Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ప్రపంచంపై విరక్తి చెందిన శ్రీ బి.వి. నరసింహ స్వామి 1925లో రమణ మహర్షిని ఆశ్రయించాడు. ఆధ్యాత్మికపథంలో అడుగు పెట్టాడు.
1928 (సుమారు)లో రమణాదేశం ప్రకారం ఆశ్రమం విడిచి పెట్టారు నరసింహ స్వామి.
1936లో తన గూటికి (అంటే షిరిడీ సాయినాథుని సన్నిధికి) చేరాడు శ్రీ బి.వి. నరసింహ స్వామి. ఈ ఎనిమిదేండ్లలో సజీవ సద్గురువుల నెందరెందరినో దర్శించాడు.
హుబ్లీలో సిద్ధారూఢ స్వామిని ఆశ్రయించాడాయన. సంస్కృతాన్ని నేర్చుకోమన్నారు సిద్ధారూఢులు. నేర్చుకున్నాడు. సిద్ధారూఢులు మహాసమాధి చెందారు.
ఖేడ్గాంభేట్ వెళ్ళి నారాయణ మహారాజును దర్శించి ”స్వామి, నేనొక రత్నాల వర్తకుణ్ణి. నేను అనేక రత్నాలను చూచాను. కాని నిర్దిష్టమైన ఒక రత్నమైనా నాకు కనిపించలేదు.
ఒకొక్క దానిలో పగులో, చుక్కలో, సుడులో ఏదో ఒక దోషం కనిపిస్తూనే ఉంది. ఏ దోషం లేని నిర్దిష్టమైన వజ్రం లభించేలా నన్ను ఆశీర్వదించండి” అన్నారు నరసింహ స్వామి మార్మికంగా.
పశ్చిమ దిశగా వెళ్ళమని నారాయణ మహారాజు ఆదేశం. అలా పయనమయిన నరసింహ స్వామి, స్వామి నిత్యానందులను, జిప్రు అవధూతను, స్వామి ముక్తానందను, మెహర్ బాబాను దర్శించారు.
సాకోరి చేరారు శ్రీ నరసింహ స్వామి. కొంతకాలం అక్కడ సాధన చేశారు ఆయన. ఒక అజ్ఞాత వ్యక్తి ఆదేశంతో షిరిడీలో అడుగు పెట్టాడు. ఆ దినం ఆగస్టు 29, 1936, శ్రావణ పూర్ణిమ.
రమణులు సాయిని దర్శింపుమని ఆదేశించలేదా? లేదా నరసింహస్వామిగారే షిరిడీకి వెళ్ళలేదా? అనే ప్రశ్న వస్తుంది.
రమణులు నరసింహ స్వామిగారికి సరైన ఆదేశం ఇచ్చారు. ”షిరిడీ వెళ్ళు అని నిర్ద్వంద్వంగా రమణులు చెప్పారు.
సాయిబాబా జీవిత చరిత్రను రచించి, భారత దేశం అంతా సాయి బాబాను గూర్చి తెలుసుకునేటట్లు చేయి” అని శ్రీ నరసింహ స్వామి గారికి, శ్రీ రమణ మహర్షి తెలిపారనే విషయాన్ని, 1960లో మరో రమణ భక్తుడైన శ్రీ టి.పి. రామచంద్ర అయ్యర్ తెలిపారు.
ఇంకా నరసింహ స్వామి గారు ”నా పొరపాటును చెబుతున్నాను. రమణుల మాటను వినక సమాధి అయిన సాయి బాబా నాకెట్లు మార్గదర్శికాగలడనే అపోహతో సజీవ గురువుల కోసం అన్వేషించాను.
నన్ను సాయి వద్దకు చేర్చిన రమణులకు యావజ్జీవం రుణపడి ఉంటాను ” అన్నారు ఆశ్రునయనాలతో.
కథ కంచికి, పిట్ట గూటికి చేరాయి.
రమణులు, సాయి పరమాత్మ నాణేనికి బొమ్మ, బొరుసులే!
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- మరచిపోయేది మానవ హృదయం…..సాయి@366 జూలై 9….Audio
- గుజరాతీ జరీ శాలువ …..సాయి@366 ఆగస్టు 10…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments