Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
దేవుడు ఔనంటే అన్ని పనులూ అనాయసంగా జరిగిపోతాయి. జరగని పనంటూ ఉండనే ఉండదు. మంచి పనికి బాబా ఎప్పుడూ ఔనన్న మాటే! కాదన్న మాటే లేదు.
బాబా ఆశీర్వాదంతో సర్కిల్ ఇన్‌స్పెక్టర్ గోపాలరావు గుండుకి కొడుకు పుట్టాడు. అందుకు కృతజ్ఞతగా షిరిడీలో ‘ఉరుసు ఉత్సవం’ నిర్వహించాలనుకున్నాడతను. దానికి బాబా అనుమతి కావాలి. అనుమతిని అతనడగలేదు. శ్యామా చేత అడిగించాడు.
‘‘అనుమతి ఎందుకివ్వను? ఈ ద్వారకామాయి అన్ని మతాలకూ, అన్ని వర్గాలకూ, అన్ని కులాలకూ వేదికే! ఎవరయినా ఎప్పుడయినా ఏ ఉత్సవమైనా చేసుకోవచ్చు. నాకెలాంటి అభ్యంతరం లేదు.’’ అన్నారు బాబా.
ఉత్సవ సన్నాహాలు మొదలయ్యాయి. క్షణం తీరిక లేదెవరికీ. తన పనిలో తానుంటూ మహల్సాపతి షిరిడీలోని నీటి ఎద్దడి గురించి తీవ్రంగా ఆలోచించసాగాడు.
ఉరుసు ఉత్సవం అంటే జనం పెద్ద సంఖ్యలో పాల్గొంటారు. పాల్గొన్న భక్తులకి వసతి ప్రసాదాలు తర్వాతి సంగతి, ముందు దాహం తీర్చాలి. దాహం తీర్చాలంటే నీరేది? లేదు. ఉన్నవి రెండే రెండు బావులు.
ఒక బావి ఏనాడో ఎండిపోయింది. రెండోది ఎండలేదు కాని, అందులోని నీరు ఎవరూ తాగలేరు. ఉప్పుమయంగా ఉంటుందా నీరు.మరెలా? అదే మాట అడిగాడు బాబాని మహల్సా.
నీటి ఎద్దడి ఉందంటే, భక్తులు ఇబ్బందులు పడతారంటే బాబా తట్టుకోలేరు.ఉత్సవాన్ని వద్దంటారనుకున్నాడు శ్యామా. నీటి ఎద్దడి విషయం అనవసరంగా గుర్తు చేశాడు మహల్సాపతి అని కూడా అనుకున్నాడు.
బాబా ఏ నిర్ణయం తీసుకుంటారోనని అందోళన చెందాడతను.‘‘నిజమే! వచ్చిన జనానికి దాహం తీర్చాలి. మంచినీరివ్వాలి. ఇప్పుడేం చెయ్యాలి?’’ తనని తాను ప్రశ్నించుకున్నారు బాబా. గద్దె మీద నుంచి ఒక్క ఉదుటన లేచారు.
గబగబా ముందుకు నడిచారు. ద్వారకామాయి బయటకు వచ్చారు. నడవసాగారు. బాబా ఎక్కడికి వెళ్తున్నదీ ఎవరికీ అంతుబట్టలేదు. ‘ఎక్కడికి’ అని అడిగే ధైర్యం కూడా లేదెవరికీ. దాంతో బాబాని అనుసరించడం తప్ప, మరో ధ్యాస లేకపోయింది.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Latest Miracles:
- సాయి అమ్మ.. సాయి నాన్న.. సాయే అన్ని ఈ జీవితానికి, ఇంతకు మించి ఏమి కావాలి
- ‘‘అన్ని దానాల్లోనూ అన్నదానం గొప్పది”
- “సాయి, ఆ వుంగరాలు అన్ని మీరే తీసేసుకున్నారా! నేను ధన్యురాలను తండ్రి”
- సాయి బాబా అన్ని చోట్ల కనబడి నా కొడుకుకు ఆరోగ్యాన్ని ప్రసాదించారు
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–16
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments