కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా 2వ బాగం…



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


అఖిలాండకోటి బ్రహ్మండనాయక రాజది రాజ యోగిరాజా పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై

సాయి బంధువులారా మరియు దివ్యాత్మ స్వరూపులారా అందరికీ సాయి శుభాశీస్సులు

కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా 1వ బాగం…

కాన్సర్ బారి నుండి కాపాడిన బాబా 2వ బాగం…

సర్జరీ అయిన తరువాత ఆమె నడవటానికి కనీసం 3 నించి 6 నెలలు పడుతుందనీ లేకపోతే అసలు నడవలేదనీ డాక్టర్స్ చెప్పి రెండు నెలలు అయింది. బాబా దయవల్లనే తను యెటువంటి ఆధారము లేకుండగానే నడవగలుగుతోంది, కాని మునపటిలా కాదు. కాలం గడిచేకొద్దీ బాబా దయవల్ల తను మామూలుగా నడవగలుగుతుందని నాకు గట్టి నమ్మకం.
తనకి కెమోథెరపీ 4 సిట్టింగ్స్ అయ్యాయి. 4 సిట్టింగ్స్ తరువాత ఎంతవరకూ గుణం కనపడిందో మందులు ఎంతవరకూ పనిచేసాయో తెలియాలంటే మరొక పరీక్ష చేయవలసి ఉంది. ఒకవేళ గుణం కనపడకపోయి ఉంటే కనక ఇంకా 8 సిట్టింగ్స్ అవసరమవుతాయి. దానికి నా సోదరి చాలా భయపడింది. అది చాలా బాధాకరంగా ఉంటుంది. ఆ బాధని భరించడానికి సిధ్ధంగా లేదు.
ఆమెకు ఇంక భరించే శక్తి లేదనీ ఆమెను ఈ బాధనుండి తప్పించమని బాబాని శ్రధ్ధ సబూరీతో వేడుకున్నాను. ఇప్పుడు జరిగే ఆఖరి కెమోథెరపీయే ఆఖరిదయేటట్లుగా చేయమని బాబాని మరీ మరీ వేడుకున్నాను. ఆమెకు ఆ జబ్బు వచ్చిన దగ్గర నుండీ బాబా సహాయం చేస్తున్నారని గమనించాము. మాకసలు సమస్య ఏమిటన్నదని కూడా తెలియని సమయం నించీ బాబా సహాయం చేస్తూనే ఉన్నారు.
నేను ప్రయాణమయ్యేటప్పుడు నాతో ఊదీ తీసుకుని వెడదామనుకోలేదు. కాని బాబా నేను ఊదీ తీసుకుని వెళ్ళేటట్లుగా చేసారు. ఈ సమస్య ఎదురవుతుందని ఆయనకు ముందే తెలుసు. నాలో చెప్పిన అంతర్వాణి బాబా. బాబాయే నన్ను ఊదీ మర్చిపోయేలా చేశారు. అసలు నేను కలలో కూడా ఊదీ మరచిపోవడం జరగదు. నేను ఊదీ ఇంటిలోనే మరచిపోయి ప్రయాణమయ్యాను.

ప్రసూతి వైద్యురాలు ఆర్థో సర్జన్ ని కలవమని చెప్పిన తరువాత ఆయన స్పైనల్ కార్డ్ లో ట్యూమర్ ఉందని చెప్పారు. అప్పుడు మా అమ్మగారు ఊదీ రాయడం మొదలుపెట్టారు. నా సోదరికి “సాయి తత్వం” ఇచ్చి చదవమని చెప్పేలా సాయి నన్ను ప్రేరేపించారు. డాక్టర్స్ చెప్పినదానికన్నా ముందుగానే తను నడవగలిగేలా చేసారు. తనకి తొందరలోనే బాగవుతుందనే నమ్మకం నాకుంది. ప్రపంచం లో అందరికన్నా గొప్ప వైద్యుడు బాబా యే అని మనకందరకూ తెలుసు. ఆయన తన అనుగ్రహంతో నయం చేయలేని జబ్బు ఏదీ లేదు.

నేను బ్లాగు ద్వారా షిరిడీకి ప్రేయర్ పంపించాను. నేను ఇది ఎలా పంపించానో మీకు తెలుసా? తన భక్తులకు దారి ఆయనే చూపిస్తారు. బ్లాగులో నేను ప్రతీ చోటా క్లిక్ చేసేలా చేసారు. ఉమామహేశ్వరి గారు షిరిడీ వెడుతున్నట్లు, ఎవరయినా ప్రేయర్స్ పంపిస్తే తను షిర్దిలో బాబా చరణాల వద్ద ఉంచుతాననే సందేశం చదివి వారి ఈ మైల్ కి నా సోదరి గురించి అంతా వివరంగా పంపించాను.

తరువాత నాకు ఆమె వద్దనుండి జవాబు వచ్చింది. వారు మార్చ్ 20 తేదీన షిర్డీ చేరుకున్నట్లు దర్శనం బాగా అయిందని ప్రేయర్స్ అన్నీ బాబా చరణాల వద్ద పెట్టినట్లు జవాబిచ్చారు. సాయంత్రము హారతి కి వెళ్ళినప్పుడు, ప్రేయర్స్ అన్నీ కూడా పూజారి గారికి ఇచ్చినట్లు, వారు వాటినన్నిటినీ బాబా చరణాలవద్ద ఉంచినట్లు జవాబిచ్చారు.

మనం మన జీవితాన్ని మన ఇష్టం వచ్చినట్లు జీవించలేము. అంతా బాబా యే నడిపిస్తారు, మనము చేయవలసినదల్లా బాబా చెప్పినట్లు నడచుకోవడమే.

కెమోథెరపీ యెలా పనిచేస్తోందో తెలుసుకోవడానికి మరొక పరీక్ష చేయాల్సి ఉందని ఇంతకు ముందు మీకు చెప్పాను. డాక్టర్స్ స్కాన్ చేసి ఫలితాలు చాలా అద్భుతంగా ఉన్నాయని చెప్పారు. నా ఆనందానికి అవధులు లేవు. ఆస్పత్రిలో నేను ఆనందంతో గంతులు వేసాను. తరువాత మేము డాక్టర్ని కలిసాము.

ఆమెకు నయమయినప్పటికీ ఇంకా మిగిలిన 8 సిట్టింగ్స్ జరగాలని చెప్పారు. మేము ఆయన చెప్పినదానికి కాదనకుండా ఒప్పుకున్నాము. మరలా కెమోథెరపీ మొదలు పెట్టారు. సిట్టింగ్స్ అన్నీ కూడా పూర్తయిన తరువాత కెమోథెరపీ ఎంతవరకూ పనిచేసిందో చూడటానికి మరొకసారి స్కాన్ చేసి చూస్తారు.

కెమోథెరపీ పూర్తయింది. మరలా ఒకసారి స్కాన్ చేసి చూసి ఆమె పూర్తిగా ప్రమాదం నించి బయటపడిందని చెప్పారు. ఏమయినప్పటికీ భవిష్యత్తులో మరలా రాకుండా రేడియేషన్ ట్రీట్మెంట్ ఇప్పించడం మంచిదని సలహా ఇచ్చారు. మరొక డాక్టర్ ని కూడా సంప్రదించి అది అవసరమవుతుందో లేదో తరువాత చెపుతానని డాక్టర్ చెప్పారు.

వైద్య ప్రక్రియ మొత్తం పూర్తయినా గానీ, ఇంకా రేడియేషన్ అవసరముంటుందని చెప్పడంతో మాకు చాలా బాధ వేసింది. ఏమిచేయాలో మాకు పాలుపోలేదు. తనకి మిగిలిన 8 సిట్టింగ్స్ అవసరమవుతుందని డాక్టర్స్ చెప్పినప్పుడు నేను బాబాని ఏమీ అడగలేదు. ఆమె తన గత జన్మల కర్మను అనుభవిస్తోందనీ రాబోయే నాలుగు నెలలలోఅంతా పూర్తయిపోతుందనీ నేను భావించాను.

కాని, రేడియేషన్ అవసరమవుతుందని చెప్పినప్పుడు, నా సోదరికి ఇక భరించే శక్తి లేదని నేను బాబాకి చెప్పుకున్నాను. నేను మామూలుగా ఆఫీసుకు వెళ్ళిపోయాను. మేము డాక్టర్స్ ని సంప్రదిస్తూనే ఉన్నాము. “రేడీయేషన్ ట్రీట్మెంట్ చేద్దామా వద్దా అనే సందిగ్ధం లో ఉన్నామని” డాక్టర్స్ చెప్పారు. కొందరు డాక్టర్స్ అవసరమౌతుందనీ, కొంతమంది అవసరం లేదనీ చెప్పారని చెప్పారు.

మేము బొంబాయి వెళ్ళి ఆక్కడి డాక్టర్ ని కలిసాము. వారు రేడియేషన్ అవసరం లేదని చెప్పారు. మేమంతా చాలా సంతోషించాము. అందరమూ హైదరాబాదుకు తిరిగి వచ్చాము. టాటా కాన్సర్ సెంటర్ కి వెళ్ళి టెస్ట్లు చేయించుకోమని సలహా ఇచ్చిన డాక్ట్ర్ర్ ర్ ని కలిసి విషయమంతా వివరించాము. కాని ఆ డాక్టర్ మేము చెప్పినదానికి నమ్మకం కుదరక మరలా ఇంకొక డాక్టర్ ని సంప్రదించి చెపుతానని చెప్పారు.

డాక్టర్స్ అందరూ ఎందుకిలా సరియైన నిర్ధారణకు రాలేకపోతున్నారని మాకు కలవరం కలిగింది. ఆమె క్షేమం బాబాయే చూసుకుంటారనీ, డాక్టర్స్ సరియైన నిర్ణయం తీసుకునేలా బాబాయె చూస్తారనీ నాకు తెలుసు. వారం రోజుల తరువాత డాక్టర్స్ రేడియేషన్ అవసరం లేదని నిర్ధారణగా చెప్పారు.

ఆ సమయంలో నేను శ్రీ సాయి సత్ చరిత్ర పారాయణ చేస్తున్నాను. నా సోదరికి రేడియేషన్ అవసరముండదని బాబా ఎన్నో అనుభూతులను, మంచి ఆలోచనలను సాయి నాకు ప్రసాదించారు. మేమంతా కూడా చాలా సంతోషించాము.

నేను భక్తులందరికీ చెప్పేదేమిటంటే పూర్తిగా ఆయనపై నమ్మకముంచండి. బాబా మీలో ఉన్న బాధలన్నిటినీ పోగొడతారు. ఆయనని అర్ధం చేసుకోవాలంటే శ్రధ్ధ, సబూరీ కావాలి. నేనెప్పుడు ఆయన మీద నమ్మకాన్ని పోగొట్టుకోలేదు. నా సోదరి యోగక్షేమమంతా కూడా బాబా చూసుకున్నారు. ఆమె ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది. మేమంతా షిరిడీ వెడుతున్నాము. నాకెన్నో బాబా అనుభూతులు కలిగాయి. వాటికి అంతం లేదు. మనలనందరినీ రక్షించేది బాబాయే.

ఈ సమాచారం ఈ  లింక్ http://telugublogofshirdisai.blogspot.co.ke/ ద్వార సేకరించడం జరిగింది.

సర్వం సాయినాథర్పాణమస్తు 

ప్రియమైన సాయి భక్తులకు ఒక మనవి. బాబా తో మీకు జరిగిన అనుభవాలను మాతో పంచుకో గలరు
మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles