Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
మహర్షి సంతమట్ లో సుప్రసిద్ధుడు. బాల్యంలో ఆయనను రామానుగ్రహాలాల్ దాస్ అని పిలిచేవారు.
రామానుగ్రహాలాల్ దాస్ మెట్రిక్యులేషన్ పరీక్షలో ఒకసారి సర్వస్వాన్ని త్యజించి, రామునకు శరణాగతుటయే జీవిత పరమార్ధము అనే తులసీదాస్ గారి బోధను పరీక్షలోని ప్రశ్నకు అనుగుణంగా వ్రాసారు.
ఆ క్షణం నుండి, ఆ పరీక్ష హాలులోనే జీవిత పరమార్దాన్ని తెలుసుకోవాలనే ప్రబల ఇచ్ఛ మొదలైంది.
ఇక ఆ నాటి పరీక్షను వ్రాయలేదు. ఆత్మజ్ఞానాన్ని బోధించగల గురువు కోసం పరీక్ష హాలునుండే బయలుదేరాడు.
సంత్ బాబా దేవీ సాహెబ్ శిష్యుడు దృష్టియోగం నేర్పాడు. అదే సంవత్సరంలో దేవీ సాహేబ్ ను సద్గురువుగా స్వీకరించి దీక్ష పొందాడు.
నాదాను సంధానము (దృష్టి యోగము)లో పరిపక్వత సాధించాడు. దేవీ సాహెబ్ అనంతరం బాబా మోహిసంత్ మట్ ను దేశ విదేశాల్లో వ్యాపింపచేశాడు.
ఒకసారి బాబా మోహిని దర్శించటానికి రైలులో లాల్ సఖేజీ అనే సత్పురుషుడు బయలుదేరాడు. అది బీహారు రాష్టం.
ఆ పెట్టెలో కొత్తగా పెండ్లి అయిన భార్య, భర్త, తదితరులున్నారు. ఎక్కడ, ఎప్పుడు ఎక్కారో తెలియదు దుండగుల గుంపు ఒకటి ఆ పెట్టెలో నానా బీభత్సం చేస్తోంది.
పెండ్లి కుమారుని బలవంతంగా లెట్రిన్ లో పెట్టి బయటకు రాకుండా చేసింది. ఇక పెండ్లికుమార్తె చెంతచేరి కారుకూతలు కూయసాగారు. వెకిలి చేష్టలు చేస్తున్నారు. లాల్ సఖేజీ సహించలేకపోయాడు.
“ఇలానా మీరు ప్రవర్తించేది?” అని దుండగులను హెచ్చరించాడు. “ముందు నీ సంగతి చూడాలి” అంటూ దుండగులు లాల్ సఖేజీని పెట్టెనుండి బయటకు విసిరేశారు.
“నీ పవిత్ర దర్శనం కోసం వస్తుంటే ఇవన్నీ ఏమిటి?” అని బాబా మోహిని తలచుకున్నాడు.
లాల్ సఖేజీ పడటం పడటం ఎండుగడ్డి కుప్పపై పడ్డాడు. దీన్ని చూచి, గార్డు రైలును ఆపి, లాల్ సఖేజీ వద్దకు వచ్చాడు.
“నా సంగతి కాదు ఆ పెట్టెలో ఉన్న దుండగులను పట్టుకోండి” అన్నాడు ఆయన. గార్డు పోలీసులతో ఆ పెట్టెలోని దుండగులను బంధించాడు.
లాల్ సఖేజీ మెల్లగా భగత్ పుర్ దగ్గరలో ఉన్న బాబా మోహిని దర్శించాడు.
బాబా మోహి ఆ సమయంలో “భగవంతుడు రక్షంపదలచిన వారిని ఎవరు బాధించగలరు?” అనే ప్రవచనం చెపుతున్నారు. ఇది తన గురించే అనుకున్నాడు. ‘అవును’ అన్నట్టుగా బాబా మోహి చిరునవ్వు నవ్వాడు.
సుందర్ దాస్ జీ అనే భక్తుడు బాబా మోహి ఆశ్రమం కోసం రెండు పడవల నిండా ఎండు గడ్డితో గంగా నదిలో ప్రయాణిస్తున్నాడు.
ఆ పడవలు నదిలో బురదలో చిక్కుకున్నాయి. ఆ రాత్రంతా ప్రయత్నిస్తూ చలిగాలిలో ఎంతో బాధను అనుభవించాడు సుందర్ దాస్ జీ ధ్యానంలో తన దీన స్థితిని బాబా మోహికి విన్నవించాడు.
ఒక దివ్య కాంతి ఆయనకు గోచరించింది. ఎవరి సహాయం లేకుండానే ఆ పడవలు కదలసాగాయి. ఇది కదా గురువు కృప అనుకున్నాడు సుందర్ దాస్ జీ.
బాబా మోహి తన 102 ఏట 8. 6. 1986న దేహాన్ని విడిచారు.
నేడు జూన్ 8 , సంత్ మట్ ను, బాబా మోహిని స్మరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- పదవి వారసత్వం కారాదు! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 16
- గురువుల కన్న అమ్మ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 9
- నానారాజ్య సందర్శనం …. మహనీయులు – 2020 – జనవరి 28
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
- ఒకరు భక్తులైతే చాలు …..సాయి@366 మార్చి 20….Audio
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments