మట్టి బొమ్మలను మహారణానికి …. మహనీయులు – 2020… అక్టోబరు 21



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


ఒకసారి ఒక నర్తకి ఒక ఊరిలో ప్రదర్శన ఇస్తోంది. గురుగోవింద్ సింగ్ కావలి వారైన నలుగురు ఒక నిర్ణయానికి వచ్చారు.

గురువుకు ఈ విషయం తెలియకూడదని, ఇద్దరు గురువు వద్ద ఉండేటట్లు, మరో ఇద్దరు ప్రదర్శనకు పోయేటట్లు నిర్ణయించుకున్నారు.

ఇద్దరు ప్రదర్శనకై పోయారు, కాని వారి మనసు మనసులో లేదు. తాము గురువుకు చెప్పకుండా వచ్చామే అనే బాధతో కుమిలిపోయారు.

గురువు దగ్గరున్న ఇద్దరు అయ్యో తాము అనవసరంగా ఆ ఇద్దరిని ప్రదర్శనకు పంపామని, తామే ఆ ప్రదర్శనను చూచి ఉండవలసినదని అనుకున్నారు. తెల్లవారింది.

గురుగోవింద్ సింగ్ “ఇద్దరు ఇక్కడ ఉన్నా లేనట్లే, ఇద్దరు ఇక్కడ లేకున్నా ఉన్నట్లే” అన్నారు. ఆ నలుగురకు తాము చేసిన తప్పు తెలిసింది. అయితే ఇది గురువుకు ఎలా తెలిసింది? గురువు సర్వజ్ఞత్వాన్ని వారు అప్పడు గ్రహించారు.

ప్రజానీకం చూస్తుండగా గురుతేజ్ బహదూరు భౌతిక కాయాన్ని అమానుషంగా వధించారు మొగలాయిలు.

కనీసం అయన దేహాన్ని తీసుకుపోలేని దుస్థితి అప్పుడున్న నానక్ పంధీయులది. ఆధ్యాత్మిక మార్గమే కాదు, నానక్ పంధీయులలో ఆత్మ విశ్వాసము, ధైర్య, సాహసాలు కొరవడ్డాయని గ్రహించాడు సిక్కుల పదవ గురువైన గురుగోవింద్.

నానక్ పంథీయులకు వీరత్వం నూరిపోశాడు. ఆ మట్టి బొమ్మలను మహరణంలో చెంగు చెంగున ఎగిరే కొదమ సింహాలుగా చేసిన కీర్తి గురుగోవింద్ సింగ్ ది.

నానక్ పంథీయుల పేర్ల చివర సింగ్ ఉంచుకోవాలన్నాడాయన. సిక్కులు కేశములు, కంగా (దువ్వెన), కచ్చా (మోకాలి వరకు వస్త్రము), కడ (ఇనుప కడియము) ఇంకా కృపాణము (కత్తి) ధరించాలన్నాడు. సిక్కు మతాన్ని క్షాత్ర ప్రధానమైన వ్యవస్థగా తీర్చి దిద్దాడు.

సిక్కులలో గురువు ప్రధానం కాదు, గురు వ్యవస్థ ప్రధానమని, తన అనంతరం పదకొండవ గురువుగా గురుగ్రంథ సాహెబ్ ను ఏర్పరచాడు.

గురుగోవింద్ సింగ్ ను కలసి, స్ఫూర్తిని పొంది, శివాజీ చేత హిందూ స్వరాజ్ ను దక్షిణ దేశంలో స్థాపించాడు సమర్థ సద్గురు రామదాసు.

అప్పటి కాలమునకు తగినట్టుగా గురుగోవింద్, సమర్థ సద్గురువులను చేస్తే, సాయిబాబా తన కాలంలో మత సహనానికి పెద్ద పీట వేశాడు.

మహారాష్ట్రలోని నాందేడ్ లో గురుగోవింద్ సింగ్ ఇద్దరు పఠానులచే దొంగచాటుగా హత్య గావింప బడ్డాడు.

నేడు అక్టోబర్ 21. గురుగోవింద్ సింగ్ అక్టోబర్ 21 (1708)లో కన్ను మూశాడు.

“ఎవరు నన్ను దేవుడని అంటారో వారు నరకానికి పోతారు” అన్నాడు గురుగోవింద్ సింగ్.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles