పదవి వారసత్వం కారాదు! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 16



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సాయిబాబా సచ్చరిత్ర “మానవ జన్మ గొప్పదనియు, తుదకు మరణము తప్పదనియు గ్రహించి, మానవుడు ఎల్లప్పుడు జాగ్రదావస్థలోనే ఉండి, జీవితము యొక్క పరమావధిని సంపాదించుటకై యత్నించవలెను” అంటుంది.

సిక్కుల మూడవ గురువు అమర్ దాస్. ఈయన, మరికొందరు గుర్రములపై స్వారీచేస్తూ పోతున్నారు.

ఒక గోడ విరిగి తమ మీద పడిపోయే స్థితిలో ఉన్నప్పుడు గురు అమర్ దాస్ గుర్రాన్ని మరింత వేగంగా తోలి, ఆ ఆపదనుండి తప్పించుకున్నాడు.

అయన వెంట ఉన్నవారు ” ప్రాణము మీద అంత తీపియా? అన్నారు. అమర్ దాస్ శరీరం భగవత్ ప్రసాదమని, శరీరాన్ని ఉన్నతమైన విలువల కోసం త్యాగం చేయవచ్చునని, కావాలని మరణం తెచ్చుకోనక్కర లేదని చెప్పాడు.

అమర్ దాస్ తన సోదరుని కోడలు గురునానక్ బాణీలకు (కీర్తనలను) పాడుతుంటే, వాటి భావాన్ని గ్రహించి తన్మయుడైనాడు.

61  ఏండ్ల వయస్సులో ఉన్నప్పుడు, వెంటనే సిక్కు మతంలో నానక్ తరువాత గురువైన అంగద్ దేవ్ కు శిష్యుడైనాడు.

శరీరాన్ని గురు సేవకే అంకితం చేసాడు. 12 ఏండ్లు బియాన్ నదినుండి జలాన్ని గురు అంగద్ కొరకు భుజముపై (బిందె, కుండ) పాత్రను పెట్టుకుని తెచ్చాడు.

విశేషమేమిటంటే తన గురువు వైపే చూస్తూ (వెన్ను భాగాన్ని గురుదేవులకు చూపకుండా) గురుధ్యాసతో నీటిని తెచ్చేవాడు.

ఒకసారి అమర్ దాస్ ఒకరి ఇంటి ముందున్న మోడువారిన చెట్టుకు తగిలి క్రిందపడ్డాడు.

ఆ ఇంటి యజమాని ఎవరో పడినట్లున్నారు చూడు అన్నారు భార్యను. “కొంపాగోడు లేని అమరే అయ్యుంటాడు” అని ఆమె ఊరుకోక అమర్ దాస్ ను ఆయన గురువైన అంగద దేవ్ ను దుర్భాషలాడింది.

తనను దుర్భాషలాడినా అమర్ దాస్ సహించాడు. తన గురువును దుర్భాషలాడితే, సహించలేకపోయాడు, ఆ గృహిణికి పిచ్చి ఎక్కింది.

ఎండిన మోడు చిగురించింది. అడవికి పోయి కట్టెలు కొట్టి అన్నదానానికి (లంగరుకు) ఇచ్చేవాడు.

సేవను చేసేది ప్రతిఫలం కోసం కాదు. అమర్ సేవను గుర్తించి తన అనంతరం 3 వ గురువుగా అమర్ దాస్ ను చేశాడు గురు అంగద్ దేవ్.

లంగర్ (అన్నదాన గృహాన్ని) అభివృద్ధి చేశాడు అమర్ దాస్. పలువురు కలిసి, తారతమ్యాలు లేక కలిసి భుజించేదే లంగర్.

అలా భోజనం చేయని వారిని రాజులైన, మహారాజులైన దగ్గరకు రానిచ్చేవాడు కాదు.

అక్బరు కూడా లంగర్ లో నలుగురితోపాటు కలిసి భుజించి, ఆనందించి, కొన్ని గ్రామాలను కానుకగా ఈయబోయాడు. అమర్ దాస్ అంగీకరించలేదు.

గురు అమర్ దాస్ తనకు లభించిన గురుత్వాన్ని, వారసత్వపు హక్కుగా భావించక, తన కుమారుని కాదని, ఆధ్యాత్మికవేత్త సాహసి అయిన అల్లునకు ఇచ్చాడు.

73వ ఏట గురు పీఠాన్ని అలంకరించి ఆయన, తన 95వ ఏట సకలబలునిలో ఐక్యమయ్యాడు.

నేడు ఆయన మహాసమాధి చెందిన దినం సెప్టెంబర్ 16 (1574). ఆయనను, గురుగ్రంథ సాహెబ్ లో ఉన్న ఒక వాక్కును స్మరిద్దాం.

“ఓ కనులారా! హరుడు (దైవము) మీ కళ్ళలో కాంతిని నింపాడు. ఆయననే తప్ప ఇతరులను చూడకండి!”

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles