Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నీ ఆలోచనలు, నీ చేష్టలు నా కొరకే వినియోగింపుము, నీవు తప్పక పారమార్థమును పొందెదవు” అంటారు సాయిబాబా. అట్లు చేసి తరించిన వారిలో త్యాగయ్యకు త్యాగయే సాటి.
త్యాగయ్యకు రాముడే కాదు, ప్రతి ఒక్కరిని తనను రాముని వానిగా చేయమని విన్నవించుకుంటాడు. అమ్మ వారిని రామ సహోదరిగా భావిస్తాడు.
కుమారస్వామిని ” నీవు మా రామునకు సోదరి కుమారుడవు” అని వర్ణిస్తాడు.
శంకరుని గూర్చి పలుకుతూ “సతత రామ నామ స్మరణానందుడవు నీవు. నీకు తప్ప రామ నామ తారక మంత్రం ఎవరికి తెలియునయ్యా!” అంటాడు.
సీతా లక్ష్మణ భరతాదులతో “మీతోపాటుగా రామునకు నన్ను సేవ చేయనీయరాదా?” అంటాడు.
రామునితో “ఏమయ్యా! రామచంద్రా వారితోపాటు నన్ను నీవానిగా చేసుకొనరాదా!” అని ప్రాధేయపడతాడు.
త్యాగరాజు మనవిని సాకేతపుర చక్రవర్తి అయిన రాముడు కాదన గలడా?
ఒక రాజు తనను సేవింపుమని కబురు పంపితే “నిధి చాల సుఖమా? రాముని సన్నిధి సేవ సుఖమా?” అంటూ రామునే సేవించి, రాజు కోర్కెను సున్నితంగా తిరస్కరిస్తాడు త్యాగరాజు.
ఒక శిష్యుడు సీతా రామ లక్ష్మణ సమేత కోదండరామ చిత్ర పటాన్ని బహుకరిస్తే “నను పాలింపగ నడచి వచ్చితివో నా ప్రాణనాథ” అంటూ రామ కుటుంబాన్ని చూచి మురిసిపోతాడు త్యాగయ్య.
త్యాగరాజును అనేక మంది ప్రముఖులు చూడ వచ్చేవారు, పాడేవారు, మాట్లాడేవారు. వారు తిరిగి వెళ్ళిపోతుంటే త్యాగరాజు శిష్యులతో సహా “ఎందరో మహానుభావులు, అందరికీ వందనములు” అని వందన సమర్పణ చేసేవారు.
ఆయన ఇది కాక, ఏకాదశి భజనలో “శ్రీరామా జయ రామా” పాడేవారు. ఈ రెండూ తప్ప వేరే ఏ కృతులూ మళ్లీ, మళ్లీ పాడటం త్యాగరాజు ఎరగడు.
త్యాగరాజ కృతులు తెలుగులో రచించినా, ఎక్కువగా వాటిని ఉపయోగించుకుంటున్న వారు తమిళులు, తన జీవిత చరమ దశను స్పష్టంగా చెప్ప గలిగిన జ్ఞాని త్యాగయ్య.
“పరమాత్ముడు జీవాత్ముడు” అనే కీర్తన గానం చేస్తూ పరమాత్మలో విలీనమైనాడు త్యాగయ్య.
1925లో తంజావూరు జిల్లా తిరువయ్యురులో త్యాగరాజ స్వామి సమాధి సమీపమున, తన సర్వస్వం వెచ్చించి బెంగళూరు నాగరత్నమ్మ గారు ఆయనకు ఆలయం నిర్మించింది.
త్యాగయ్యకు ఆధునిక పోకడలో రూపు రేకలు రేఖా మాత్రంగా తేగలిగిన ప్రజ్ఞాశాలి నాగయ్య గారు.
ఇలా రాముని సేవించిన త్యాగరాజు సేవలో తరించిన వారు, తరించ తహ తహ లాడే మహానుభావు లెందరో, వారందరకు వందనములు.
నేడు మే 4 . ఆంగ్ల కాలమాన ప్రకారం 4 – 5 – 1767 త్యాగరాజు జయంతి. సాకేత ప్రభువును త్యాగరాజ కీర్తనలతో స్తుతించెదము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- శిక్ష తప్పదు గాక తప్పదు! …..సాయి@366 జనవరి 18…Audio
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 25
- రాముని వారము, మాకేమి విచారము …. మహనీయులు – 2020… ఏప్రిల్ 2
- విన్నవించని చిన్న కోరిక …..సాయి@366 జూలై 4….Audio
- మ్రొక్కు మరవకు …. మహనీయులు – 2020… మే 23
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments