దివిజ గాయకుల గుండియల్ …. …. మహనీయులు – 2020… నవంబర్ 6



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా స్వయంగా కీర్తనలు పాడేవాడు. రామకృష్ణ పరమహంస కూడా అంతే. పరమహంస పాడిన పాటలలో రాంప్రసాద్ వి ఎక్కువుగా ఉండేవి.

పొట్టపోసుకోవటం కోసం రాంప్రసాద్ దుర్గాచరణ్ మిత్ర అనే వ్యాపారి వద్ద చేరాడు ముప్పది రూపాయల వేతనంపై.

పాటలు వ్రాసి, కాగితాలను, కాలమును వృధా చేస్తున్నాడని తోటి వారి ఫిర్యాదుపై కాగితాలు తెప్పించి చూచాడు యజమాని.

వాటిని చదివాడు పరశించిపోయాడు “సుకవీ! నీవు సామాన్యుడవు కావు. ఇక నుండి నీవు నాకు ఏమీ చేయనక్కరలేదు.

నీ గృహానికే ముప్పది రూపాయలు పంపిస్తాను. నీవు కాళీ మాత పూజను చేస్తుండు” అన్నాడు యజమాని.

రాంప్రసాద్ నోటి నుండి అప్రయత్నంగా…

“అమ్మా! నేను నీకు సేవకుడిని

ప్రతిఫలం ఆశించకుండా నన్ను సేవించనీ,

నాకు ఉన్న ఒకే ఒక హక్కు ఏమిటంటే,

నీ పాద ధూళిని శిరస్సున దాల్చటమే” అని వచ్చింది.

ఆ భక్తి గేయాన్ని విన్న యజమానికి ఆనందాశ్రువులు రాలాయి.

రాంప్రసాద్ గానం విన్న మహారాజు కృష్ణ చంద్ర అతడిని తన ఆస్థాన గాయకుడిగా ఉండమన్నాడు.రాంప్రసాద్ సున్నితంగా తిరస్కరించాడు.

ఆ మహారాజు పరిస్థితిని గ్రహించి, పన్ను కట్టనక్కరలేని 100 భీగాల భూమిని ఇచ్చాడు. వారిద్దరు జీవితాంతం సోదరులుగా ఉండిపోయారు.

ఒకసారి అయన స్నానానికి గంగకు పోతుంటే, ఒక మహిళ ఆయనను పాటపాడమని కోరింది.

“ఇప్పుడే స్నానం చేసి వచ్చి పాడతాను” అని స్నానానికి వెళ్లాడు. స్నానం చేసి వచ్చాడు. ఆ మహిళ అక్కడ లేదు.

ఒక దివ్య వాని “ఆ మహిళ ఎవరో తెలుసా? కాశీ  అన్నపూర్ణ” అని వినిపించింది.

తల్లి దివ్య దర్శనం కాలేదని బాధపడ్డాడు. కాలి నడకన ప్రయాగ వరకు చేరాడు. ఇక నడవలేక పోయాడు.

“నీవు కాశీ రానక్కర లేదు. నేను ఇక్కడ కూడా ఉన్నాను. వినిపించు నీ గానం” అని వాణి వినిపించింది. అతను సంతోషంగా గానం చేసాడు. యావత్తు ప్రకృతి పులకించింది.

1803 దసరా గడిచింది. దీపావళి అమావాస్య వచ్చింది. కాళీ విగ్రహాన్ని గంగలో నిమజ్జనం  చేయటానికి భక్త బృందంతో నదిలో దిగాడు, తన శిరస్సుపై కలశాన్నుంచుకుని.

ఆ సమయంలో భక్తి గంగ అయన నోటి వెంట ప్రవహించింది. తన శిరస్సుపై ఉన్న కలశంతో ఆ గంగా జలంలో నిమజ్జనమయ్యాడు రాంప్రసాద్.

రాంప్రసాద్ మధుర గానంతో అమర గాయకుల గొంతులు, గుండెలు కూడా సంతసించాయి అమ్మతో పాటుగా.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles