రాధాస్వామి…. మహనీయులు – 2020… ఆగస్టు 25



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


స్వామీజీ మహారాజ్ శివదయాళ్ సింగ్ పూర్వీకులు నానక్ సంప్రదాయానికి చెందిన వారు.

శివదయాళ్ తాత గారు తులసీ సాహెబ్ భక్తుడు. వారెంతో ప్రేమతో తులసీ సాహెబ్ ను సేవించారు.

ఒకసారి అయన తులసీ సాహెబ్ ను తన గృహమునకు ఆహ్వానించారు. తులసీ సాహెబ్ వచ్చే సమయానికి ఆ ఇంటి వరండాలో ఖరీదైన వస్త్రాలు గత వానకు తడిసిపోతే, ఎండలో పెట్టారు.

అవేవి చూసుకోకుండా, లోపలికి తులసీ సాహెబ్ వచ్చారు. “అయ్యో! నా బురద కాళ్లతో ఖరీదైన బట్ట మీద నడచి వచ్చాను” అని నొచ్చుకున్నారు తులసీ సాహెబ్.

“ఏమీ పాడుకాలేదు. మీ పాద ముద్రలు వస్త్రాల మీద పడ్డాయి. అవే మాకు విలువైనవి” అని అందరూ తులసీ సాహెబ్ పాదాలకు నమస్కరించారు.

తులసీ సాహెబ్ సంతసించి వరం కోరుకోమన్నారు. శివదయాళ్ సింగ్ నాయనమ్మ, తన కోడలైన మహామాయను చూపిస్తూ, ఈమెకు పుత్రుడు కలగాలని దీవించండి” అని కోరింది.

తులసీ సాహెబ్ ఆమెకు ఒక గొప్ప మహానుభావుడు జన్మించగలడని దీవించాడు. సాయి కూడా భక్తుల ప్రేమకు లొంగి, అనేక మందికి సంతానాన్ని ప్రసాదించాడు.

తులసీ సాహెబ్ దీవెన ఫలమే శివ దయాల్ సింగ్. శివ దయాల్ సింగ్ ఆగస్టు 25, 1818న జన్మించాడు. ఆ తరువాత ఆమెకు మరో ఇద్దరు కూడా జన్మించారు.

ఆ తులసీ సాహెబ్ దీవెన ఫలంగా జన్మించిన శివ దయాల్  సింగ్ “రాధాస్వామి సత్సంగ్” ఆవిర్భావానికి కారకుడయ్యాడు.

అయిదేండ్ల వయస్సులోనే ధ్యానం చేసేవాడు. తులసీ సాహెబ్ తన గృహానికి వచ్చినప్పుడు కాళ్లను ముడుచుకుని, అదే ఆసనంలో కొన్ని గంటలుండేవాడు.

శివ దయాల్ బహు భాష కోవిదుడు. వల్లభ్ ఘర్ మహారాజ్ కుమారులకు పాఠాలు చెప్పేవాడు.

తనకు ధ్యానం చేసేందుకు సమయం చాలటం లేదని, ఆ ఉద్యొగాన్ని వదలి, తక్కువ జీతం వచ్చే ఉద్యొగంలో చేరాడు.

అప్పడు తండ్రికి పంపగలిగినంత పంపేవాడు తన జీతం నుండి. తండ్రి ఆరోగ్యం బాగుండలేదని తెలిసి, ఆ ఉద్యోగాన్ని కూడా మానుకుని, తండ్రి సేవకే అంకితమైనాడు.

తండ్రి ఆనందించాడు కుమారుని వైరాగ్యానికి. తండ్రి మరణించాడు. కుటుంబ పోషణార్థం డబ్బును వడ్డీలకు తిప్పేవాడు.

తండ్రి మరణానంతరం తమకున్న బాకీదార్లను పిలిచి, ఇష్టం వచ్చినంత డబ్బు ఇవ్వండి చాలు అన్నాడు. తమ్ముడు బాకీదార్లు వ్రాసిన ఋణ పత్రాలను చింపేసాడు.

ఈయనకు నారాయణీ దేవితో వివాహమైంది. ఆమె భర్తను సేవించేది. శివ దయాల్ సింగ్ శిష్యులందరకూ ఆమె మాతృమూర్తి.

ఆమెను అందరూ ‘రాధ’ అనే వారు. శివ దయాళ్ సింగ్ రాధా (స్వామి) సత్సంగ్ కు కారకుడు. రాధ అంటే హృదయము. హృదయమునకు అధిపతి స్వామి.

ఒకసారి ఈయన వద్దకు జనం వచ్చి వానలు కురవటం లేదు, కరుణించి వర్షం కురిపించండి అని వేడుకున్నారు.

ఈయన ఏమీ పలకలేదు. అక్కడే ఉన్న ఒక భక్తురాలు విష్ణు, రేపు వర్షం కురుస్తుందని చెప్పింది. అందరూ సంతోషించి వెళ్ళిపోయారు.

గురువైన శివ దయాల్ సింగ్ ఆమెను “అలా ఎప్పుడూ మాట్లాడవద్దు. వాన కురువకపోవటం దైవలీల” అన్నారు. కానీ, శిష్యురాలి మాట నిలబెట్టేందుకు వర్షాన్ని కురిపించారాయన.

నేడు ఆగస్టు 25. శివ దయాల్ సింగ్ జయంతి. ఆయనను స్మరించెదము గాక!

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles