Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బ్రిటిష్ కాలంలోనే నేమినాథుడు నిర్వాణం చెందిన గిర్నార్ పర్వతపు పోస్టల్ స్టాంపును అక్టోబరు 18, 1929న ముద్రించటం జరిగింది. అయన నిర్వాణ దినం ఆషాఢ శుద్ధ అష్టమి.
అందరి తీర్థంకరుల జీవితాలు ఒకే రకంగా ఉంటాయి. 22వ తీర్థంకరుడైన నేమినాథుని జీవితం వేరే రకంగా ఉంటుంది.
నేమి కుమారుడు అనంతరం నేమినాథుడు అయ్యాడు. ఈతని జీవిత చరిత్రలో శ్రీకృష్ణుడు, సత్యభామ వస్తారు.
నేమినాథుడు రాజా కుమారుడు. అందగాడు. ఈయనను పరిణయమాడటానికి ఎందరో సిద్ధంగా ఉన్నారు. జూనాగఢ్ మహారాజైన ఉగ్రసేనుని కుమార్తె అయిన రాజుల్ తో వివాహం నిశ్చయమైంది.
పెండ్లి పరివారంతో నేమినాథుడు జూనాగఢ్ పరిసర ప్రాంతాలకు చేరుకున్నాడు.
దారిలో అనేక కంచెలు కనబడ్డాయి. వాటిలో అనేక జంతువులు, పక్షులు బందీలుగా కనబడ్డాయి. అవి ఎంతో విలపిస్తున్నాయి.
“ఇదేమిటి?” అని మావటి వాన్ని అడిగాడు. “ప్రభూ! తమ వివాహ సందర్భంలో ఏర్పాటు చేయబోయే మాంసాహారపు విందుకు గాను వీటిని ఇక్కడ ఉంచారు” అన్నాడు.
తన వివాహ సందర్భంగా ఇన్ని మూగ జీవాలను హతమార్చుటయా? అంటే వాటిని వధించటానికా? నేను అంటే నా వివాహం కారణమవుతోందా?
“నా సంతోషం కోసం, ఇతరుల సంతోషం కోసం, ఇతరుల సంతోషం కోసం వీటిని వధించటం తగదు” అని అందరితోను చెప్పి నేమినాథుడు దిగంబరియై గిర్నార్ పర్వతం వైపు వెళ్లిపోయాడు.
ఈ విషయం కాబోయే పెండ్లి కూతురుకు తెలిసి, స్పృహ తప్పి పడిపోయింది. కొద్ది సేపటికి తెలివి తెచ్చుకుంది.
ఆమె తనకు కావలసిన భర్తకు ఉన్న భూత దయకు సంతసించింది. తండ్రి ఆమెకు వేరొక సంబంధాన్ని చూసి, పెండ్లి చేస్తానన్నాడు. ఆమె అంగీకరించలేదు.
తాను కూడా సన్యసించటానికి గిర్నార్ పర్వతం వైపు వెళ్లింది. ఆమె కూడా జైన మతంలో ఉత్తమ స్థానాన్ని పొందింది.
నేమినాథుడు తన సాధన వల్ల 22వ తీర్ధంకరుడయ్యాడు. గిర్నార్ పర్వతం దత్త సాంప్రదాయంలోనే కాక, జైన మతంలో విశిష్ట స్థానం సంపాదించుకున్న పవిత్ర స్థలమైంది.
నేమినాథునకు గల మరొక పేరు అరిష్టనేమి. అటు గాధామయంగా ఉన్న గతాన్ని, చారిత్రాత్మకంగా కలిపే ముఖ్యమైన జీవితం నేమినాథునిది.
నేమినాథుడు దేని కొరకు రాజ్యాన్నే కాదు. వైవాహిక జీవితాన్ని కాదన్నాడో – ఆ అహింసను మనం కూడా పాటిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఓం నమో భగవతే గోపీనాథాయ …. మహనీయులు – 2020… జూలై 3
- అఘోరం …. మహనీయులు – 2020… సెప్టెంబరు 29
- పోయింది లోభం! వచ్చింది లాభం!! …. మహనీయులు – 2020… అక్టోబరు 28
- సందర్శనం …. మహనీయులు – 2020… జూన్ 8
- చెప్పవద్దు…. మహనీయులు – 2020… అక్టోబరు 27
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments