Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఎందరు భక్తుల్లో, అన్ని భక్తి మార్గాలు. అన్ని మార్గాలు, అంటే, భగవంతుని సన్నిధికి చేర్చేవి ఒకటిగా ఉండనక్కరలేదు.
తిరుక్కడవూరు అనే గ్రామంలో ఒక శివ భక్తుడుండే వారు. ఆ భక్తుడిని అందరూ గుగ్గిల కళయనార్ అని పిలిచే వారు.
ఆయనను ఆ ఊరి శివాలయంలో ఉన్న శివునకు ధూపం వేయటం ఇష్టం. ఇది ఆయన భక్తి మార్గము.
అందుకనే ఆయనను గుగ్గిల కళయనార్ అనే వారు. ఆయనకు శివునిపై భక్తి పెరగసాగింది.
భక్తితో పాటే ఆయన శివునకు వేసే గుగ్గిలపు ధూపం కూడా పెరగసాగింది. ఆస్తి తరిగిపోసాగింది. కానీ, ఆయన భక్తికి అడ్డు కట్ట పడలేదు. ఆస్తిపాస్తులు పోయాయి.
ఆ చింతే ఆయనకు లేదు. భార్యా, పిల్లలు ఆయనను ఏమి అనేవారు కాదు. ఇంటిలోని వస్తువులు ఒక దాని వెనుక ఒకటి అమ్ముడు పోయాయి.
ఇక తిండికి కూడా ఏమీ లేదు. ఆ భార్య పిల్లల్తో సహా రెండు రోజులు ఉపవాసమున్నాడు ఆ శివ భక్తుడు.
ఆ సమయంలో, ఆస్తి అంతా శివుని కోసం కరగించేసేనే అనే భావము ఆయనకు, ఉపవాసం మిగిలింది అనే భావము భార్యా, పిల్లలకు రాలేదు.
ఇక భార్య ఏమీ చేయలేక, తనకు ఉన్న మంగళ సూత్రాన్ని భర్తకు ఇచ్చి, దానిని అమ్మి, భోజనానికి సరకులు తెమ్మని కోరింది.
అతడు ఆ మంగళ సూత్రంలో గుమ్మం దాటాడు. అమ్మి భోజనానికి సరకులు తెద్దామని, వీధిలో అప్పుడే గుగ్గిలం మూట అమ్మకానికి వచ్చింది.
గుగ్గిలం మూటను చూచిన ఆ శివ భక్తునకు పట్టరాని సంతోషం కలిగింది. ఆ మంగళ సూత్రములను ఇచ్చివేసి, ఆ శివ భక్తుడు ఎకాఎకి, శివాలయానికి వెళ్లాడు.
ఆ గుగ్గిలం ధూపమును వేసి శివుని పూజింపసాగాడు. ఇంటిపై ద్యాస లేదు అతనికి. కానీ, అతని భార్య తన భర్త తెచ్చే భోజన సామాగ్రి కోసం ఎదురు చూస్తోంది. చూచి చూచి నిద్రపోయింది, పిల్లలతో సహా.
ఆమెకు స్వప్నం వచ్చింది. స్వప్నంలో శివుడు కనిపించి “నిద్ర నుండి మేలుకో” అన్నాడు. ఆమె నిద్ర నుండి మేల్కొన్నది.
ఇల్లంతా వెండి, బంగారం, ఆహార పదార్దాలతో నిండి ఉంది. ఆమె వెంటనే శివుని మ్రొక్కి, వంట తయారు చేసి, భర్త కోసం ఎదురు చూడసాగింది.
పిల్లలు కూడా నిద్ర లేచి, ఆశ్చర్య పోయారు. శివుడు కళయనార్ కు కనిపించి, ఇంటికి వెళ్లి, భోజనం చేసి రమ్మని సందేశం ఇచ్చాడు.
సమస్త వస్తువులతో ఇల్లు కళకళ లాడుతోంది. అందరూ కలసి మరో మారు శివుని స్తుతించి, భుజించారు.
తేదీ వివరాలు లభించలేదు.
సాయిబాబా ఒకసారి బాలకృష్ణ ఉపాసనీ జేబులో ఉన్న వెండి గడియారాన్ని తనకిమ్మన్నాడు.
ఫకీరు సాయికి గడియారం ఎందుకు? కాల స్వరూపమే తానైనప్పుడు వేరే సాధనం సాయికి అవసరమా? అతను వెంటనే ఏ మాత్రం సంకోచించక గడియారాన్ని ఇచ్చివేశాడు.
దారిలో, పూనాలో బాలకృష్ణ స్నేహితుడు బాలకృష్ణకు బంగారు గడియారాన్ని బహూకరించాడు.
లోభాన్ని కోల్పోతే, సాయి శంకరుడు ఇవ్వనిది ఏముంటుంది?
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- మరో వాల్మీకి …. మహనీయులు – 2020… అక్టోబరు 23
- సాయీ భాగవతము…..సాయి@366 జూన్ 28….Audio
- భక్తి జ్ఞాన సంగమం… .మహనీయులు – 2020… అక్టోబరు 8
- తీయని బాధ .. …. మహనీయులు – 2020… అక్టోబరు 4
- వైష్ణవ జనతో… …. మహనీయులు – 2020… అక్టోబరు 2
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments