Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Jeevani
మానవుడు తీసుకునే నిర్ణయం మంచిది కావచ్చు. అయితే దానిని అమలుపరచటానికి ప్రయత్నించినప్పుడు ఒకటి, అర విషయాలు మరచిపోవచ్చును.
భక్తి విషయంలో కూడా ఒక్కొక్కసారి కొన్నింటిని
మరవటం జరుగుతుంది. ఈ మతిమరుపు నిర్లక్ష్యం వలన కలిగింది కాదు కనుక క్షమార్హమే అవుతుంది.
సాయిబాబా సాహిత్యంలో కూడా ఇట్టి సంఘటనలు కొన్ని ఉన్నాయి. కరుణామయుడైన సాయి ఈ మతిమరుపును తీవ్రంగా తీసుకొనక క్షమించును.
అది 1946 జూలై నెల. అప్పుడప్పుడే సాయిబాబా పేరు వ్యాపిస్తోంది దక్షిణభారతాన శ్రీ బి.వి. నరసింహ స్వామి పుణ్యాన.
శ్రీ విశ్వనాథం చెట్టి, జాయింట్ రిజిష్ట్రారు – కోపరేటివ్ సొసైటీలకు. మద్రాసుకు బదిలీ అయింది. ఇంకా కాపురం పెట్టలేదు ఆయన మద్రాసులో.
చెట్టి గారు సాయిబాబా భక్తుడు. మద్రాసులో ఉన్న శ్రీ బి.వి. నరసింహ స్వామి గారితో ప్రతిదినం సాయి లీలలను ముచ్చటించుకుంటు ఒక గంట గడిపేవారు.
ఒకసారి నరసింహ స్వామి గారు చెట్టి గారికి ఆంజనేయ స్వామి పిడిపై ఉన్న గంటను బహూకరింపుమని అడిగారు. ఆ గంట కూడా వెండి గంట.
అలా ఆయన కోరినది ఆల్ ఇండియా సాయి సమాజం కోసం కాదు. షిరిడీ సాయి సంస్థానానికి. చెట్టి గారు అంగీకరించారు.
వెండి గంటకు ఆర్డరు ఇచ్చారు. గంట తయారైంది. దానిని రేపు తనకు అందచేయమని, దానిని షిరిడీకి తీసుకుపోతానని స్వామి గారు చెట్టి గారికి చెప్పారు.
చెట్టి గారు ఆ గంటను చక్కగా అట్ట పెట్టెలో కట్టించి, తన గదికి తెచ్చుకుని, బీరువాలో పెట్టుకున్నారు తెల్లవారిన తరువాత ఇద్దామని. రాత్రి గడిచింది. తెల్లవారింది.
దైనందిన కార్యక్రమాలలోపడి గంట సంగతే మర్చిపోయారు చెట్టి గారు. ఆఫీసుకు బయలుదేరి కారు తలుపుతీయబోయారు.
ఏదో గంట కొట్టిన శబ్దం వినిపిస్తోంది. ఆ శబ్దం టెలిఫోను గంట శబ్దం కాదు. అప్పుడు ఆయనకు స్పురణకు వచ్చింది.
వెంటనే మేడ మెట్లు ఎక్కి, గంట ఉన్న ప్యాకెట్టును చేతిలోకి తీసుకుని మేడ దిగి, కారులో పెట్టుకుని, నరసింహ స్వామి గారి వద్దకు వెళ్ళి అందచేశాడు.
సాయి మనలను మరువడు
అంతేకాదు,
తనకు సమర్పింపవలసిన వాటినీ విడువడు.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- స్మరణమాత్ర ప్రసన్నాయ…..సాయి@366 జూలై 1…..Audio
- ఒక్కడూ రాడు!! … …. మహనీయులు – 2020… ఆగస్టు 9
- ‘చిత్రం’ భలే విచిత్రం…..సాయి@366 జూలై 11…Audio
- అపర భగీరధుడు …..సాయి@366 అక్టోబర్ 18….Audio
- మరో డైరీ …..సాయి@366 జూలై 19…Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments