తల్లి దిష్టి, తండ్రి దిష్టి …. మహనీయులు – 2020… జూన్ 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


విష్ణుచిత్తుడు జ్యేష్ట (సామాన్యంగా జూన్ నెలలో వస్తుంది) శుక్ల ఏకాదశినాడు జన్మించాడు. ఈయన భట్టు వంశమున శ్రేష్టులగుటచే భట్టనాథులంటారు. ఈయనది గరుత్మంతుల అంశ.

ఈయనకు చిన్నతనము నుండియు వటపత్రశాయి యందు గాఢానురాగము ఉండేది. విద్య అబ్బలేదు. భగవద్బక్తి  అబ్బింది. నిరంతరము అష్టాక్షరీ మంత్రమును మనసులో మననము చేసెడివాడు.

ఒకనాడు ఆలయమున వటపత్రశాయికి అలంకరింపబడిన పూలమాలలు చూచి తన్మయుడై తానుకూడా అట్టివి సమర్పించవలెనని సంకల్పించుకొనినాడు.

పెద్ద పూతోటను పెంచి, తానే ఆ పూలను కోసి మాలలు కట్టి వటపత్రునకు ప్రతి దినము సమర్పింపసాగాడు.

ఒకసారి మరువేషములో నున్న వల్లభదేవుడను పాండ్యరాజుతో “వర్షాకాలమునకై కావలసినది మిగిలిన 8 నెలలలో జాగ్రత్తపడాలి. రాత్రికి కావలసిన వాటిని పగలే జాగ్రత్తపడాలి. వార్ధక్యమున సుఖపడుటకై చిన్న వయసుననే జాగ్రత్తపడాలి.

అట్లే పరలోకమున సుఖించుటకు ఈ లోకముందే జాగ్రత్తపడాలి” అని సంభాషణలో విష్ణుచిత్తుడు పలికాడు. రాజుకు జ్ఞానోదయమైంది.

రాజ్యానికి పోయి మోక్షమిచ్చు దైవ మెవరు అని నిర్ణయించేందుకు సభను ఏర్పాటు చేయదలచాడు. వాదనలో గెలిచినవారికి సువర్ణములను బహుకరించెదనని చాటినాడు.

ఒకనాటి రాత్రి స్వప్నమున శ్రీమన్నారాయణుడు విష్ణుచిత్తుని ఆ సభలో ఉపన్యసించి రమ్మని ఆదేశించాడు.

“నాకు ఉద్యాన వనమున పూల మొక్కలు పెంచుటతప్ప వేరేమి రాదు” అని పలకగా “అంతయు నేను చూచుకుంటాను నీవు సభకు వేళ్ళు” అని పలికాడు.

విష్ణుచిత్తుడు వల్లభదేవుని సభలో వాదించి శ్రీమన్నారాయణుని పరతత్వాన్ని చాటిచెప్పి, బహుమానమును గెలుచుకున్నాడు.

ప్రభువు సంతోషించి రాజ వీధులలో పట్టపుటేనుగుపై విష్ణుచిత్తుని అధిరోహింపచేసి, ఉత్సవాన్ని జరిపించాడు.

ఆ ఉత్సవమును చూచుటకు జనులు తండోపతండములుగా వచ్చారు. తన భక్తునకు జరిగే గౌరవాన్ని చూడటానికి పరమాత్మ లక్ష్మీ సమేతుడై, దివ్యాయుధ శోభితుడై గరుడ వాహనముపై ఆకాశంలో కనిపించాడు.

ఈ దృశ్యాన్ని అందరూ చూడసాగారు. అందరూ తనివిదీర విష్ణుమూర్తిని చూడ నారంభించారు.

దీనిని విష్ణుచిత్తుడు చూచి సంతసించాడు. ఆ స్వామి తానెక్కిన ఏనుగుకున్న గంటలను మ్రోగించుచు “పల్లాన్డు, పల్లాన్డు పల్లాయిరత్తాన్డు అని మంగళాన్ని ఆలపించాడు.

ఇది భగవానునిపై ఆయనకు అనగా విష్ణుచిత్తులవారి కున్న ప్రేమకు చిహ్నము. సాక్షాత్తు భగవంతునకే మంగళాన్ని ఆలపించిన విష్ణుచిత్తుని ఆళ్వార్లందరిలోను పెద్దగా భావించి పెరియాళ్వారు అంటారు.

పెరియాళ్వారు విరచిత తిరుప్పల్లాన్డును పఠించి, శ్రీమన్నారాయణుని కృపను పొందుదాము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles