పారాయణ సమయంలో మా ఇంటికి వచ్చి నా పెళ్లి జరుగుతుందని ఆశీర్వదించిన బాబా వారు …..!



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


1997 నవంబర్ డిసెంబర్ నెలలో ఒక రోజు మా ఇంటికి బాబా వచ్చారు.

మా అక్క వాళ్ళింట్లో ”శ్రీ సాయిసచ్చరిత్ర” పారాయణం వారం రోజులు చేస్తున్నాము.

అది ఎలాగంటే ఉదయం మొదలు పెట్టి సాయంత్రం వరకూ అయి పోవాలి. అలా వారం రోజులు పారాయణం చేస్తాము.

అలా అక్క చేయటం మొదలు పెట్టింది ముందు రోజు బాబా దగ్గర బాబా అలంకరణ అంతా నేనే చేసాను.

నాకు బాబాకి అలంకరణ చేయటమంటే చాలా ఇష్టం. ఎక్కడ బాబాకి అలంకరణ చేయమన్నా నేను ముందే వుంటాను.

అది మామిడికాయల కాలం కాదు, ఒక జామ కాయ మామిడి కాయ ఆకారంలో వుంది,

ఆ కాయను నేను చేతిలోకి తీసుకుని, ”మనం చేసేది బాబా మెచ్చితే ఈ జామకాయ మామిడి కాయగా అయిపోతుంది చూడు”, అంటూ బాబా ముందు ఆ కాయ పెట్టాను.

ఉదయం హారతి, మధ్యాహ్న హారతి, సాయంత్రం హారతి, రాత్రి హారతి తోటి పారాయణ ఆ రోజు తో పూర్తి అవుతుంది,

అక్క నన్ను పారాయణ దగ్గర చూసుకోమంది. ఎందుకంటే నేను చాలా బాగా తొందరగా చదువుతాను. ఒకళ్ళ తర్వాత ఒకళ్ళం ఆగకుండా చదువుతుండాలి.

వంటలంతా మిగతా అక్కలు చూసుకుంటున్నారు చుట్టాలందరూ వస్తున్నారు.

ఒక పండగలాగా జరుగుతోంది. 2 రోజులు అయింది నాకు అప్పటికి పెళ్లి సంభందాలు చూస్తున్నారు ఇంకా ఎవరినీ నేను చూడలేదు,

ఆ రోజు ఎవరో వస్తామన్నారు పెళ్లి కొడుకు తప్ప అత్తా, మామ మిగతా ముగ్గురు వచ్చి నన్ను చూసుకొని వెళ్లారు.

మధ్యాహ్న హారతి అయిన తర్వాత నేను ఇంటికి వచ్చి మంచానికి అడ్డంగా అలా వెనక్కి పడుకున్నాను కాళ్ళు క్రిందనే ఉన్నాయి.

నాకు ఎదురుగా బాబా ఫోటో వుంది బాబా అందరికీ నువ్వు కనిపిస్తావుట, మా కెందుకు కనపడవు అని అనుకుని అలా కళ్ళు మూసుకున్నాను,

అంతే! తెల్లని బట్టలతో ఒకాయన భుజానికి జోలె, మెడలో ఆకుపచ్చ శాలువా చేతిలో సటకా మరో చేతిలో భిక్ష పాత్ర వున్నాయి. నాకు తెలుస్తోంది బాబాయే అని అలా కనపడి అలా అలా తిరిగి వెళ్ళిపోయాడు

నేను వెంటనే కళ్ళు తెరిచి ఏంటి బాబా నువ్వు నాకేం చెప్పదలచుకున్నావో నాకు అర్ధం కాలేదు అనుకున్నాను.

లేచి అక్కా వాళ్ళింటికి వెళ్ళాను, అక్క అంది బాబా ఏ రూపం లో నైనా రావచ్చు మనం గమనించుకోవాలి అంది,

అవునక్కా నేను ఇంటికి వెళ్లి అలా నడుము వాల్చాను ఇంతలో బాబా నా కళ్ళ ముందుకు వచ్చినట్లైంది.

అలా అలా తిరిగి తిరిగి వెళ్ళిపోయాడు, ఎవరు వస్తారో ఏ రూపంలో వస్తారో ఏమో అని అనుకున్నాం ఈ లోపుల మా బాబాయ్ కొడుకు వచ్చాడు,

అతను ఎప్పుడూ రాడు మా ఇంటికి ఈ రోజు వచ్చాడు కాబట్టి బాబా ఈయన రూపంలో వచ్చాడేమో, అనుకున్నాము అతను కాసేపాగి వెళ్ళి పోతానని వెళ్ళి పోయాడు.

అహ ఇతను కాడు అనుకున్నాము, ఈ లోపుల బాబాకి ఆరగింపు సమయం అవుతోంది అంతా తయారు చేసాం,

నెయ్యి లేదు మా అక్కయ్య మా ”ఇంట్లో వుంది నేను తెస్తాను” అని వాళ్ళింటికి వెళ్ళింది,

నెయ్యి తీసుకొని గబగబా వస్తోందిట. అది కొంచెం దూరంలో వుండగా ఒకాయన కనపడ్డాడంట ఆయన దీన్ని అన్నం పెడతావా అని సైగ చేసాడట,

నా వెనకాల రమ్మనమని ఇదీ సైగజేసి ఆయన్ని సరిగా గమనించ కుండా హడావుడిగా వచ్చేస్తోంది,

ఇంకో సందులోంచి మా అన్నయ్య కొడుకు వస్తూ అత్తన్ని చూసాడు, అత్త వెనకాల వస్తున్న ముసలి అతన్ని చూసి, ”అత్తా నీ వెనకాల బాబా వస్తున్నాడు అన్నాడు”.

అంతే ఇది వెనక్కి తిరిగి చూసిందిట, అప్పుడే అర్ధమైంది నిజంగానే ”బాబా” యే నా వెనకాల వస్తున్నాడని ఒక్క అంగలో ఇంట్లోకి వచ్చి ”బాబా వస్తున్నాడు మనింటికి అంది”,

అప్పుడే ఏదో పని వుండి బీరువా దగ్గర నిలబడింది మా ఇంకో అక్కా ”బాబా వచ్చి బయట గుమ్మంలో నిలబడ్డాడు, ఆ వచ్చినాయన అచ్చం నాకు కలలో కనపడినట్లే అంటే అవే బట్టలు, అదే వేషధారణలో ఉన్నాడు.

నేను లోపలికి రమ్మనమని పిలిచాను, ”లోపలికా ఎందుకు” అన్నాడు, లోపల సచ్చరిత్ర పారాయణ జరుగుతోంది అన్నాను.

దానికి ఆయన ”సచ్చరిత్ర పారాయణమా”, అన్నాడు” అవును బాబా లోపలికి రండి ” అన్నాను, ఆయన లోపలికి వచ్చారు.

ఎవ్వరూ మా ఇంట్లో వాళ్ళు మాట్లాడటమే లేదు లోపల కూర్చుంటుంటే అక్క బీరువా లోంచి గబుక్కున కెమెరా తీసి ఒక ఫోటో తీసింది ఇంక తీయవద్దని అక్కని హెచ్చరించాడు.

”సరే నేను వెడతాను” అన్నాడు ”లేదండి మీరు భోజన సమయానికి వచ్చారు భోజనం చేసి వెళ్ళాలి” అంటే ”లేదు నేను భోజనం చేయను” అన్నాడు.

”మరి చపాతీ ఏమైనా చేయమంటారా” అని అడిగాను ”లేదు లేదు నాకేం వద్దు ప్రస్తుతం గోధుమ పిండి ఇవ్వండి నేను వేరే చోట చేయించుకొని తింటాను” అన్నారు.

ఎవరో లోపలికి పిండి తేవడానికి వెళ్ళ బోతుంటే ”టీ పొడి పంచదార కూడా కావాలి” అని అడిగాడాయన

‘సచ్చరిత్ర’ పారాయణం చేసేటప్పుడు ఒక్కొక్కళ్ళు చేసేటప్పుడు 2 రూపాయలు దక్షిణ అక్కడ పెట్టి చదువుతున్నాము,

ఆ రోజు ఆదివారం, అది కొంత చిల్లర అయింది, అదంతా ఆయన జోలెలో వేశాం తీసుకున్నాడు. నాకు తొందరలోనే ”పెళ్ళి” అవుతుందని చెప్పారు, ఇలా అందరికీ అన్నీ చెబుతున్నారు,

మా అక్కయ్య ”కొబ్బరి కాయ గుడిలో అయితే వాళ్ళు ఎక్కడో కొట్టిస్తారు దేవుడికి సరిగా చూపనైనా చూపరు అందుకే ఎందుకు కొట్టాలి? అని తాను అనుకునేది,

ఈ విషయమై ఏమీ అడగకుండానే ఆయన ఆమెతో ”కొబ్బరి కాయ దేవుడి దగ్గర కొట్టాలి ఏదైనా నైవేద్యం పెట్ట తగ్గది అంటే కొబ్బరి కాయ మాత్రమే అది ఎంగిలి విత్తనంతో రాదు అందుకని చాలా పవిత్ర మైనది” అని చెప్పాడు.

”పారాయణం” చేస్తున్న అక్క ఇంట్లో ఫోన్ పని చేయటం లేదుట ప్రయత్నించి మా నాన్న గారు కూడా ఆ సమయానికి వచ్చారు,

కాసేపు ఆగి ఆయన (బాబా) వెళ్ళి పోతానని బయటికి వచ్చారు. మేమంతా కూడా ఆయన్ని అనుసరించబోయాము, ”వద్దు ఎవరూ రావద్దు అందరూ ఇక్కడే ఆగిపోండి” అన్నాడాయన.

ఆయన రోడ్డు మీదకి వెళ్ళారు మా పక్కింటామె ఆయనకి ఎదురు వచ్చింది.

వాళ్ళకి మాకు గోడే అడ్డము భిక్ష పాత్ర చూపించి భిక్ష వేయమని సైగ చేసారట, ఆవిడ పరుసు తీసినట్లే చేసి చిల్లర లేదని చెప్పేసింది, ఆవిడకి తెలియదు ఆయన ”బాబా” అని,

ఆవిడ మా ఇంట్లోకి వచ్చింది ఇప్పటి దాకా బాబా వున్నారు మీరు ఒక్కనిమిషం ముందు రావాల్సింది అన్నాము.

బయట ఒక ముసలాయన కనిపించాడు ఆయనేనా బాబా అంది. ఈ లోపుల ఆమెకి చేతులు భయంకరంగా దురదలు మొదలయ్యాయి,

”అయ్యో ఆయన బాబా నా! నాకేం తెలుసు ఆయన నన్ను దక్షిణ కూడా అడిగాడు. నేను ఏదో మాములుగా అడుగుతున్నాడు అనుకుని చిల్లర లేదు” అన్నాను ఇవ్వలేదు.

అందుకే నా చేతులు ఇలా దురదలు పుడుతున్నాయి అంది, ఆమెని లోపలికి తీసుకువెళ్ళి విభూది చేతులకి రాసి బాబాకి దండం పెట్టుకున్నాము, అప్పుడు దాకా దురద తగ్గలేదు.

ఆ మరునాడు మా వారు నన్ను చూసుకోవడానికి వచ్చారు దూరం నుండి చూసి, ఈయనకి నేనెలా నచ్చుతాను, ఆయన తెల్లగా బావున్నారు, నేను నల్లగా వుంటాను అనుకున్నాను,

కానీ ఆయన నన్ను చూడటం నేను ఆయనకీ నచ్చటం జరిగింది, సప్తాహం జరిగాక జామ పండు బాబా దగ్గర పెట్టినది తీసుకొని ఇంట్లో అందరమూ కోసుకొని తలా ఒక ముక్కా తిన్నాము అది

”పచ్చి మామిడి రుచి” వచ్చింది, బాబా దయతో జామ మామిడి అయ్యింది, మా పెళ్లి కూడా తొందరలో జరిగిపోయింది.

The above miracle has been typed by: Mrs. Raja Rajeswari Sainathuni

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles