షిరిడీ మసీదులో శ్రీరామనవమి…..సాయి@366 మార్చి 27…..Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


సాయిబాబా చేష్టలన్నీ వింతగా ఉంటాయి. తాను నివసించే పాడుబడిన మసీదును ‘ద్వారకామాయి’ అన్నాడు.

ఉర్సు ఉత్సవాన్ని శ్రీరామ నవమి రోజున (ప్రతి శ్రీరామ నవమినాడు) జరపటానికి అంగీకరించాడు. ఫకీరు దుస్తుల్లో ఉండే తాను శ్రీరామునిగా దర్శనమిచ్చాడు.

1912 శ్రీరామనవమి ఇంకా కొద్ది రోజులుందనగా కొందరికి పగటిపూట శ్రీరామనవమి ఉత్సవం జరిపించితే ఎలా ఉంటుందన్న ఆలోచన కలిగింది, ఎందుకంటే సాయంకాలం నుండి ఉర్సు ఎలాగూ చేస్తారు కాబట్టి. సాయి అంగీకరించారు.

సాయి అంగీకరించారంటే ఆ పని సానుకూలమయినట్టే.

1912, మార్చి 27 బుధవారంనాడు షిరిడీలో ప్రథమ శ్రీరామనవమి జరిగింది.

అప్పటికప్పుడు అనుకున్నారు కాబట్టి కొన్ని, కొన్ని సమస్యలు రాక తప్పవు. అయినా వాటిని గూర్చి పట్టించుకోనక్కర లేదు.

రామనవమి జరిపించాలనే శ్రీకృష్ణ భీష్మ ఆలోచనకు, కాకా మహాజని మద్దతిచ్చాడు. హరిదాసు దొరకకుంటే, భీష్మయే హరిదాసు అయ్యాడు.

ఇక హరికథా వస్తువు విషయానికి వస్తే, కాకా మహాజని విరచిత గాథయే ఉన్నది. ఇక రాధాకృష్ణమాయి ఊయలనిచ్చింది, ప్రసాదం కూడా చేసి ఇచ్చింది. హరికథ మొదలు పెట్టబోతున్నారు.

అప్పుడు హరికథ చెప్పే భీష్ముని, ఉత్సవ ఆలోచనకు మద్దతు ఇచ్చిన కాకా మహాజనిని సాయి పూలమాలలతో సత్కరింపచేశాడు. పూలమాలతో అలా సత్కరింప చేయాలనే సాంప్రదాయం సాయిబాబాయే నెలకొల్పాడు.

మరో విషయం: సాయి కంట్లో గులాల్‌ పడ్డది. సాయి నరసింహ అవతారం ఎత్తాడా అనిపించింది చూచేవారికి.

ఊయలను విరగకొడతాడేమోనని, ఊయలను ఊడదీయబోతుంటే, సాయి వారించాడు. ” అదెట్లా విప్పుతారు? దాని అవసరం ఇంకా ఉన్నది కదా” అన్నాడు. అలా సాయి అనగానే ఆయన ఆంతర్యం అందరకూ తెలిసిపోయింది.

నిన్న శ్రీరాముడిని నేడు శ్రీకృష్ణుడిని అర్చించుకోవటం అందరికీ ఆనంద హేతువైంది. కుండలో అటుకులు, బెల్లం పెట్టి, దానిని ఉట్టిలో ఉంచి, ఉత్సాహంతో ఎగిరెగిరి కొట్టి అందులోని అటుకులు, బెల్లం తినటం మధురమైన సన్నివేశం.

ఉత్సవం పూర్తి కాగానే, ఊయలను విప్పివేశారు.

సాక్షీభూతుడుగా చూస్తున్నాడు సాయీరామకృష్ణ!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles