎందుకు అమ్మడం “అన్ని వెండి వుంగరాలు బాబా హుండీలో వేద్దాం, కొత్తవి కొందాము” అన్నారు.

నేను ఆయన మాట వినలేదు. అలానే అన్ని వుంగరాలు నా చేతిలో పెట్టుకొని ఎదురుగా వున్న దుకాణానికి వెళ్ళాను.

నా చేయి చూపించి ” ఈ వెండి వుంగరాలు అన్ని తీసుకొని నాకు కొత్త వుంగరం ఇవ్వు” అని అడిగాను. ఆ దుకాణం వాడు నన్ను పిచ్చిదానిలా చూశాడు.

ఏందుకు అలా చూస్తున్నాడు అనుకున్నాను. ఏంటి చూస్తున్నావు? అని దబాయించి అడిగాను. అతను అన్నాడు, మేడమ్, మీ చేతిలో ఏమి లేవు! ఎక్కడ వుంగారాలు! అన్నాడు అంతె, నేను ఆశ్చర్యంలో అలా నిలబడిపోయాను.

నిజంగానే నా చేతిలో ఒక్క వుంగరం కూడా లేదు.నిజంగా నా కళ్ళల్లో నీళ్ళు ఆగలేదు. “సాయి, ఆ వుంగరాలు అన్ని మీరు తీసేసుకున్నారా! నేను ధన్యురాలను అయినాను తండ్రి”అనుకున్నాను.

(ఎంత ఆశ్చర్యం చూడండి మన చేతిలో ఏముందో తెలీదు, మనసులో ఏమి ఆలోచన వుందో తెలీదు. భూత భవిషత్తు, వర్తమానం తెలియదు. అయన ఆడిస్తాడు, మనం ఆడతాం….మాధవి)

అప్పుడు నా ఏడుపు మొహం చూసి నా భర్త ఏమైంది, అలా వున్నావు! అని అడిగారు ద్వారకామాయిలో.

వుంగరం తెస్తానని వెళ్ళావు కదా! ఏదీ! అని అడిగారు. నేను జరిగింది చెప్పాను.

అప్పుడు మా వారు అన్నారు “బాబా వస్తువును నువ్వు అమ్మాలని చూశావు కానీ అది అదృశ్యంగా బాబా హుండీకీ చేరింది.” ఇంకా బాధపడకు. అందుకే నేను నిన్ను ముందే హెచ్చరించాను కదా! నా భర్త బాబాకు పరమ భక్తుడు.

తరువాత మేము దుకాణానికి వెళ్ళి బాబావి బంగారు వుంగరాలు చూపించు అన్నాం. దానికి ఆ దుకాణం వాడు మమ్మల్ని అదోలా చూశాడు.

నేను ఏంటి! బంగారం వి చూపించు అన్నాను. అతను ఇప్పుడే మీరు వెండివి కావాలన్నారు. ఇప్పుడు బంగారం అంటున్నారు? ఇంతకీ కొంటారా, లేదా! అన్నాడు. అప్పుడు నేను కొంటాము చూపించు” అన్నాను.

అతను చాలా బంగారు వుంగరాలు చూపించాడు. నేను దానిలో ఒకటి కొన్నాను, 8500 రూపాయలు అయింది.

ఆ దుకాణం వాడు అన్నాడు, మేడమ్ క్రింద ఏమి రాసిందో చూడండి’ అన్నాడు. చిన్న అక్షరాలలో రాసింది “If you look at me i look at you “ నిజమేగా.

ఆ దుకాణం వాడు అన్నాడు, నేను సమాధి మందిరంలో బాబా సమాధికి touch చేయించి తెస్తాను, మీరు ద్వారకామాయిలో కూర్చోండి అన్నాడు. మేము మళ్ళీ ద్వారకామాయి వెళ్ళాం.

అప్పుడు బాబా ‘దేవ్’ తో అన్న మాటలు గుర్తుకువచ్చాయి. ‘నేను బంగారు జరీ వస్త్రాలు ఇస్తామనుకుంటే, నీవు చిరిగిన పాత బట్టలు దొంగతనం చేస్తావేమిటి ” అది నిజమేగా మరి.

ఆయనకు నాకు బంగారు వుంగరం ఇవ్వాలని వుంది. నేను పాత వెండి వుంగరం కోసం వెంటపడ్డాను;

అప్పుడు మా వారితో అన్నాను “దైవం ఎక్కడో లేడు, ఇక్కడ, ఈ ద్వారకామాయిలోనే వున్నాడు” అని దుకాణం వాడు నా బంగారు వుంగరం పూజ చేయించి తెచ్చాడు.మేము తిరుగుప్రయాణం కట్టాము.

సర్వం సాయినాధార్పణమస్తు

మాలతి పవర్,
కొల్లాపూర్ మహారాష్త్ర

 

ఈ బాబా వారి లీల తెలుగు లోకి అనువదించిన వారు : మాధవి, భువనేశ్వర్

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Have any Question or Comment?

5 comments on ““సాయి, ఆ వుంగరాలు అన్ని మీరే తీసేసుకున్నారా! నేను ధన్యురాలను తండ్రి”

b vishnu Sai

Sai ram baagundi

Revanth

Om Sai Ram!

విజయ శ్రీకాంత్

చాల బాగుంది
సాయి రామ్

ఈ లీల చాల బాగుంది mam …మీరు రాసిన explanation లైన్ బాగుంది.

Madhavi

Okkokati raasetappudu.baba naaku edho nerputunnaru.anipistundhi..All the miracles r something learning proces…Jai sai ram.

Comments are closed for this post !!

Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles