Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
పిల్లలతో సంసారం నడపటం నాకు చాలా కష్టంగా తోచింది. చచ్చిపోదామనుకున్నాను. చాలా డీలా పడిపోయాను.
నేను వయసులో చాలా చిన్నదాన్ని. నాకు మా వారికి వయస్సులో 17 సంవత్సరాలు తేడా ఉంది.
నన్ను ఎవరైనా ఏమైనా అంటే నేను అసలు సహించను. నేను ఎవరిచేత కూడా మాట అనిపించుకోను.
వయస్సులో ఉన్నాను, నన్ను ఏమైనా ఆకర్షణలు ప్రలోభ పెడతాయే మోనని నేను భయపడేదాన్ని.
అలా కనుక అయితే నా పిల్లల భవిష్యత్తు ఏంటి? ”బాబా నువ్వే చూడాలి, నాకెలాంటి ఆలోచనలు రానీయకు బాబా” అని కోరుకున్నాను.
”బాబా నాకెటువంటి దుర్భుద్ధిని రానీయకు, పిల్లల్ని నువ్వే చూసుకోవాలి. ఈ రోజు నుండి వాళ్ళు నీపిల్లలు, వాళ్ళని నీ పాదాల ముందు ఉంచుతున్నాను.
వీళ్ళకి మంచి పేరు వచ్చిందా అది నీదే, నువ్వేం చేస్తావో అది నీ భారం, వాళ్ళ బాధ్యతంతా ఇంక నీదే నాకేమి తెలియదు” అని బాబాకి చెప్పుకున్నాను.
మా వారు పోయిన తర్వాత మా అత్తగారు, మా అయన మొదటి భార్య కూడా నా దగ్గరికి వచ్చేసారు.
కొడుకు కళ్ళ ముందు పోయాడన్న దిగులుతో మా అత్తగారు మా వారు పోయిన రెండు నెలలకే పోయింది. ఇంక మా పరిస్థితి మరీ దిగజారిపోయింది.
మా అత్తగారు చనిపోయినప్పుడు దహనకాండకి కూడా మా దగ్గర డబ్బులు లేవు.
లక్ష్మిగారే పాపం మమ్మల్ని కనిపెట్టుకొని అప్పుడప్పుడు వద్దంటున్నా డబ్బులు, పచ్చళ్ళు, రేషన్ బియ్యం అవీ ఇచ్చి పోతుండేది.
”సాయిబాబా” గుడిలో ఒక పెద్దాయన అప్పట్లో పూజారిగా ఉండేవారు, ఆయన పాపం వాళ్ళింట్లో వండినవి అవి పండుగలకు పబ్బాలకి తీసుకువచ్చి ఇచ్చి వెళుతుండేవారు.
నేను చాలా మొహమాటంగా ఎందుకండీ ఇవన్నీ తెస్తారు అనేదాన్ని. ఆయన అభిమానంగా ”ఫరవాలేదమ్మా ఒక తండ్రి కూతురికి ఇస్తున్నట్టు అనుకోమ్మా కాదనకు కళా” అనేవారాయన.
కొన్నాళ్ల పాటు మా ఇంట్లో పండగ అంటే ఏమిటో మేమంతా మర్చిపోయాం.
ఎట్టకేలకు మా వాడు ఇంటర్ పూర్తిచేసాడు. వాడికి మా వారి ఉద్యోగం ఇచ్చారు. ఇంట్లో కాస్త ఆసరా మొదలైంది.
మా వారికి రావాల్సిన డబ్బులు అందాయి. కొన్ని అప్పులుంటే తీర్చేసాము.
మా అమ్మాయి Bsc ఫైనల్ ఇయర్లో మంచి మార్కులతో పాసయ్యింది. వాళ్ళ కాలేజీలో మా అమ్మాయితో పాటు చదువుకుంటున్న అబ్బాయి మా అమ్మాయిని ఇష్టపడి పెళ్లి చేసుకుంటా అన్నాడు.
ఆ అబ్బాయి ఇష్టపడ్డాడు కానీ వాళ్ళ తల్లి తండ్రులు ఇష్టపడలేదు. అతని బలవంతంపై వచ్చారు. పెళ్ళికి చాలా ఆంక్షలు పెట్టారు.
వాళ్ళకి మూడు పూటలా భోజనాలు పెట్టాలి అన్నారు, కాఫీలు టీలు అలా ఇస్తూనే ఉండాలి అన్నారు, పదార్ధాలు అన్నీ చాలా రుచిగా ఉండాలన్నారు, స్నాక్స్ కావాలన్నారు, టిఫిన్లు కావాలన్నారు. అన్నిటికి ఒప్పుకున్నాం.
నేను బాబాతో చెప్పుకున్నాను. బాబా నువ్వేం చేస్తావో నాకు తెలియదు. వాళ్ళు భోజనాలు తిన్నాక పది కాలాలపాటు మన వంటలు, మర్యాదల గురించి చెప్పుకోవాలి. ఎటువంటి లోపం కలుగకూడదు బాబా అనుకున్నాను.
ఇప్పటికి మా ఇంట్లో పెళ్లి గురించి, వంటలగురించి, మర్యాదల గురించి చెప్పుకుంటూనే ఉంటారు.
బాబా దగ్గరుండి చేసిన పెళ్లి మరీ మర్యాద లోపం ఎలా జరుగుతుంది.
The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni
Latest Miracles:
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–16
- బాబా ఆశీర్వాదంతో నా వివాహం జరిగింది.-3
- బాబా వారి దయతో వారం లోగ మా ఇల్లు అమ్ముడయిపోయి, మా పెద్ద పాప పెళ్లి చేయగలిగాము.
- మా అమ్మాయి పెళ్లి అన్ని ఆటంకాలు తొలగించి బాబానే జరిపించారు–Audio
- పారాయణ సమయంలో మా ఇంటికి వచ్చి నా పెళ్లి జరుగుతుందని ఆశీర్వదించిన బాబా వారు …..!
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments