Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
కృష్ణారావ్ నారాయణ్ పరూల్‌కర్, సాధుభయ్యా, నారాయణ గోవింద షిండే చిన్ననాటి నుండి స్నేహితులు. స్నేహితులు కష్ట, సుఖాలలో పాలుపంచు కుంటారు. ఇందులో స్వార్ధం ఉండదు.
షిండేకు ఏడుగురు కుమార్తెలు. మగ సంతానం లేదు. షిండే దత్త భక్తుడు. ఒకసారి కృష్ణారావ్, షిండే గాణుగాపూర్ వెళ్ళారు.
కృష్ణారావ్‌కు ఒక ఆలోచన వచ్చింది స్నేహితుని గురించి. నీవు దైవం యొక్క పాదుకల ముందు నిలబడి ”నాకు సంవత్సరంలోపు పుత్ర సంతానం కలిగితే, ఆ పిల్లవాడిని నీ చరణ దర్శనానికి తీసుకుని వస్తానని మొక్కుకో” అని షిండేకు చెప్పాడు.
షిండే తాను కూర్చున్న చోటనే మొక్కసాగాడు. ”అలా కాదు” అని షిండేను పాదుకల ముందుకు తీసుకు వెళ్ళి మొక్కించాడు కృష్ణారావు 1903లో. దత్తుడు కరుణించాడు.
షిండేకు పుత్రుడు కలిగాడు. అయితే ఇదిగో, అదిగో అంటూ మ్రొక్కును తీర్చలేదు.
1911 నవంబరు వచ్చింది. కృష్ణారావ్, సాయి దర్శనం కోసం షిరిడీ పోబోతుంటే, షిండే కూడా మొదట రాననినవాడు వచ్చాడు.
అందరూ సాయి వద్దకు పోయారు. సాయి షిండేను చూచి ”గర్వంతో మిడిసిపుతున్నావా? నీ జాతకంలో పిల్లవాడు ఎక్కడ ఉన్నాడు? ఈ (నా) పొట్టను చీల్చి నీకు పిల్లవాడిని ఇచ్చాను. పిచ్చి వేషాలు వేశావంటే ఇక్కడ నుండి నెట్టిపారేస్తాను” అన్నారు.
ఇంకా కృష్ణారావ్‌ను చూచి ”అంతే కదా” అన్నారు. షిండే కనుల నుండి అశ్రుధారలు కారసాగాయి.
”బాబా పొరపాటైంది, క్షమించండి” అని ప్రార్ధించాడు షిండే.
కొద్ది కాలం తర్వాత షిండే భార్యా పిల్లలను, పిల్లవాడిని తెచ్చి సాయి చరణాలపై పడేశాడు. అ సమయంలో కూడా కృష్ణారావ్ షిండే వెంట వచ్చాడు. సాయి కృష్ణారావ్ వంక చూస్తూ ”అంతే కదా” అన్నారు.
గాణుగాపురంలో అక్షరమక్షరం మొక్కును కృష్ణారావ్ దగ్గరుండి షిండేతో చెప్పించారు. ఆ సంగతి కూడా సాయికి తెలియకుండా ఉండదు.
అందుకే కృష్ణారావ్ వంక చూచి సాయి ”అంతే కదా” అన్నారు, అన్నీ నాకు తెలుసన్నట్లు.
అక్షరం పొల్లుపోకుండా మొక్కు తీరింది. చేసిన మొక్కును మరువకూడదనే కాదు, సాయి దత్తుని తెలుసుకోవటమే కాదు, కృష్ణారావ్ వలె ఎందరు స్నేహితులుగా ఉండగలరు – అది అందరూ తెలుసుకోవాలి – అంతేకదా!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- కుదరదా? సరేలే! ….. సాయి@366 మార్చి 13….Audio
- పటం కాదు, సాయిబాబాయే …. సాయి@366 ఫిబ్రవరి 17….Audio
- ‘‘సద్గురువు కటాక్షం లభించిన వారికి కష్టాలు ఉండవు. బాబా మన సద్గురువు.’’
- సాయి శంకర…..సాయి@366 ఆగస్టు 6….Audio
- ‘‘ఈ తొమ్మిది నాణెలూ తొమ్మిది విధాల భక్తికి ప్రతి రూపాలు. జాగ్రత్తగా దాచుకో.’’
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments