Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఒక గృహస్తు బ్రాహ్మణుడు సంతర్పణ చేస్తున్నాడు. ప్రమాద వశాత్తు అతని చిన్నారి బిడ్డ వంటశాలలోని గంజి గుంటలో పడి మరణించాడు.
అన్నదానం ఆగిపోతుందని భావించిన ఆ పిల్లవాని తల్లి, ఆ బిడ్డడిని తన ఒడిలో ఉంచుకుని, సంతర్పణ పూర్తి అయిన తరువాత ఆ విషయం భర్తకు తెలియ చేస్తుంది ఆ గృహిణి.
భార్య భర్తలు దీనాతి దీనంగా శ్రీరాముడిని ప్రార్థిస్తారు. దైవం కరుణించి, ఆ బిడ్డను బ్రతికిస్త్రాడు.
ఆ గృహస్తుడు ఎవరో కాదు భద్రాచల రామదాసుగా పేరు పొందిన కంచర్ల గోపన్న.
నేడు ఏప్రియల్ 2 . 2020 రామనవమి. ఈనాడు భద్రాద్రి రాముని దర్శింప చేసే కంచర్ల గోపన్నను స్మరించటం కంటే, ప్రాశస్త్యమైన దినం ఏముంటుంది!
“రామచంద్రులు నాపై చలము చేసినారు – సీతమ్మ! చెప్పవమ్మా” అని సీతమ్మను సిఫార్సు చేయమని కోరతాడు.
మరోసారి “నను బ్రోవమని చెప్పవే, సీతమ్మ తల్లి!” అని అమ్మకు విన్నవించుకుంటాడు.
మైనం వంటి మనసు కరగటానికి క్షణ కాలం పట్టవచ్చు. కానీ అమ్మ మనసు వెన్న వంటిది. మనసులోని భావమే ఆమెను కరిగింప చేస్తుంది.
రాముని సేవించుకోవాలనే శ్రద్ధ, ఆవేశం ఉన్నాయి భద్రాచల రామదాసుకు.
నవాబు సొమ్ముని రామ కుటుంబానికే వాడాడు రామదాసు. ఐనా ప్రభుత్వ ధనాన్ని అనుమతి లేకుండా ఖర్చు పెట్టడం దోషమే కదా! అందుకు శిక్షను అనుభవించవలసి వచ్చింది.
శిక్షలోని తీవ్రతకు ఆయన తట్టుకోలేకపోయాడు. దైవంతో పలికించేటంత భక్తి కోసమే భక్తుని తాపత్రయం.
రామదాసు కీర్తనలను భావన చేసి వ్రాయలేదు. ఆయనది భావనా సాహిత్యం కాదు. అనుభవ సాహిత్యమే.
అందుకే రామునిపై భక్తి ఉన్న వారి నోట అసంకల్పితంగా తెలుగు వారి నోటి నుండి ఆయన రచనలు బయటకు వస్తాయి.
ప్రతి భజనలోను “తక్కువేమి మనకు, రాముడొక్కడుండు వరకు” అని పాడతారు. “తారక మంత్రము కోరిన దొరికెను, ధన్యుడనైతిని ఓ రన్నా” అని సంతృప్తిగా రాముని తలవని వారుండరు.
రాముని కోసం రామదాసు పడే ఆవేదనను తెలియ చెప్పే మరొక పాట – “పలుకే బంగారమాయెనా! కోదండ పాణి” అనేది.
“ఏ తీరున నను దయ చూచెదవో ఇన వంశోత్తమ రామా!, నా తరమా భావ సాగర మీదను, నళినదళేక్షణ రామా!” అనేది రామదాసు నోటి నుండి రాలిన తెలుగు వారి సొత్తు.
రాముడినే మన సొమ్ము నగ చేసిన రామదాసును నిత్యము స్మరించెదము గాక!
నేడు శ్రీరామనవమి, ఏప్రియల్ 2, 2020. భద్రాద్రి రాముని దర్శింప చేసిన కంచర్ల గోపన్నను స్మరించెదము గాక!
శ్రీ రామ జయ రామ జయ జయ రామ!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- రామ లీల … మహనీయులు – 2020… జూలై 25
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
- ఓం శ్రీ దత్త స్వామినే నమః …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 7
- విన్నవించని చిన్న కోరిక …..సాయి@366 జూలై 4….Audio
- జయ జయ శ్రీరఘవీర సమర్థ …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 22
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments