Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మా చిన్నామ్మాయికి చదువు సరిగ్గా అబ్బదు అని జ్యోతిష్కులు చెప్పారు అలాగే ఏడవ తరగతి రెండు సార్లు తప్పింది.
పదవ తరగతి బాగానే పాసయ్యింది. మళ్ళీ ఇంటర్ రెండు సంవత్సరాలు తప్పింది.
ఆ తరువాత డిగ్రీ లో B C A చేరింది, బాగానే చదివింది పాసయ్యింది. ఆ తరువాత M C A లో చేర్చుదామంటే మరి ఏమనుకుందో కానీ ఇంక చదవను అని ఒక వివాహాలు కుదిర్చే సంస్థలో 400 రూపాయలు ఇచ్చే ఉద్యోగంలో జీతానికి కుదిరిపోయింది.
వాళ్ళు నెల రోజులు అయిపోయిన తర్వాత జీతం ఇచ్చేటప్పుడు మీ పెద్దవాళ్ళను తీసుకుని రామ్మా! అని అన్నారట, అప్పుడు వచ్చి నాకు చెప్పింది,
నువ్వు వచ్చి అక్కడ చెప్పమ్మా! అక్కడ నాకు 400 రూపాయలు ఇస్తారు అంది. చాలు చాలు అంటూ దాన్ని అక్కడ నుండి చదువుకుందువు గాని అంటూ లాక్కొచ్చాను.
ఆ సమయం లో మా అన్నయ్య ఊరి నుండి వచ్చాడు, వాడితో నేను కొద్ది రోజులు నీ దగ్గర ఉంటాను మావయ్యా, అంటూ వాడితో మా అమ్మాయి వాళ్ళ ఊరికి వెళ్ళిపోయింది.
చెన్నై లో ఉన్న పెద్ద అమ్మాయి , ”ఏంటమ్మా చెల్లిని ఎక్కడా చదువుకి పెట్టారా అలా వదిలేస్తే ఎలా?” అంటూ ఫోన్ చేసింది,
”ఏం చేయమంటావే చదువుకోను అంటోంది అది”, అన్నాను. ”అలా అంటే వదిలేస్తామా అమ్మా! ఇక్కడ ఒక కాలేజీ లో మాత్రమే సీట్లు ఉన్నాయి మిగతా అన్ని కాలేజీల లోను సీట్లు అయిపోయాయి మీరు త్వరగా వస్తే బావుంటుంది” అంది. (M C A లో చేర్పించాలని).
నేను మా వారిని తీసుకుని చెన్నై వెళ్ళాను. కాలేజీ వాళ్ళ తోటి మాట్లాడాను వాళ్ళు ఒకటే సీట్ ఉంది అదీ రెండు రోజులలో ఇక్కడ జాయిన్ అయిపోవాలి అని చెప్పారు.
అమ్మాయి అన్నయ్య దగ్గర ఎక్కడో కాకినాడ లో ఉంది అన్నయ్యకి ఫోన్ చేసి దాన్ని వెంటనే చెన్నైకి పంపించమని చెప్పాను.
నేను అమ్మాయితో వచ్చేయమని తప్పనిసరిగా చదువుకోవాలని చెప్పి ఎలాగో వప్పించాను. వెంటనే చెన్నై వచ్చి కాలేజీ వాళ్ళు చెప్పిన సమయానికి జాయిన్ అయిపోయింది.
నేను బాబాకి, భరద్వాజ మాస్టర్ కి ”ఇంక పిల్లల భాద్యత మీరే చూసుకోవాలి, అది అసలే చదువుకోను అంటూ ఇక్కడకి బలవంతం మీద వచ్చింది, చదువుకుంటే మంచి భవిష్యత్ ఉంటుంది అని దానికి తెలియడం లేదు.
అందుకనే మీరే ఎలాగైనా దానికి మంచి మార్కులతో పాస్ అయ్యేటట్లు చూడాలి. ఇంక నేను దాని గురించి ఆలోచించను” అని అనుకున్నాను.
అలాగే మూడు సంవత్సరాలు నిజంగానే దాని గురించి ఆలోచించలేదు. మూడవ సంవత్సరం పరీక్షలు అయిపోయి రిజల్ట్స్ వచ్చాయి, చెన్నై నుంచి మా పెద్ద అమ్మాయి ఫోన్ చేసి నన్ను ఆట పట్టించడానికి, అమ్మా చెల్లి పరీక్ష తప్పింది, ఏడుస్తోంది అని అంది.
అప్పుడు నేను ”అలా జరగడానికి ఎట్టి పరిస్థితుల్లో వీలు లేదు నేను దాన్ని బాబాకి అప్పజెప్పాను, ఆయన నా నమ్మకాన్ని వమ్ము చేయలేడు” అన్నాను, వెంటనే ”చెల్లి ఫస్ట్ క్లాసులో పాస్ అయింది” అంది.
అలా మూడు సంవత్సరాలు కూడా ”బాబా” దయతోటి ఫస్ట్ క్లాస్ లో పాస్ అయింది.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, బాబా వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం.
- బాబా మీద నమ్మకం లేని నా భార్యకు, వారు స్వయంగా వచ్చి దీవించి జ్వరం తగ్గించిన వైనం
- తాళాల గుత్తి మాయం చేసి తానే(బాబా వారు) నా ఇంటికి కాపలా ఉన్నాడు.
- నన్ను ఆరోగ్యవంతున్ని చేసి, నా కుమార్తె వివాహం జరిపించిన బాబా వారు…రవి కుమార్
- భవ్యష్యత్తుని ముందుగానే సూచించిన బాబా.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments