Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
అనంతకోటిబ్రహ్మాండ నాయకరాజాధిరాజయోగిరాజపరబ్రహ్మశ్రీసచ్చిదానందసమర్థసద్గురుసాయినాథ్మహరాజ్కీజై!!
ముందు భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
(సాయి బాబా వారి భక్తులకి మనవి : బాబా జీవిత చరిత్రను చిన్న చిన్న కథల రూపం లో పిల్లలకు అందచేసే విధముగా రచయిత వ్రాశారు. కల్పితాలు అనుకోవద్దు అని మనవి.)
‘‘ఏదయినా నిర్మాణాన్ని చేపట్టే ముందు శంకుస్థాపన జరగాలి. జరగకపోతే ఇలాగే అంతా అస్తవ్యస్తంగా ఉంటుందంతా.’’ అన్నారు బాబా.
ఆ సరికి భయం తగ్గింది. బాబా కోపం తగ్గిందని కూడా తెలిసి వచ్చింది. మెల్లగా అయన దగ్గరగా చేరాడు శ్యామా.‘‘దేవుడుండే ద్వారకామాయికి కూడా శంకుస్థాపనలూ, శాంతులూ అవసరమా బాబా?’’ అడిగాడు శ్యామా.
‘‘అవసరమే! దేవుడికేదో ప్రమాదం జరుగుతుందని కాదు, ఆ దేవుణ్ణి కొలిచే భక్తులకి ప్రమాదం జరుగుతుందేమోనని భయం. అందుకే జాగ్రత్తలు పాటించాలంటాను.’’ అన్నారు బాబా.
‘‘జరిగిన తప్పుని మన్నించండి! మీరు వెళ్ళి చావడిలో విశ్రాంతి తీసుకోండి.’’ బ్రతిమలాడాడు నానా.‘సరే’నంటూ బయల్దేరారు బాబా.
మర్నాడు మారు వేషాల్లో వాళ్ళిద్దరూ షిరిడికి ప్రయాణం కావాల్సి ఉంది. దాని గురించే చర్చించుకుంటున్నారిద్దరూ.
ఒకరి పేరు ఖాపర్డే. మరొకరి పేరు కృష్ణారావు జగదీశ్వర్ భీష్మ. అమరావతిలో న్యాయవాదిగా మంచి పేరుంది ఖాపర్డేకి. అలాగే గేయరచయితగా పుణేలో మంచి పేరుంది భీష్మకి.
ఇద్దరూ లోకమాన్య బాలగంగాధర్ శిష్యులే! స్వాతంత్య్ర సంగ్రామంలో పాల్గొని, అజ్ఞాతంగా ఉద్యమాన్ని నడిపిస్తున్నారు. వాళ్ళ కోసం పోలీసులు గాలిస్తున్న రోజులవి.
‘‘షిరిడిలో మనం హాయిగా తలదాచుకోవచ్చు. స్వాతంత్య్ర సమర యోధులంటే సాయిబాబాకి గౌరవం ఉంది.
తిలక్‌గారు కూడా బాబాని దర్శించుకున్నారు. ఆశీస్సులందుకున్నారు. వారి కంటే మనం గొప్పకాదు. అందుకే చెబుతున్నాను. పద, షిరిడికి బయల్దేరు.’’ అన్నాడు ఖాపర్డే.ఆలోచిస్తున్నాడు భీష్మ.
‘‘ఒక్కసారి బాబాని దర్శించుకో! జీవితమే మారిపోతుంది.’’ అన్నాడు మళ్ళీ ఖాపర్డే.‘‘సరే’’ అన్నాడు భీష్మ.ఇద్దరూ పడుకున్నారు.
ఆ రాత్రి భీష్మకు ఓ కల వచ్చింది. కలలో ఎవరో సాధువు, తిరునామాలు ధరించి మెరిసిపోతున్నారు. భీష్మను అనుగ్రహించినట్టుగా చూశాడు ఆ సాధువు. ‘జై సచ్చిదానంద’ అన్నారు. ఆశీర్వదించి, మంత్రోపదేశం చేశాడు.
అంతలో మెలకువ వచ్చింది భీష్మకి. లేచి కూర్చున్నాడతను. స్వాతంత్య్ర సమరంలో అతివాదిగా పాల్గొంటున్నా, ఆధ్యాత్మిక మార్గాన్ని వీడని తనకు ఇలాంటి కలలు రావడం మామూలే అనుకున్నాడు.
భావుకుణ్ణి. రామభక్తుణ్ణి. రామాఖ్యానాన్ని రచించిన వాణ్ణి. అందుకే రాముడే తిరునామాలు ధరించి దర్శనం ఇచ్చాడనుకున్నాడతను.తెల్లారింది.
మరాఠా రైతుల వేషంలో భీష్మ ఖాపర్డే లిద్దరూ పుణే రైల్వేస్టేషన్‌లో నిలుచున్నారు.
షిరిడికి వెళ్ళాలంటే ముందుగా కోపర్‌గాం చేరుకోవాలి. తమను కోపర్‌గాం చేర్చే రైలు కోసం నిరీక్షించసాగారు. కాస్సేపటికి రైలొచ్చింది. తమని ఎవరూ గమనించట్లేదు కదా!అన్నట్టుగా అటూ ఇటూ చూసి, ఇద్దరూ రైలెక్కారు.
కంబళీలు కప్పుకుని, తలపాగాలు చుట్టుకుని రైతుల్లా ఉన్నారేమో! పక్కన కూర్చున్న పోలీసులు కూడా వారిద్దరినీ అనుమానించలేకపోయారు.
తరువాత భాగం కోసం ఇక్కడ క్లిక్ చేయండి
ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com
Contact No’s : శ్రీనివాస మూర్తి 9704379333, సాయి సురేష్ 8096343992
Latest Miracles:
- జై సచ్చిదానంద! …..సాయి@366 ఆగస్టు 11….Audio
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే- 2 (Khaparde)–Audio
- ఖాపర్డే దంపతులు
- శ్రీ జీ.ఎస్.ఖాపర్డే – 1(Khaparde)–Audio
- బాబా అంటే ఎవరో తెలియకుండా తనని ద్వేషించుకున్న మాకు తాను ఎవరో తన మహిమ, ప్రేమ, దయ ఎలాంటిదో చూపించి మా గమ్యాన్ని మార్చిన బాబా గారు.
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
Recent Comments