బాబాతో దివ్యానుభూతి



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబాతో దివ్యానుభూతి

మనం బాబాగారిని ఆర్తితో పిలిస్తే తప్పకుండా పలుకుతారు. చిన్నపిల్లవాడు ఉన్నాడనుకోండి. ముందర బొమ్మలు పడేస్తే కాసేపు ఆడుకుంటాడు. తరువాత తల్లి కోసం ఏడుస్తాడు. మరి ఇక ఏ బొమ్మలు ఇచ్చినా పిల్లవాడు ఏడుపు మానడు. వాడికి వాళ్ళ అమ్మే కావాలి. భక్తుడయినవాడు అలా ఆర్తితో భగవంతుని గూర్చి ఏడవాలి. దేవా, నువ్వుతప్ప నాకేమీ వద్దు అని కనుక ప్రార్థిస్తే తప్పక మన మొర ఆలకిస్తాడు. అటువంటి అనుభూతిని మనం ఈరోజు తెలుసుకుందాము.

ఈరోజు శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి అమ్మాయి చి.సాయినా యొక్క దివ్యానుభూతి గురించి, శ్రీమతి ప్రియాంకా రౌతేలా గారి మాటలలోనే తెలుసుకుందాము

ఈరోజు నేను మీకు ఒళ్ళుగగుర్పొడిచే బాబా అనుభవాన్ని చెపుతాను. సాయంత్రం నేను, మా అమ్మాయి “సాయినా” బాబా గారికి పూజ చేస్తున్నాము. నిజానికి నేను, మా అమ్మాయికి ప్రతీరోజు పూజ చేయడం అలవాటు చేశాను. ఎందుకంటే, చిన్నప్పటినుంచే పిల్లలకి మనం ఆధ్యాత్మిక భావాలని నేర్పాలి, అప్ప్దుడే వారిలో ధైర్యము, నమ్మకము బలపడతాయి.

మా అమ్మాయికి 7 సంవత్సరాల వయస్సు. 3 సంవత్సరాల నుంచి తను బాబా ఆరతి పాటలు మరాఠీ లో పాడుతూ ఉంటుంది. మా అమ్మాయి సాయిపూజ ఎలాచేస్తుందో నమ్మాలంటే మా ఇంటిలో ఉండి చూడాల్సిందే.

నిజానికి ఒకసారి శిరిడిడిలో ఆరతి మధ్యలో ఒకామె మా అమ్మాయిని వి.వి.ఐ.పి. లు ఉండేచోట నిలబెడతానని మమ్ములను అడిగి తీసుకునివెళ్ళింది. తరువాత ఆమె, అంత చిన్నపిల్ల అంత స్పష్టంగా, భక్తితో బాబా ఆరతి మరాఠీలొ పాడటం ఎప్పుడూ చూడలేదు, అందుచేతనే ఆమెని బాబా సమాధి ప్రక్కనే నిలబెట్టానని చెప్పింది. మా అమ్మయి సాయినాని డా.బాబా గారే రక్షించారు. ఈ లీలను కొద్ది రోజులలో మీకు అందిస్తాను.

ఇక అసలు విషయానికి వస్తే ఈ రోజు సాయంత్రం (12.01.2011) నేను, మా అమ్మాయి సాయినా సాయంత్రం పూజ చేస్తున్నప్పుడు జరిగిన సంఘటన. ఆరతి పాడుతుండగా మా అమ్మాయి భావోద్వేగానికి లోనవడం గమనించాను. అప్పుడప్పుడు తను అలా భావోద్వేగానికి లోనవ్వడం జరుగుతూ ఉంటుంది కాబట్టి నేను పట్టించుకోలేదు.

కాని ఈ రోజు బాగా మార్పు ఉంది, ఆరతి అవగానే తను చాలా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. “సాయినా, యేమయింది?” అని అడిగాను. సాయినా, “అమ్మా! బాబాగారిని చూడాలని ఉంది, ఆయన నిజంగా వచ్చి నాతో ఎందుకు మాట్లాడరు? రోజూ కలలోకి వచ్చి, ‘వస్తాను, వస్తాను’ అంటారు బాబాగారు. నువ్వెప్పుడూ నేను బాబాగారి కూతురినని చెపుతావు, బాబాగారివల్లనే నేను బతికానని చెపుతావు, మరయితే నేను బాబాగారిని ఎందుకు చూడలేకపోతున్నాను?” అని అడిగింది.

ఆ క్షణంలో నిస్సహారాయులిని కనుక నేను కుడా ఏడవడం మొదలుపెట్టాను. ఏవిధంగానయినా సరే బాబాగారిని చూడాలని ఇంకా బిగ్గరగా ఏడవడం మొదలుపెట్టింది. ఈ సంఘటనతో నాకు నోట మాట రాలేదు. బాబాగారు భౌతికంగా ఎందుకు రాలేకపోతున్నారో ఇంత అమాయకంగా అడుగుతున్న చిన్నపిల్లకి నేనేమని సమాధానం చెప్పను? బాబాగారు రాకపోవడం మా అమ్మాయిని మానసికంగా బలహీనురాలిని చేస్తోంది.

సాయినా బాబాగారిని రమ్మని బాగా ఏడుస్తూ ప్రార్థిస్తోంది. హఠాత్తుగా తన చుట్టూ ప్రశాంతమయిన గాలి తనను చుట్టుముట్లినట్టు అయింది. బాబాగారు ఎదురుగా ఉండి గట్టిగా తన హృదయానికి హత్తుకున్నట్లుగా అనిపించింది. సాయినా, “అమ్మా! బాబాగారు నన్ను కౌగలించుకుంటున్నారు, నాకు తెలుస్తోంది, ఇక్కడ నుంచున్నారు” అని గట్టిగా అరిచింది.

జరిగినదంతా తెలియకపోయినా, సాయినా మాత్రం 5,6 నిమిషాల వరకూ బాబా గారి స్పర్శని అనుభవించింది. బాబాగారి అదృశ్య హస్తాలలో ఎంతో రక్షణని అనుభవించింది. ఇప్పుడామె ఏదోఒకరోజు బాబాగారిని ముఖాముఖీగా కలుసుకుంటామన్న నమ్మకంతో ఉంది.

బాబా యందు ఉన్న అచంచలమయిన భక్తికి విశ్వాసానికి ఇది గొప్ప అనుభవం. 7 సంవత్సరాల వయస్సున్న చిన్నపిల్లకి ఎంతో అద్భుతమయిన అనుభవాన్ని ఇచ్చారు. మమ్ములని సరయిన దారిలో, మంచి మార్గంలో నడిపించి మాకు మార్గదర్శకులుగా ఉండమని బాబాగారికి శిరస్సు వంచి మ్రొక్కుతున్నాను.

బాబాగారు యెల్లప్పుడూ తన భక్తుల కోర్కెలు తీర్చడానికి, కామధేనువు మరియు కల్పవృక్షము వంటివారు. ఈరోజు మా అమ్మాయికి ఇంకా భక్తిభావం పెరిగింది, బాబాకు నేను ఎంతో కృతజ్ఞురాలిని.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles