Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Voice support by: Mrs. Jeevani
ఖేడ్గాం భేట్ లోని నారాయణ మహారాజును చూచి ‘‘స్వామీ! నేనొక రత్నాల వర్తకుణ్ణి. నేను అనేక రత్నాలను పరీక్షించాను ప్రతి దానిలోను పగులో, చుక్కలో, సుడులో, ఏదో ఒక దోషం కనిపిస్తూనే ఉన్నది.
ఏ దోషం లేని నిర్ధిష్టమైన వజ్రం లభించేలా ఆశీర్వదించండి” అని భావగర్భితంగా పలికాడు శ్రీ బి.వి. నరసింహ స్వామి.
ఆయనకు లభించినది శ్రీసాయిబాబా. సాయితో పోల్చతగినది అంత పరమ పావనమైనది వేరొకటి లేదు గదా!
రేగే గారు ఆయనను సాయి వ్యాసుడు అన్నారు. అటులనే సాయి అలనాడు కేవలము షిరిడికి, మహారాష్ట్రకు పరిమితమైనాడు. ఆయన వైభవాన్ని భారత దేశపు నలు మూలలకు విస్తరింప చేసిన ఖ్యాతి శ్రీ నరసింహ స్వామిది.
ఆయన తన రచనల ద్వారా, భక్తి ద్వారా, సాయి మందిర నిర్మాణముల ద్వారా, ప్రసంగాల ద్వారా, సత్సంగముల ద్వారా సాయిని ఎందరికో ఇలవేల్పుగా చేశారు అనటం సత్య దూరం కాదు.
పది వాక్యాల వ్యాసం వ్రాయాలన్నా, పరిశోధనా గ్రంథము వ్రాయాలన్నా, సాయి పూజను ప్రారంభించాలన్నా, ఏ ఇతర ప్రక్రియ చేయాలన్నా, శ్రీ బి.వి. నరసింహ స్వామి గారి ప్రసక్తి లేకుండా జరగదు.
సాయిని కేవలం హైందవ మతాచారంలోనే పూజించాలని, సాయి పేరుతో ఇతర దైవాలను ప్రక్కకు నెట్టాలని ఆయన భావం కాదు.
ఆయన ముస్లింలను తన పూజా మందిరంలోని తీసుకు వెళ్ళి పాతిహా చేయించే వారు.
ఆయన రచనలైన Devotees Experiences, Sai Babas Charters & Sayings, Life of Sai Baba మొదలైనవి ఎన్నో భాషలలోకి తర్జుమా చేయబడి అనేక ముద్రణలు పొందాయి.
స్వామి గారు సాయి బాబాను ఎలా సేవించాలో ఆయన శిష్యుడైన సాయి పాదానందాకు ఒసగిన ప్రథమ సందేశం:
”మొదట ఆయన పాదాలను ధ్యానింపుము. పాదము నుండి శిరస్సు వరకు, శిరస్సు నుండి పాదము వరకు పైకి క్రిందకి ధ్యానము చేసి మనస్సును ఆయన పాదములకు శరణాగతి చేయుము. నీవు పరిపూర్ణానందము పొందగలవు”.
నేడు అక్టోబరు 18 (1953) శ్రీ బి.వి. నరసింహ స్వామి గారు సాయి చరణాలలో ఐక్యమైన రోజు.
నేడైనా ఆ అపర భగీరథుణ్ణి స్మరించి తరిద్దాం.
Compiled By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరిబోస్
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- గూడు చేరిన బీవీఎన్…..సాయి@366 ఆగస్టు 29….Audio
- గురుభక్తి…..సాయి@366 ఏప్రిల్ 17….Audio
- గూడు చేరిన పక్షి…..సాయి@366 జనవరి 26….Audio
- జ్ఞానిని గుర్తించిన జ్ఞాని …..సాయి@366 డిసెంబర్ 1….Audio
- సాయినాథుని ధుని…..సాయి@366 ఏప్రిల్ 4….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments