Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
లౌకికపరమైన కోరికతో గాని, ఆధ్యాత్మికపరంగా కాని సాయిబాబాను చేరిన వారెందరో ఉన్నారు.
ఈ రెంటికి భిన్నంగా వ్రేళ్ళమీద లెక్కింప కల్గినటువంటి వారున్నూ లేకపోలేదు ఉదాహరణ: గణపతి రావు కోతే పాటిల్, శ్రీమతి బయాజీ బాయి కుమారుడు తాత్యాకోతే పాటిల్.
తాత్యాకోతే పాటిల్‌కు తన బాల్యం నుండి సాయిబాబాతో మమతానుబంధం ఉండేది.
సాయి దృష్టిలో బయజా అక్క (సోదరి), తాత్యా సోదరి కుమారుడు. షిరిడీలో ఎవరికీ లేనంత స్వేచ్ఛ సాయిపై నున్నాయి అతనికి. కోరికలు కోరినట్టు కానరాదు.
సాయిబాబాతో తన బాల్యం నుండి నిద్రించేవాడు ద్వారకామాయిలో. సాయి, తాత్యాలు మేనమామ, మేనల్లుని వలె ప్రవర్తించేవారు.
షిరిడీలోని భక్తులు అనేక పనులను తాత్యా ద్వారా చేయించేవారు.
తాత్యాతోనే చావడి ఉత్సవం అన్నట్లుండేది.
సాయి భుజంపై జలతారు శాలువా వేసి చావడికి తీసుకుపోయేవాడు తాత్యా ఒక చేతితో సాయి ఎడమ చేతిని, మరో చేతితో లాంతరు పట్టుకుని. చావడిలో మొదట తాత్యా చిలుం పీల్చిన తరువాతనే సాయి పీల్చేవాడు.
”నన్ను కనిపెట్టుకొని ఉండు. నీ ఇష్టమొచ్చిన చోటుకు వెళ్ళు. కానీ, రాత్రి ఏదో వేళలో ఒకసారి వచ్చి, నా గురించి విచారించు” అనే వారు తాత్యాతో సాయి.
ఎంతటి ప్రేమ వారిది. ఆ లోకనాధుని గూర్చి రాత్రి వచ్చి విచారించవలసిన పని ఏమి? సాయి సామాన్య మానవునిలా నటించటంతప్ప.
సాయిబాబా షిరిడీ విడచి వెళ్ళిపోతుంటే, బుజ్జగించి మరల షిరిడీలో ఉంచటం, సాయిచేత పాత కఫ్నీని మార్పించి కొత్త కఫ్నీని ధరింప చేయటం, సాయికి విపరీతమైన కోపం వచ్చేటప్పుడు శాంతపరచటం, ఇలాంటివి ఎన్నో చేయగల ఏకైక వ్యక్తి తాత్యా.
సాయిని సాయిగానే ప్రేమించేవాడు. మేనల్లుడు కూడా తక్కువ తిన్నాడా! అంతకు రెట్టింపు కోపం ప్రదర్శించేవాడు.
సాయిబాబాను దైవంగా కాదు, మమతానురాగాలుగల వ్యక్తిగా ఒక్క క్షణం ఆయనను వీక్షిద్దాం! అంతటి ప్రేమమూర్తి తన మేనల్లుని కోసం తన జీవితాన్ని తృణప్రాయంగా వదులుకున్నాడు! మానవ ప్రేమ ఎలా ఉండగలదో సాయి చూపాడు.
సాయి భౌతికంగా కనుమరుగైనా, సాయి భక్తులకు సేవచేస్తూ తాత్యా మార్చి 12, 1945న సాయికి చేరువైనాడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr:Sreenivas Murthy
Latest Miracles:
- సాయి సన్నిధిలో గానగంధర్వుడు…..సాయి@366 నవంబర్ 11…Audio
- “తాత్యాని బాబా తప్పకుండా కాపాడతాడు. లే’’
- సాయి లెక్క తప్పదు!…..సాయి@366 నవంబర్ 2…Audio
- మనసులోని కోరిక…..సాయి@366 అక్టోబర్ 28….Audio
- రాలిన నక్షత్రం!…..సాయి@366 మార్చి 19….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments