Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
ఏ దేశ చరిత్రలోనైనా స్వర్ణ యుగం ఉంటుంది. అలాగే ఏ మత చరిత్రలోనైనా సువర్ణాక్షరాలతో లిఖించబడిన సంఘటనలు ఉంటాయి.
సిక్కుల మతంలో కూడా అనేకం ఉన్నాయి. అందులో ఒకటి సిక్కుల అయిదవ గురువు అర్జున్ దేవ్.
అయన గుడి కట్టించారు. దానికి హర్ మందిరం అని హిందూ పేరు పెట్టారు. ఆ గుడికి (మందిరానికి) శంకుస్థాపన చేసింది సూఫీ యోగి హజ్రత్ మియాన్ మీర్. ఆ మందిరమే స్వర్ణ దేవాలయం.
అది అమృత్ సర్ లో ఉంది. హజ్రత్ మియాన్ మీర్ సూఫీ సాంప్రదాయంలోని ఖాదిరి శాఖకు చెందిన వ్యక్తి.
సాయిబాబాను సూఫీ సాంప్రదాయానికి చెందిన చిస్తీ శాఖకు చెందిన వాడంటారు కొందరు. సాయి సకల మతాలను ఆదరించాడు.
మియాన్ మీర్ ఆగస్టు 11, 1550లో జన్మించారు. ఈయనకు అన్ని మతముల నుండి శిష్యులు, సందర్శకులు ఉన్నారు.
ఒకసారి గురు అర్జున్ దేవ్ ను లాహోరు కోటలో బంధించి చిత్రహింసకు గురి చేశారు.
ఈ సంగతి తెలిసి వెంటనే మియాన్ మీర్ అక్కడకు వెళ్లి “ఒక్క మాట చెప్పు (అవుననుము) ఢిల్లీ, లాహోరులలోని సింహాసనాలను నేను నేల మట్టం చేస్తాను” అన్నాడు.
కానీ, గురు అర్జున్ దేవ్ అంగీకరించలేదు. “భగవంతుని ఇచ్ఛ ప్రకారమే జరగనీయండి” అన్నాడు అర్జున్ దేవ్ మియాన్ మీర్ తో. మియాన్ మీర్ అందుకని ఆగిపోవలసిన పరిస్థితి ఏర్పడ్డది.
మియాన్ మీర్ శక్తి సామర్ధ్యాలు యువరాజైన దారా షిక్కోకు తెలుసు. మొగలాయి చక్రవర్తులకు మియాన్ మీర్ మాట వేదం.
బీదరికంలో ఉన్న తన కుమార్తెకు వివాహం జరిపింపుమని తల్లి ఒక ఫకీరును కోరింది. ఫకీరు “సరే” అన్నాడు.
వివాహం కుదిరింది. సరుకులు తెచ్చుకొవటానికిగాను ఫకీరు ఊరికి దూరంగా ఉన్న దుకాణానికి తీసుకుపోయి పెళ్ళికి కావలసిన సరుకులిమ్మన్నాడు యాజమానిని.
‘సరే’ అని యజమాని ఆమెకు అన్ని వస్తువులను ఇచ్చాడు. వివాహం జరిగింది. అయినా ఇంకో సంవత్సరానికి సరిపడా సరుకులు తెచ్చుకున్నది ఆమె.
మరునాడు సరుకుల కోసం మళ్లీ వెళ్లింది. దుకాణమే లేదు అక్కడ.
ఇంటికి వచ్చిన ఫకీరు “నన్నేమి అడగవద్దు – ఫకీరు నేనే, దుకాణదారుని నేనే, సరుకులు నేనే” అని మాయమయ్యాడు.
ఆ ఫకీరు ఎవరో కాదు మియాన్ మీరే.
నేడు ఆగస్టు 11.
మీయాన్ మీర్ జన్మదినం.
ఆయనను స్మరిద్దాం!
Written by: Mullapudi Panduranga Sainath & Munnaloori Bose.
Collected and Presented By: Mr: Sreenivas Murthy
Latest Miracles:
- ఎవరికీ తలవంచకు…. మహనీయులు – 2020… మే 30
- రండి! కదలి రండి!! …. మహనీయులు – 2020… సెప్టెంబరు 9
- సచ్చా పాదుషా …. మహనీయులు – 2020… జూన్ 19
- సేవకొరకే తనువు…. మహనీయులు – 2020… మే 14
- గురువుకు తిలకం దిద్దిన భక్తుడు… .మహనీయులు – 2020… అక్టోబరు 6
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments