బాబాతో నా పరిచయం



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

బాబాతో నా పరిచయం 

ఇంతకు ముందు బాబా గురించి తెలియని వారిని కూడా బాబా గారు ఒక చిన్న లీల లేదా అద్భుతం చూపించి, తనకు దగ్గరగా చేసుకుంటారని, ఇక మనం ఆయనని విడిచి పెట్టము అని మనం తెలుసుకున్నాము. అటువంటిదే ఈ లీల.

యూ.ఎస్. నించి సాయి సిస్టర్ మాయా గారు చెప్పిన బాబా లీల.

నిజానికి మన ప్రియమైన బాబా గారి గురించి నాకు క్రిందటి సంవత్సరం మధ్యలోనే తెలిసింది.  ప్రతి రెండు నెలలకు నా భర్తకి కన్ను ఎఱ్ఱగా అవుతూ ఉండేది.  అటువంటప్పుడు ఆయనకి చాలా బాధగా ఉండేది, ఆఫీసుకు వెళ్ళలేకపోయేవారు. విపరీతమైన నొప్పి, వెలుతురు కూడా చూడలేకపోయేవారు. నేను వర్ణించలేను.

ఇలా, మా పెళ్ళైన రోజు నుంచే జరుగుతూ ఉండేది. మాకు పెళ్ళయి 10 సంవత్సరాలు అయింది. ఇన్ని సంవత్సరాలుగా ఆయన బాధను చూస్తూ, ఏడ్చినా, ప్రార్థించినా, ఏమీ ఉపయోగం లేకపోయింది.

ఒక రోజున నేను మా అబ్బాయిని స్కూల్ నించి తీసుకురావడానికి వెళ్ళినప్పుడు, అక్కడ ఒకావిడ, “నీకు బాబా గారి గురించి తెలుసా? నువ్వు బాబాని ఎందుకు ప్రార్థించకూడదు?” అని అడిగింది. బాబాని ప్రార్థిస్తే తనకు మనశ్శాంతి లభిస్తుందని చెప్పింది.

నేను యింటికి వచ్చి గూగుల్ లో బాబా గురించి వివరాలన్నీ తెలుసుకున్నాను. మొదట్లో నేను సందేహించాను, కాని మా యింటికి దగ్గరలో ఉన్న బాబా గుడికి వెళ్ళి ప్రార్థించాను. ఈ లోపున మా ఆయనకి అన్ని వైద్య పరీక్షలు చేయించాల్సి వచ్చింది. ఈ సమయంలో నాకు చాలా ఆందోళనగా ఉంది, కాని బాబా దయవల్ల వైద్య పరీక్షలన్నీ అనుకూలంగా వచ్చాయి.

నేను బాబా గుడికి వెళ్ళడం మొదలు పెట్టిన తరువాత, నా భర్తకి కొంచెం బాగున్నట్టుగా ఉన్నట్టు అనిపించింది నాకు. ఇప్పటి వరకు తనకి కళ్ళు ఎఱ్ఱ పడటం లక్షణాలు కనిపించలేదు. ఒక్కసారి మాత్రం కన్ను ఇరిటేషన్ గా ఉందని చెప్పడం తప్ప. అప్పుడు నాకు భయం వేసింది, బాబాని ప్రార్థించాను, కన్ను ఇరిటేషన్ అలర్జీ వల్ల వచ్చింది, మరునాటికి తగ్గిపోయింది.

బాబాగారు, నన్ను కారు ప్రమాదం నించి కూడా తప్పించారు, ఆయన దయవల్ల పోలీస్ కేసు అవలేదు. అప్పుడు ఒకరోజు సాయి సోదరుడు శిరీష్ ద్వారా ప్రార్థన కోరికని పంపించాను.

నేను నా కుటుంబ సభ్యుల వల్ల, ప్రియమైన వారి వల్ల నొచ్చుకున్నప్పటికి వారిని రక్షించమని బాబాని అడుగుతూ ఉండేదాన్ని. మా ఆడపడుచుకి ఎన్నాళ్ళైనా పెళ్ళి సంబంధం కుదరలేదు. సాయి సోదరుడు శిరీష్ భక్తులందరి ప్రార్థన కోరికలన్ని 3 రోజులలో షిరిడీ చేరాయన్న సంగతి నేను చదవడం జరిగింది.

ఉదయం నేను ప్రార్థన చేస్తున్నప్పుడు భారతదేశం నించి ఫోన్ వచ్చింది, ఆమెకు పెళ్ళి సంబంధం ఒకటి వచ్చిందని, దానిని నిశ్చయం చేసుకుంటున్నారని చెప్పారు. బాబా ఆశీర్వాదంతో తను తొందరలోనే జీవితంలో స్థిరపడుతుంది.

ఇంకొక విషయమేమంటే, నాకు బాబాని పరిచయం చేసిన ఆమెకు నా కృతజ్ఞతలు చెపుదామనుకున్నాను, కాని ఎందుకనో మరచిపోయాను. నేను మా కుటుంబంతో షాపింగ్ కి వెళ్ళాను. అక్కడ షాపులో ఆమెను చూశాను. కాని ఆమెకు కృతజ్ఞతలు చెప్పడం మరిచాను. మరునాడు నేను వేరే షాపుకి వెళ్ళాను. అక్కడ కూడా ఆమె కనపడింది. అప్పుడూ నేను కృతజ్ఞతలు చెప్పలేదు.

మూడవ రోజున మేము షాపింగ్ కి వేరే చోటకి వెళ్ళాము, అక్కడ కూడా ఆమె కనపడింది. వరుసగా మూడు రోజులుగా నేనామెను ఎందుకు చూస్తున్నానో నాకు ఆశ్చర్యంగా ఉంది. ఇంటికి వస్తూ ఆమె ఎందుకు అలా తరచూ నాకు కనపడుతోందని ఆలోచించాను. అప్పుడు గుర్తుకువచ్చింది, బాబా ని పరిచయం చేసిన ఆమెకు కృతజ్ఞతలు చెపుతానని బాబాకి ఇచ్చిన మాట. మరునాడు స్కూల్ వద్ద ఆమెను కలిసినప్పుడు ఆమెకు కృతజ్ఞతలు చెప్పాను.

బాబా గారు నాతో ఉన్నారనడానికి, నాకు దగ్గరగా ఉన్నారనడానికి చాలా అనుభవాలు వున్నాయి. కొన్ని గమనించకుండానే పోతూ ఉంటాయి, కొన్ని మాత్రం నేను ఆలోచించిన తరువాత, అవును నాకు సహాయం చేస్తున్నది బాబాయే అని అనిపిస్తూ ఉంటుంది.

కాని, తెలిసో తెలియకో ఈ జన్మలో గాని, క్రిందటి జన్మలో గాని బాబాకి మాత్రమే తెలిసున్న నేను చేసిన నా తప్పులన్నిటిని క్షమించమని నేను సవినయంగా బాబాని వేడుకుంటున్నాను. బాబా, ఈ లీలని పోస్ట్ చేయడంలో ఆలస్యం చేసినందుకు నన్ను మన్నించు బాబా.

నాకింకా కొన్ని సమస్యలున్నాయి, బాబా దయ వల్ల అవి తొందరలోనే తీరుతాయి. బాబా! నువ్వెప్పుడూ మాతోనే వుండమని వినయంగా వేడుకొంటున్నాను, మాకు ఈ ప్రాపంచిక అడ్డంకులని నమ్మకంతో, భక్తితో ఎదుర్కొనే శక్తిని ప్రసాదించు. మా బుద్ధి నిశ్చలంగా ఉండి, మా మనసంతా భక్తితో నిండి, చివరికి గమ్యాన్ని చేరేలా చెయ్యి.

మా ప్రియమైన సాయి చరణాలు, మన ప్రియమైన బాబా మనలనందరిని అనుగ్రహించు గాక.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles