మరో వాల్మీకి …. మహనీయులు – 2020… అక్టోబరు 23



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


గోస్వామి తులసీదాసు రామ చరిత మానస్ ను 2 ఏండ్ల, 7 నెలల 26 రోజులలో అంటే రామనవమి నాటికి పూర్తి చేశారు.

ఈయన కున్న అపరిమిత శక్తులు ఆయనకు తెలియవు. ఆ విషయాన్ని తులసీదాసుతో ముచ్చటించే రాముడే తెలియ చెప్ప వలసింది. అయితే ఆయన జీవితంలో ఎన్నో అద్భుతాలు కనిపిస్తాయి.

ఒకసారి తులసీదాసు వద్దకు ఒక హంతకుడు వచ్చి తాను హంతకుడనని, దయతలచి రామ ప్రసాదాన్నిచ్చి  కాపాడమని వేడుకున్నారు.

రామకృప ఎన్ని పాపాలను తొలగించదు కనుక, రాముని మీద భక్తి చాలు. అది హంతకునకు వచ్చినట్లున్నది. రామ ప్రసాదాన్ని పెట్టాడు. “పునీతుడవైనావు?” అన్నారు తులసీదాసు.

ఒక హంతకుడు పునీతుడెలా అవుతాడు? శివుని వద్ద గల నంది అతని చేతుల నుండి ఆహారాన్ని తింటే నమ్ముతాము అని తులసీదాసును రుజువు చూపమన్నారు.

తులసీదాసు వారితో హంతకుని వెంట వెళ్లి శివుని వద్ద గల నందికి ఆహారం పెట్టిస్తాడు. నంది ఆహారాన్ని తింది. అపనమ్మకం తొలగి నమ్మకం ఏర్పడ్డది తులసీదాసుపై.

మరోసారి తులసీదాసు మృతుడైన ఒక వ్యక్తిని రాముని ప్రార్ధించి, జీవం వచ్చేటట్టు చేశాడు.

ఈ సంగతి తెలిసిన ఢిల్లీ పాదుషా తులసీదాసును రప్పించి మహత్తును చూపమన్నాడు.

మహత్తులు తనకు రావంటాడు తులసీదాసు, తనకు వచ్చిందల్లా రామ నామమే కాని వేరేది లేదు అంటాడు.

పాదుషా తులసీ దాసును కటకటాలలో పెట్టి, మహిమ చూపిస్తేనే నీకు విడుదల అంటారు.

లెక్కకు అందని వానరాలు ఆ పాదుషాను చుట్టూ ముట్టాయి. రక్షింపమని వేడుకుంటాడు పాదుషా. పాదుషాను రక్షిస్తాడు తులసీదాసు. తులసీదాసు విముక్తుడవుతాడు.

ఈయన సమకాలీకులు రస్ ఖాన్, నందాస్, సూరదాస్, మధుసూధన సరస్వతి మొదలైన వారు.

తులసీదాసు సమకాలీకుడు నాభదాసు తులసీదాసును తన భక్తి మాలలో మేరు పూసగా కీర్తించాడు.

తులసీదాసు అవధీ (హిందీ మాండలీకమే అవధీ) భాషలో రామాయణాన్ని వ్రాయటానికి అవతరించిన వాల్మీకియే అన్నాడు.

తులసీదాసుకు శ్రీరాముని పట్ల గల భక్తి అమోఘమైనది. ఆయన భక్తి వలన శ్రీకృష్ణ విగ్రహం శ్రీరామచంద్రునిగా పరివర్తనమైంది.

ఒకసారి మీరాబాయి తన రచ్చ బంధువులు తనను కళంకునిగా భావిస్తున్నారు ఎం చేయాలి? అని లేఖ వ్రాసింది తులసీదాసుకు.

“సీతారామచంద్రుల పట్ల భక్తి లేని వారు నీకు ఎంత ఆత్మీయులైనను శత్రువులుగా భావించి సత్వరమే త్యజించు” అని సమాధానం పంపాడు తులసీదాసు.

తులసీదాసు అక్టోబర్ 23 (1623)న రామునిలో ఐక్యమయ్యాడు.

నేడు అక్టోబర్ 23, తులసీదాసు వర్థంతి.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles