Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
అది బొంబాయి నగరంలో అక్టోబరు 4వ వారంలో జరిగిన సంఘటన.
కాకా మహాజని బాబా భక్తుడు. కాకా మహాజని వలన అతని యజమాని ఠక్కర్ సేఠ్, ఇంకా అతని కుటుంబం కూడా సాయి భక్తులైనారు.
ఠక్కర్ సేఠ్ తండ్రి నాసిక్‌లో ఉంటున్నాడు. ఆయన తిరిగి బొంబాయికి రాదల్చుకున్నాడు.
ఇంకా తాను నాసిక్‌లో ఉండాలా? బొంబాయికి పోవచ్చా అనే విషయంపై సాయితో మాట్లాడేందుకు కాకా మహాజనిని షిరిడీకి పంపుమని ఠక్కర్ తండ్రి ఠక్కర్‌కు ఉత్తరం వ్రాసాడు.
ఈ విషయమై తాను షిరిడీకి పోనవసరము లేదని అక్కడే ఉన్న కాకా దీక్షిత్‌కు ఉత్తరము వ్రాసిన చాలునని, కాకా సాహెబ్‌తో మాట్లాడిన సాయి నిర్ణయం తెలుపగలడని యజమానికి చెప్పాడు.
యజమాని అందుకు అంగీకరింపక స్వయముగా కాకా మహాజనియే సాయితో మాట్లాడవలెనని తన తండ్రి అభిమతమని చెప్పగా కాకా మహాజని అంగీకరించాడు.
ఇలా సంభాషణ బొంబాయిలో జరుగుచుండగా, ద్వారకామాయిలో కొలువై ఉన్న సాయి, అక్కడే ఉన్న కాకా సాహెబ్ దీక్షిత్‌తో ”ఆహా! ఏమి! ఆ విషయములు, వాదములు, ఆలోచనలు” అన్నారు.
మరునాడు కాకా మహాజని షిరిడీ సాయి సన్నిధికి చేరాడు. సాయి దీక్షిత్ వైపు తిరిగి ”నిన్న సాయంత్రము ఈ విషయమై తలచుకున్నాము గదా!” అన్నాడు.
వెంటనే దీక్షిత్, కాకా మహాజనితో నిన్న సాయంత్రం జరిగిన చర్చ ఏమిటని ప్రశ్నిస్తే, కాకా మహాజని తన యజమానితో జరిగిన సంభాషణను వివరించాడు.
అప్పుడు అక్కడున్న వారందరు సాయి అంతర్యామిత్వానికి అచ్చెరువొందారు. సాయి భగవానుడు సర్వాంతర్యామి అని గ్రహించిననాడు, భక్తులు తప్పటడుగు వేయ సాహసించరు.
ఒక ఉదాహరణ:
జునాయిడ్ ఒక సూఫీ యోగి. ఆయన తన ఒకొక్క శిష్యునికి ఒకొక్క పావురాన్ని ఇచ్చి, ఎవరూ చూడని రహస్య ప్రదేశములో చంపి తినమన్నాడు.
ఒక్క శిష్యుడు మాత్రం పావురాన్ని చంపకుండా వెంట తెచ్చాడు. కారణం అడిగిన గురువుతో ”మీరు చెప్పినట్లు ప్రయత్నించాను పావురాన్ని చంపటానికి. ఎంత రహస్య ప్రదేశముయినా, అల్లా గమనిస్తున్నాడు అనిపించింది. అందుకని చంపలేదు” అన్నాడు.
ఇదే సాయి బాబా తెలిపేది.
ఏ పని చేసేటప్పుడయినా గుర్తుంచుకోవలసినది ఒక్కటే!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- “నా మైనా” ……సాయి@366 ఫిబ్రవరి 4…..Audio
- కాకా మహాజని
- మనసెరిగిన వాడు మా దేవుడు…..సాయి@366 ఆగస్టు 22….Audio
- షిరిడీ మసీదులో శ్రీరామనవమి…..సాయి@366 మార్చి 27…..Audio
- (అ)ద్వితీయ సాయీ పత్రిక …..సాయి@366 మార్చి 18….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments