Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice Support By: Mrs. Jeevani
13 మార్చి, 1924న హార్దా నుండి కృష్ణారావు నారాణరావ్ పారూళ్‌కర్ కుటుంబంతో సాయంకాలం నర్మదా నదీ తీరం చేరుకున్నారు.
అప్పటికి కొంచెం చీకటి పడుతోంది. వారు ఆ నర్మదా నదిని దాటి ఆవలి తీరం చేరాలి.
వారు అసలు ఎప్పుడో అక్కడకు చేరుకుని ఉండవలసినది. దారిలో బండి చక్రం ఇరుసు ఊడిపోవటం వలన అంత ఆలస్యం అయింది.
కారణం ఇది అని చెప్పినా ఎవరూ నదిని దాటిస్తామని ముందుకు రాలేదు. డబ్బు ఎక్కువగానే ఇస్తామన్నారు. అయినా ఒప్పుకోలేదు.
అందరకూ నిరాశ ఏర్పడ్డది. వెనుకకు వెళ్ళిపోదాం అనే నిశ్చయానికి వచ్చారు కృష్ణారావ్ గారు.
ఈ లోగా ఎవరో ఫకీరు వచ్చాడు. వస్తూనే జబర్దస్తీగా ఫకీరు ”మేము పగలంతా అటూ, ఇటూ తిరుగున్నాము. పద, మమ్మల్ని ఆవలి తీరం చేర్చు” అన్నాడు.
ఆ ఫకీరు కృష్ణారావ్ కుటుంబం ఉన్న చోటుకు వచ్చి ”మీరు కూడా ఆవలి తీరం చేరాలా?” అని అడిగాడు. ”అవును” అన్నారు వారు.
కారణం కూడా చెప్పారు ఫకీరుకు. పడవవాడు రానన్నాడు. అప్పుడు ఆ ఫకీరు ”ఇక్కడ అజమాయిషీ అంతా ఎవరు చేస్తారు?” అని అడిగాడు. ”ఇదంతా ఆంగ్లేయుల అధీనంలో ఉన్నది” అన్నాడు పడవవాడు.
”సరే. నేను ఇప్పుడే స్టేషనుకు వెళ్ళి ఉత్తర్వులు తీసుకు వస్తాను” అని ఆ ఫకీరు వెళ్ళిపోయాడు స్టేషన్ వైపు.
ఆ పడవవాడు ”మిమ్మల్ని పడవలో ఆవలి తీరానికి తీసుకు వెళతాను రండి” అన్నాడు కృష్ణారావ్ కుటుంబాన్ని చూసి. మనస్సు మార్చుకోవానికి కారణం ఏమి చెప్పలేదు ఆ పడవవాడు.
ఇంకా ఆ పడవ వాడు ”తొందరగా రండి” అనసాగాడు. అందరూ సామాన్లతో పడవ ఎక్కారు.
పడవ కదిలింది. ఆవలి తీరం చేరింది.
కృష్ణారావ్ కుటుంబ సభ్యులకు కళ్ళ నుండి నీళ్ళు వచ్చాయి.
ఆ ఫకీరు ఎవరో కాదు – సాయిబాబాయే అని వారు గ్రహించారు. కృష్ణారావ్ ”మావంటి మూర్ఖులు, సంసార చక్రంలో ఇరుక్కుపోయిన వారికి ఇటువంటి లీలలను చూపకుంటే సాయిబాబా చరణాలపై శ్రద్ధ కలగదు.
సాయి చరణాలపై శ్రద్ధ కలిగేటట్లు చేయమని సాయిని ప్రార్ధిస్తున్నాను” అంటారు.
నది ఆవలి తీరం చేర్చటమే కాదు, సంసార సాగరాన్ని కూడా దాటిస్తాడు సాయి.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr. Sreenivas Murthy
Latest Miracles:
- అంతే కదా!…..సాయి@366 నవంబర్ 6….Audio
- భాగ్యనగరిలో సాయి ఫకీరు…..సాయి@366 జూన్ 14….Audio
- మనసు ….. సాయి@366 మార్చి 17…Audio
- జయ మాణిక్య…..సాయి@366 డిసెంబర్ 22….Audio
- పటం కాదు, సాయిబాబాయే …. సాయి@366 ఫిబ్రవరి 17….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments