సేవకొరకే తనువు…. మహనీయులు – 2020… మే 14



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


సేవ ఎలా ఉండాలో సాయిబాబా సచ్చరిత్ర 39వ అధ్యాయంలో చెప్పారు.

అవి గురు అర్జున్ ఐదవ గురువుగా ఉంటున్న కాలం. ఆ కాలంలో తీర్థ అనే పేరు గల ఒక ధనవంతుడు ఉండేవాడు.

అంతులేని సంపద అతనిది. ఒకసారి అర్జున్ దేవ్ బోధలను వినటం తటస్థించింది.

క్రమశిక్షణతో మెలగే ఆ సిక్కులు, అందరినీ ఆహ్వానించే లంగర్ (అన్నదాన గృహము) అతనిపై ఎంతో ప్రభావాన్ని చూపాయి.

ఇవన్నీ కాకుండా శాంతి కలిగింది గురుదేవుల సన్నిధిలో. ధనమును సంపాదించుకొనవచ్చును గాని, శాంతిని కొనలేము గదా! ఆ చిత్త శాంతి కోసం సిక్కు మతంలోకి మారదలచాడు.

సిక్కు మతంలోనికి తనను కూడా చేర్చుకొమ్మని అడిగాడు ఆ ధనికుడు. మతమును మార్చుకొని సిక్కుగా మరవచ్చును గాని, నిజమైన సిక్కుగా జీవించటం కష్టం అని చెప్పాడు అర్జున్ దేవ్.

తాను ఎన్ని కష్టాలకైనా సిద్దపడతానని, మీ చరణాలు చాలునని చెప్పాడు. ఆ నూతన వ్యక్తిని మాంజా అని పిలిచేవారు.

అతడు ఆస్తినంతటిని వదలి అర్జున్ దేవ్ వద్దకు వచ్చాడు. లంగర్ లో ఎన్నో పనులను చేసేవాడు.

అతి కష్టమైన పని అడవికి వెళ్ళి వంటకు ఉపయోగించే కట్టెలను తేవటం. భోజనం లంగరులోనే చేసేవాడు.

ఒకరోజు మాంజాను అందరి ఎదుట నిలబెట్టి “నీవెక్కడ భోజనం చేస్తున్నావ్?” అని గురువు ప్రశ్నించాడు. “లంగరులో” అన్నాడు మాంజా.

“ఐతే నీవు చేస్తున్న సేవ ఏమిటి?” అని ప్రశ్నించాడు. అక్కడున్నవారంతా అర్జున్ దేవ్ ఆలా మాట్లాడటం చూసి విస్తుపోయారు.

మాంజా “మీ ఆదేశాన్ని అర్థంచేసుకుని, అలా ప్రవర్తించేటట్లు దీవించండి” అన్నాడు వినయంగా.

మాంజా కూతురు “అందరూ లంగరులో ఉచితంగా భోజనం చేయవచ్చును గదా. నీవు ఎంతో సంపదను వదిలేశావు. ఇదేమిటి?” అని తండ్రిని ప్రశ్నించింది.

“గురుదేవులు నన్ను పరీక్షిస్తున్నారు” అన్నాడు మాంజా. అప్పటినుండి లంగరులో భోజనం చేయటం మానుకున్నాడు.

భోజనం కోసం అదనంగా కొన్ని కట్టెలు కొట్టి వాటిని అమ్మి, భోజనం సమకూర్చుకునే వాడు ఆ ఒకప్పటి ధనికుడు.

ఇలా కొంతకాలం గడిచింది. అడవి నుండి వస్తుంటే, మాంజా అనుకోకుండా ఒక దిగుడు బావిలో పడిపోయాడు.

అదృష్టవశాత్తు ఆ బావిలో అంతగా నీరు లేదు. కట్టెల మోపును నెత్తిపైన ఉంచుకొని ఎవరైనా వచ్చి తనను కాపాడతారేమోనని ఎదురు చూడసాగాడు.

సాయంకాలమైంది. చీకటిపడ్డది. అర్జున్ దేవ్ కు అడవి నుండి మాంజా రాలేదని చెప్పారు లంగరులోని వ్యక్తులు.

అందరూ మాంజా కోసం గాలించి బావిలోని మాంజాను చూచి అతడిని పైకి తీసే ప్రయత్నం చేస్తుండగా “ఒక్క నిమిషం. ముందు ఈ కట్టెల మోపును పైకి చేర్చండి” అన్నాడు మాంజా.

ముందు కట్టెల మోపును పైకి తీశారు అందరూ. తరువాత మాంజాను పైకి తీశారు.ఎంతో ప్రేమతో ఒంటి మీద తడి గుడ్డలతోనున్నా, ఆప్యాయంగా కౌగిలించుకున్నారు గురుదేవులు మాంజాను.

మాంజా భాయ్ మాంజా అయ్యాడు. తేదీ వివరాలు తెలియవు. సేవ అంటే ఎలా ఉండాలో మాంజా చూపాడు.

Written by: Mullapudi Panduranga Sainath &  Munnaloori Bose.

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles