నేనందంగా లేనా? …..సాయి@366 మార్చి 25….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice Support By: Mrs. Jeevani


భగవంతుడు అందగాడే. వర్ణింపజాలని అందం ఆయనది. సాయి బాబా అందగాడే. కాదని ఎవరు అనగలరు?

”నేను చాలా అందంగా ఉన్నాను కదూ!” అన్నారు సాయి ఒకసారి రేగేతో. ఆయనవి అనేక అనుభవాలున్నాయి సాయితో.

బి.వి. నరసింహస్వామి గారితో తనకు 1915 శ్రీరామనవమి నాడు కలిగిన అనుభవాలను ఒకటి, రెండు వివరించారు.

సామాన్యంగా భక్తులు సాయినాథునకు దక్షిణ సమర్పిస్తారు. వస్త్రాలను సమర్పిస్తారు, గ్రంథాలను సమర్పిస్తారు. సాయికి ఇష్టమైతే వస్త్రాలను గాని, ధనాన్ని గాని తనకు ఇవ్వని వారికి కూడా ఇస్తారు. అదే మహా ప్రసాదం.

1915 శ్రీరామనవమి మార్చి 25వ తేదీన జరిగింది. రేగే తన ఊరి నుండి వస్తూ ఒక జరీ పట్టు శాలువ కొన్నాడు సాయికి సమర్పించాలని.

అది 5 అడుగుల చతరస్రాకారంగా 8 అం. జరీ అంచుతో నాజూకుగా ఉన్నది. దానిని మడత పెట్టగా అది 6 X అం 6 అం X 1 అం. అంత అయినది.

గుప్పెట్లో ఇమిడి పోయేటంత నాజూకుగా ఉన్నది. దానిని సాయియే ధరించాలని ఆయన ఆకాంక్ష. అలా సాయి ధరిస్తే, తన ప్రేమను సాయి గుర్తించినట్లుగా ఉంటుంది అనుకున్నాడు.

ఆనాడు ఎందరో వస్త్రాలను సాయికి సమర్పించుకున్నారు. రేగే తాను తెచ్చిన శాలువను సాయికి కప్పకుండా, ఎవరికి కనిపించకుండా, సాయి కూర్చునే గద్దె కింద పెట్టాడు.

దీనిని సాయి ఎప్పుడు చూచేటట్లు? ఎప్పుడు ధరించేటట్లు? అనే ఆలోచనే రేగేకు రాలేదు. సాయి తన కానుకను ధరించి స్వీకరించాలి. అదే అతని ప్రగాఢ కోరిక.

భక్తులందరూ సమర్పించిన వస్త్రాలను సాయి తిరిగి వారికే ఇచ్చి వేసాడు.

బాబా లేచి నిలబడి ”పరుపును (గద్దెను) దులపండి” అని ఆజ్ఞాపించాడు. ఆ పరుపు కింద పొట్లాం కనపడింది.

దానిని సాయి తీసుకొని ”ఇది ఎవరిది? దీనిని ఎవ్వరికీ ఇవ్వను. ఇది నాది” అని భుజాలపై కప్పుకున్నాడు శాలువను.

రేగే వంక చూచి ”దీనిని కప్పుకుంటే నేను అందంగా ఉన్నాను కదూ!” అని అడిగారు. భగవంతుని అందాన్ని ఇనుమడింప చేసేది భక్తుల ప్రేమయే.

ఈ సంఘటన చాలు – భక్తుని ప్రేమను సాయి ఎలా గౌరవిస్తాడో!

ఆ మార్చి 25 సంఘటన వలె, సాయి ప్రేమను మనం పొందుదుము గాక!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr:Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles