జయ జయ శ్రీరఘవీర సమర్థ …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 22



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


పెండ్లి వారితో షిరిడీకి వచ్చిన సాయిబాబా దగ్గరలోనున్న ఖండోబా ఆలయంలోనికి పోవనుంటే, పూజారి మహల్సాపతి అడ్డగించాడు. కారణం సాయి మహమ్మదీయ వేష ధారణలో నుండుటయే.

కాశీలో విశ్వనాథ ఆలయంలో రుద్రాభిషేకం చేస్తున్నారు. అప్పుడు ఒక వ్యక్తి ఆ విశ్వనాథుని వద్దకు పోబోతుంటే అక్కడున్న వారు వారించారు.

కారణ మేమిటంటే కాషాయరంగు చొక్కాతో, జడలు కట్టిన వెంట్రుకలపైన టోపీతో ఉన్నాడు ఆ వ్యక్తి. అతనిని బ్రాహ్మణేతర బైరాగిగా భావించి, శివలింగమును ముట్టనీయలేదు వారు.

ఆ వ్యక్తి కోపగించుకోలేదు సరికదా అక్కడున్న బ్రాహ్మణులకు విశ్వనాథ లింగమునకు సాష్టాంగ నమస్కారము చేసి వెనుదిరిగి వెళ్ళిపోయాడు. ఇంతలో విశ్వనాథ లింగము మాయమైంది.

కారణమేమిటని ఆలోచించారు అక్కడున్న వారందరు. ఇందాక వచ్చిన బైరాగి మహాత్తుగా గ్రహించి, ఆయనను అనునయించి ఆలయానికి తీసుకు వచ్చారు.

వెంటనే శివ లింగం యథాస్థానమున ఉన్నది. ఆ బైరాగి కూడా అభిషేకంలో పాల్గొన్నాడు. ఆ బైరాగి సమర్థ రామదాసు.

విద్యారణ్యులు హరి హర బుక్కరాయలచే హిందూ రాజ్యమును ఏర్పరచిన రీతిన, సమర్థ రామదాసు శివావతారమైన శివాజీచే మరో హిందూ రాజ్యాన్ని స్థాపింప చేశారు.

ఐతే శివాజీ ఆ రాజ్యాన్ని రామదాసుకు సమర్పించినా, రామదాసు స్వీకరింపక, శివాజీ చేతనే ఆ రాజ్యాన్ని పరిపాలింప చేశాడు.

విద్యారణ్యులు పంచదశి అను ఆధ్యాత్మిక గ్రంథమును రచించినట్లు, సమర్థులు ‘దాసబోధ’ అను గ్రంథమును మరాఠీ భాషలో రచించి, ఆధ్యాత్మికమునే గాక ప్రాపంచికమును కూడ పామరులకు సైతము అందుబాటులోనికి తెచ్చారు.

సాయిబాబా కొందరు భక్తులకు దాసబోధను పారాయణ గ్రంథముగా చేశారు.

సాయి వలె భిక్షా వృత్తినే స్వీకరించారు సమర్థులు. ఇంకను అనేక గ్రామాలలో ఆంజనేయుని విగ్రహములు ప్రతిష్టించారు.

సమర్థులు ఆంధ్ర దేశమున కొంతకాలం ఉండి, కొన్ని రచనలను చేసారు.

ఆదిశంకరుల వలె, సమర్థులు తన తల్లి అంత్యకాలమున ఆమె సమక్షంలో గడిపి కర్తవ్యమును నిర్వర్తించారు, సుపుత్రునిగా.

వారణాసిలోని హనుమాన్ ఘాట్ లో హనుమంతుని మందిరము లేకుండుటచే, ఆంజనేయుని ప్రార్ధించి, హనుమను ప్రతిష్టించినారు.

శ్రీరాముని అనుగ్రహం పొంది, రామునిచే త్రయోదశాక్షరిని పొందిన సమర్థ రామదాసు మాఘ బహుళ నవమినాడు (మాఘ మాసం సామాన్యంగా ఫిబ్రవరిలో వస్తుంది) రామునిలో ఐక్యమైనారు.

ఆ ద్వాదశాక్షరిని స్మరించెదము గాక!

“శ్రీరామ జయరామ జయజయ రామ”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles