Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
సాయిబాబా సచ్చరిత్ర “పావనమైన మనస్సులోనే వివేకము, వైరాగ్యము మొలకలెత్తి, క్రమంగా ఆత్మసాక్షాత్కారమునకు దారి చూపును” అంటుంది.
సిక్కుల మొదటి గురువైన నానక్ దగ్గరకు కుర్రవాడైన ఒక గొడ్ల కాపరి వచ్చి నమస్కరించి, “ఓ దయామయా! నీ దర్శన భాగ్యం కలిగింది నాకు. నన్ను ఈ చావు, పుట్టుకల నుండి విముక్తున్ని చేయి” అని ప్రార్ధించాడు.
“నీవు చిన్న వాడివి. అప్పుడే నీ కింత ఆధ్యాత్మిక భావం ఎలా ఏర్పడింది?” అడిగాడు నానక్.
“నిన్న కొందరు సైనికులు తోటలో చొరబడి, అన్ని మొక్కలను, చెట్లను ధ్వసం చేశారు.
ఆ చెట్లు, మొక్కల నేల కూలటం చూచి, మనిషి కూడా ఇంతే కదా, అనిపించింది. చావు లేని స్థితికి పోవాలనిపించింది” అన్నాడు.
ఆ కుర్రవాని పేరు బుర్రా. బురాను చూచి “బుడ్డాలాగే (వయసు ముదిరిన) వాడిలా ఆలోచించావు” అని మెచ్చుకున్నారు.
ఇక బురా కాస్తా బుడ్డా అయ్యాడు. నానక్ అనుచరుడయ్యాడు. బుడ్డా అందరి చేత మన్ననలు పొందాడు.
దాదాపు 125 సంవత్సరాలు జీవించాడు. ఈతని నీతి, నిజాయితీలు ఆరుగురు సిక్కు గురువులను ఆనందపరచాయి.
నానక్ రెండవ గురువును అంగద్ గా నియమించినప్పుడు, బుడ్డానే అంగద్ కు తిలకం దిద్దాడు.
అలా నలుగురు గురువులు గురుత్వం స్వీకరించేటప్పుడు బుడ్డానే తిలకం దిద్దాడు.
సిక్కుల అయిదవ గురువు అర్జున్ దేవ్. అర్జున్ దేవ్ భార్య పేరు గంగా దేవి. గంగా దేవి కడుపు పండలేదు.
ఈ విషయమే తన భర్త అయిన గురు అర్జున్ దేవ్ కు చెప్పి దీవించమన్నది తనను. “దీవించవలసినది నేను కాదు. భాయ్ బుడ్డా” అని చెప్పాడు అర్జున్ దేవ్.
మరునాడు గంగ విందు భోజనం తయారు చేయించి, సపరివారంగా, ఒక పల్లకిలో వెళ్లి బుడ్డా పాదాలకు నమస్కరించింది.
బుడ్డా ఆమె సమర్పించిన నైవేద్యాన్ని తీసుకోలేదు. భర్త వద్దకు పోయి జరిగిన విషయం చెప్పింది.
గురు అర్జున్ దేవ్, ఆమెకు ఏమి చేయాలో చెప్పాడు. గంగా దేవి స్వయంగా ఆహార పదార్దాలను తయారు చేసి, కాలి నడకన భాయ్ బుడ్డా వద్దకు పోయి నమస్కరించి, నైవేద్యం సమర్పించింది.
బాబా బుడ్డా ఆమె సమర్పించిన భోజనంలోని ఉల్లిపాయను చేతిలోకి తీసుకుని, వేరొక చేతితో చితకకొట్టాడు.
“చూశావుగదా! ఇట్లాగే శత్రువులను సంహరించే పుత్రుడు కలుగుతాడు” అని ఆమెను దీవించాడు బుడ్డా. అతడే హర్ గోవింద్. ఆడంబరాలు బడ్డాను వశపరచుకోలేవు.
బాబా బుడ్డా జ్ఞాపకార్థం ఒక గురుద్వార్ వెలసింది.
నేడు అక్టోబర్ 6. బాబా బుడ్డా జయంతి.
ఆయనవలె నిరాడంబరంగా జీవింతుము గాక!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Sreenivas Murthy
Latest Miracles:
- ఎవరికీ తలవంచకు…. మహనీయులు – 2020… మే 30
- సువర్ణాక్షరాలు …. మహనీయులు – 2020… ఆగస్టు 11
- సేవకొరకే తనువు…. మహనీయులు – 2020… మే 14
- సూక్ష్మ బుద్ది …. మహనీయులు – 2020… జూలై 7
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments