Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
“నా సర్కారు ఖజానా నిండుగా ఉంది. త్రవ్వి బండ్లలో తీసుకొనిపొండు” అనేవాడు సాయి.
సిక్కుల గురు అర్జున్ దేవ్ “ఓ సోదరా! ఆ హరిని సంపద ఆర్జించు. అగ్ని దాన్ని దహించదు. నీరు దాన్ని ముంచివేయదు. అది నువ్వు ఎక్కడకు వెళ్ళినా వదలిపోదు” అనే వారు.
మియామీర్ అనే ముస్లిం చేత స్వర్ణ దేవాలయమునకు పునాది రాయి వేయించిన పవిత్రుడు.
సిక్కుల పరమ పవిత్రమైన గురుగ్రంథ్ సాహెబ్ ను సంకలనము చేసి హర్ మందిర్ లో పదిలపరచిన అయన ముందు చూపును ఉహించుట కష్టం. అదియే 11వ సిక్కుల గురువు అయినది.
గురు అర్జున్ దేవ్ సతీమణి పేరు మాత గంగ. ఆ దంపతులకు సంతానములేదు. ఇతర భక్తులవలె ఆమె కూడా తనకు సంతానము కావలెనని ప్రార్ధించింది.
“నీ కోరిక తీర్చుట అంటే నా కోర్కెను తీర్చుకున్నట్లే అవుతుంది. నేను ఇతరుల కోరికలు తీర్చాలికాని, నా కోర్కెను తీర్చుకొనకూడదు” అని భార్యకు సమాధానం చెప్పాడు గురు అర్జున్ దేవ్.
ఇది గురువులు ఎంత జాగ్రత్తగా మసులుకోవాలో తెలిపే సన్నివేశం. ఆమె పరిపరి విధాల ప్రార్దించిన తరువాత, ఇతర మహనీయుల దీవెనల కోసం ప్రయత్నింపుమన్నాడు భర్త ఐన గురుదేవుడు.
ఒకసారి గురు రాందాస్ సిక్కుల నాల్గవ గురువు మరియు అర్జున్ దేవ్ తండ్రి ఒక వివాహ సందర్భంలో లాహోరుకు వెళ్ళాల్సివుంది.
కానీ, పనుల ఒత్తిడివలన మొదటి కుమారుడైన ప్రీతిచంద్, రెండవ కుమారుడైన మహాన్ దేవ్ వెళ్ళటానికి నిరాకరించారు.
తండ్రి ఆజ్ఞ ఇచ్చిన వెంటనే మూడవ కుమారుడైన అర్జున్ దేవ్ లాహోరు వెళ్ళాడు. గురువైన తండ్రి మాటను పాటించుటకు అర్జున్ దేవ్ చేసి చూపాడు.
అర్జున్ దేవ్ ఖ్యాతి విని అసూయచెంది, ఇంకా అపోహపడిన జహంగీర్, అర్జున్ దేవ్ ను ఖైదు చెసాడు. చిత్రహింసలకు గురిచేశాడు.
ఎర్రగా కాలిన ఇనుప కడ్డీలపై కూర్చుండబెట్టి వేడి వేడి ఇసుకను అర్జున్ దేవ్ పై పోసేవారు. ఐనా అర్జున్ దేవ్ చలించలేదు.
“ఓ మనసా! హార్ జీ నీ రక్షణ చూస్తున్నప్పుడు నీవేల బాధపడవలె” అనేవాడు. ఆయా చిత్రహింసలను చూచిన పీర్ మియాన్ మీర్ చలించిపోయాడు.
మియాన్ మీర్ లాహోర్ పట్టణాన్ని తన ఆధ్యాత్మిక శక్తితో దగ్ధం చేయ బూనినా, అర్జున్ అంగీకరించలేదు.
“ఓ ప్రభూ” నీవే నీవే నా భూషణానివి. నీవేది ఇచ్చినా అందులో శాంతి ఉంటుంది” అనేవాడు అర్జున్.
క్రూర శిక్షలకు లొంగని అర్జున్ చేత ఆవు మాంసాన్ని తీసివేసి, ఆవు తోలులో చుట్టి వేయాలని విరోధుల పన్నాగం.
“హరునకు తప్ప ఎవరికీ భయపడను” అన్నాడు అర్జున్. “కడసారిగా నదిలో స్నానం చేసిన తరువాత శిక్షను అమలుచేద్దురుగాని” అని అర్జున్ పలికి నదిలో దిగి “జప్ జీ”ని పఠనచేస్తూ, అందరకూ ఆశ్చర్యం కలిగేటట్లు అంతర్ధానం అయ్యాడు. ఆ దినం మే 30, 1606.
నేడు మే 30, అర్జున్ దేవ్ అంతర్దానమైన రోజు. ఆయనను స్మరించి ఆయన కోరికను మనం పాటిద్దాం-
“ముకుళిత హస్తాలతో నిన్నో వరం కోరుతా. ఓ సాహెబ్ నానక్, నీ ప్రార్థనలు, ధ్యానాలు అహోరాత్రులు ప్రతి ఊపిరితో చేసేలా ఆశీర్వదించు…”
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- సువర్ణాక్షరాలు …. మహనీయులు – 2020… ఆగస్టు 11
- గురువుకు తిలకం దిద్దిన భక్తుడు… .మహనీయులు – 2020… అక్టోబరు 6
- అల్లుడే సద్గురువు …. మహనీయులు – 2020… సెప్టెంబరు 1
- సేవకొరకే తనువు…. మహనీయులు – 2020… మే 14
- గురువుల కన్న అమ్మ…. మహనీయులు – 2020… ఏప్రిల్ 9
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments