Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
భక్తి మార్గంలో ఉన్న మహనీయులు, తమ కిష్టమైన దేవతారాధనను గాని, తమ భక్తుల కిష్టమైన దేవతారాధనను ఆదేశించవచ్చు.
కపిలగిరిలో సమాధి చెందిన యోగానంద నరసింహ మహర్షి ఆయన పేరులోనే ఉన్నట్లు ఆయన ఒకయోగి పుంగవుడు, నరసింహ భక్తుడు,
ఆకారంలో మహర్షి. ఈ మహర్షి పూర్వాశ్రమ నామం కొండెబోయిన సుబ్బారాయుడు. ఈయనను బాల్యంలో యక్ష గానాలు, వీధి నాటకాలు ప్రభావితం చేశాయి.
ఒకసారి ఈతడు వీధి నాటకం ఆడేవారి వెంట పోయినాడు. వారిలో ఒకడైనాడు.
రంగస్థలంపై తన పాత్రను రక్తి కట్టించే వాడు. ఈయన నటన, వర్చస్సు చూచిన ఒక వైష్టవ పండితుడు ఈతనిని చేరదీసి, కొడుకు వలె ఆదరించాడు.
వేదాంతము నేర్పాడా బాలునకు, ఇంకా మంత్రాలను ఉపదేశించారాచార్యులు. ఇక పురాణాలు కొట్టిన పిండి అయ్యాయి.
ఈ బాలుడు, ఆచార్యుల అనుమతితో అడవిలోనికి పోయి మంత్ర జపం చేయసాగాడు. తాను ప్రహ్లాదుడనని భావించి నరసింహస్వామిని ఉపాసనా దైవంగా పూజించేవాడు.
కౄరమృగాలు ఏమీ చేసేవి కావు. ఇదంతా నరసింహుని కృపగా భావించాడాయన.
చెన్న పట్టణంలో దిగంబరాచల యోగిని చూచాడీయన. ఆయన కన్నులు తెరచి పలకరించేదాకా పాదాలు వదల లేదు. నాల్గవ దినం ఆ యోగి కన్నులు తెరచి, నెత్తిపై చేయి పెట్టి దీవించాడు.
సుబ్బారాయుని నోట “శ్రీ నారసింవా, శ్రీవారి అనే మాటలు వెలువడ్డాయి. సమస్త మంత్రాలతోపాటుగ యోగ మర్మాలు, సిద్దులు అభించాయి. ఆ సుబ్బారాయుడే శ్రీయోగానంద మహర్షి అయ్యాడు.
యోగానంద నరసింహ మహర్షి అబ్బూరులో యోగ యజ్ఞం సంకల్పించి యజ్ఞ కుండంలో గంధపు చెక్కలుంచి, బండతో కప్పి, దానిపై తొమ్మిది దినాలు సమాధిస్థులై, ధ్యాన తత్పరులైనారు.
ఆయన తన యోగ బలంతో గంధపు చెక్కల నుండి మంటలను తెప్పించాడు. మరోసారి ఆయన మరో చోట యజ్ఞం చేస్తూ భగభగ మండే యజ్ఞ కుండంలో కూర్చుండి అగ్ని దేవునితో తాదాత్మ్యాన్ని చూపారాయన.
ఆయన మంత్ర, జప, యజ్ఞాలతో వ్యక్తుల, గ్రామాల బాధలు, అరిష్టాలు తొలగించే వారు. ముముక్షువులకు యోగమో, మంత్రమో ఉపదేశించే వారు.
ఇక ఆయన సజీవ సమాధిలోనికి పోదల్పుకున్నారు, కపిలగిరిలో.
డిసెంబర్ 30, 1960 నాడు సమాధి స్థితులై బ్రహ్మ రంధ్రం ఛేదించుకొని విశ్వాత్మలో కలిసిపోయారు.
నేడు 30 డిసెంబర్. యోగానంద నరసింహ మహర్షి వర్ధంతి.
నరసింహుని కృప లభించును గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- జయ జయ శ్రీరఘవీర సమర్థ …. మహనీయులు – 2020…ఫిబ్రవరి 22
- ఓం జయ జగదీశ హరే…. మహనీయులు – 2020… సెప్టెంబరు 30
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- రామా, నీ దయ రాదా? …. మహనీయులు – 2020… జూలై 9
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments