జై సచ్చిదానంద! …..సాయి@366 ఆగస్టు 11….Audio



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba



Voice support by: Mrs. Jeevani


సాయి ఆరతులను రచించి, సంకలనం చేసిన సత్పురుషుడు శ్రీ కృష్ణ జగదీశ్వర్‌ భీష్మ. ఈయనకు 1908వ సంవత్సరం శ్రావణ పౌర్ణిమ (సామాన్యంగా ఆగస్టులో వస్తుంది) రోజున ఒక స్వప్నం వచ్చింది.

ఆ స్వప్నంలో నలుపు రంగు కలిగిన పురుషుడు దర్శనమిచ్చాడు.

ఆయన శరీరంపై అక్కడక్కడ కాషాయ రంగు చిహ్నాలున్నాయి. నుదిపై త్రిపుండ్రం ఉండి, పాదుకలకు గంథంతో పూజ చేసే ఉన్నది.

ఆయన ఒక కాగితాన్ని భీష్మకు ఇచ్చారు. భీష్మ ఆయనను ”మీరెవరు? మీ నామధేయం ఏమిటి?” అని అడిగాడు.

కాగితాన్ని చదువుమని వ్రేలితో చూపారు. అందులో ”సచ్చిదానంద” అనే అక్షరాలు కనిపించాయి భీష్మకు. ఇంతలో ఆ పురుషుడు ”చదువు” అన్నారు.

ఆ కాగితంలో ఒక చోట ”మంత్రం మరియు నేర్పించు” అని వ్రాసి ఉన్నది.

”అదేమి? దానర్థమేమిటి?” అని అడుగుదామంటే స్వప్నంలోని మహనీయుడు మాయమయ్యాడు. కల కరిగింది.

కొంతకాలం తరువాత భీష్మను దాదా సాహెబ్‌ కపర్దే ”షిరిడీకి వస్తావా?” అని అడిగాడు.‘సరే” అని ఆయనతో షిరిడీకి వెళ్ళాడు.

భీష్మ సాయిని దర్శించగానే బాబా చేతులు జోడించి ”జై సచ్చిదానంద” అని అన్నారు.

సాయిబాబాయే తనకు స్వప్నంలో కనిపించిన మహనీయుడని తెలుసుకోవటానికి భీష్మకు కొంత సమయం పట్టింది.

సాయిబాబాయే సచ్చిదానంద అనే భావం భీష్మలో పాతుకుపోయింది. ఇక భీష్మకు ఆత్మ స్వరూప జిజ్ఞాస పొంగి పొర్లింది. ఆ విషయం సాయికి తెలుసు.

ఒక రోజు ఉదయం భీష్మ, బల్వంత్‌ కపర్దేలు కలసి వ్యాహ్యాళికి వెళ్ళారు. అప్పుడే సూర్యోదయ మవుతోంది.

భీష్మ పడమటి దిక్కుకు చూచాడు. ఆయన పాదాల దగ్గర నుండి పడమటి దిక్కు వరకు అపార దూరం ఆయన నీడ వ్యాపించినట్లు తెలుసుకున్నాడు.

పడమటి ఆకాశమున ఆయన నీడ ఇంద్రధనుస్సును గూడి, తలపై కిరీటము పెట్టినట్లుండెను.

ఆ దృశ్యమాతనికి గొప్ప ఆనందమును ఒసంగెను. అది అనంతము ప్రకాశవంతమగు ఆతని ఛాయయే. జీవాత్మ, పరమాత్మను చేరుచుండెనా! అనునట్లుండెను.

కొంతకాలము అపరిమితానందమున తేలియాడెను. బల్వంత్‌ కపర్దేల పరిస్థితి కూడా అట్లే ఉండెను.

వారిరువురు వాడాకు పోయి కపర్దేకు ఈ విషయం చెప్పగా, ఆయన వారికి బాబా ఆత్మ సాక్షాత్కార భాగ్యము ఒసంగెనని చెప్పాడు.

వారు బాబా వద్దకు పోగా బాబా కపర్దే పలికినది సత్యమే అన్నారు.

జై సచ్చిదానంద!

Compiled  By:- ముళ్ళపూడి పాండురంగ సాయినాథ్ & మున్నలూరి బోస్

Collected and Presented By: Mr: Sreenivas Murthy

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles