బాబా గారితో నా పరిచయం, నా జీవితం లో బాబా గారు చూపిన మొదటి అద్భుత లీల.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


నా పేరు సంతోషి రాణి. శ్రీకాకుళం జిల్లా లో ఉన్న పాలకొండ మా ఊరు. మా ఇంటి లో మా నాన్న, బాబాయి బాబా భక్తులు.

వాళ్ళు ఏది వచ్చినా బాబా బాబా అంటూ ఉండేవారు. అందుకని బాబా తో నా పరిచయం అంటూ వేరే ఏమి లేదు.

నాకు ఊహ తెలిసిన దగ్గర నుండి బాబా తెలుసు. మా నాన్న నన్ను చాలా ప్రేమగా చూసేవారు.

మా బాబాయి పెళ్లి లో పందిరి లో ఏదో ఒక కర్రని, నాన్నని మార్చమన్నారు. ఎందుకంటే నాన్న చాలా పొడుగ్గా వుండేవాడు. ఆ కర్ర మార్చబోయే సరికి హైటెన్షన్  వైర్ షాక్ తగిలి నాన్న చనిపోయాడు.

అప్పటికి నా వయస్సు 8 సంవత్సరాలు. 2 వ తరగతి చదువుతున్నాను. మా నాన్నమ్మ కి నాన్న పెద్ద కొడుకు.

నేను మా నాన్న కి పెద్ద కూతుర్ని. నా తర్వాత ఒక తమ్ముడు. హఠాత్తుగా నాన్న చనిపోవటాన బాధని ఎలా దిగమింగుకోవాలో తెలియని అమ్మ నా మీద కోపం చూపిస్తుండేది.

నాన్నమ్మ వాళ్ళు కొన్నాళ్ళు చూసి వాళ్ళు చేతులు ఎత్తేసారు. అమ్మ కి పెన్షన్ వచ్చేది.

నాన్న పోయాక 50 వేల రూపాయలు వచ్చాయి. అమ్మ బావ గారు ఆయన దగ్గర కొంత డబ్బు పెట్టుకుని మాకు 800 నెలకి ఇచ్చేవాడు. అమ్మ బాగా క్రుంగి పోయింది.

నేను 6 వ తరగతి చదువుతున్నప్పటినుండి రోజూ సాయంత్రం హారతికి గుడికి వెళ్లి హారతి పాడుకుని నా కష్టాలు బాబా తో చెపుకునేదాన్ని.

అమ్మ మరీ కోపంగా ఉన్నపుడు నేను బాబాకి అమ్మని మార్చు బాబా అని వేడుకునేదాన్ని.

అలాగే నేను 10 వ తరగతి వరకు వచ్చాను. నేను స్కూల్ అయిపోగానే బాబా గుడికి వెళ్లి అక్కడ కార్యక్రమాలలో పాల్గొనడం చేస్తుండేదాన్ని.

నన్ను అందరు ఇది 10 వ తరగతి పాస్ అవ్వదు తప్పుతుంది అనే వాళ్ళు. పరీక్షల కాలం రానే వచ్చింది.

నేను బాబా తో అన్నాను “బాబా”, ప్రశ్నాపత్రం లో ప్రశ్నలన్నీ  నాకు తెలిసినవే ఉండాలి, నేను అనుకున్న ప్రశ్నలు మాత్రమే రావాలి, వీళ్ళు అంత నేను  పరీక్ష తప్పుతానని అంటున్నారు, కానీ పరీక్ష  ప్రథమశ్రేణి లో పాస్ అవ్వాలి అనుకున్నాను.

నాకు తెలిసిన ప్రశ్నలే పరీక్షలో వచ్చాయి. నేను అన్ని పరీక్షలు బాగా రాసాను. నేను 10 వ తరగతి ప్రథమ శ్రేణి లో పాస్ అయ్యాను.

The above miracle has been typed by: Shiva Kumar Bandaru

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles