Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
బాబా నే స్వయంగా వచ్చి అభయం ఇచ్చారు…
అఖిలాండ కోటి బ్రహ్మాండ నాయక రాజాధి రాజా యోగిరాజ
పరబ్రహ్మ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై
నా పేరు కే.సుధాకర్.మేము తెనాలి లో ఉంటాము.నేను వృత్తిరీత్యా గుంటూరు లోని రామచంద్ర హాస్పిటల్ లో వర్క్ చేస్తున్నాను.
అది 2012 ఆగష్టు 25 నా జీవితం లో మర్చిపోలేని సంఘటన. ఆ రోజు రాత్రి నేను చాల ఆలస్యంగా డ్యూటీ నుండి రాత్రి బస్సులో తెనాలికి రిటర్న్ అవుతున్నాను.
ఖచ్చితంగా బస్సు ఎక్కి పది నిముషాలు అయ్యింది అప్పటికి.బస్సు చాల స్పీడ్ గ నడుపుతున్నాడు.
హఠాత్తుగా వేరొక వాహనం ఎదురుగ వచ్చేసరికి దానిని తప్పించే క్రమమం లో బస్సు ఆక్సిడెంట్ అయ్యింది.
బస్సు ఒక పెద్ద కుదుపుకి గురి అయ్యింది.నేను అప్పుడు బస్సు చివర సీట్ లో కూర్చుని ఉన్నాను.ఒక్కసారిగా నేను సీట్ నుండి పైకి ఎగిరి అదే ప్లేస్ లో కిందపడ్డాను.
నాకు ఏమయ్యిందో తెలియని స్థితి లో ఉన్నాను.
చాల నడుం నెప్పిగా అనిపించింది.ఎంత ప్రయత్నించిన పైకి లేచి నడవలేకపోతున్నాను.
బస్సు లో అందరు దిగి వెళ్లిపోతున్నారు.నలుగురు మనుషులు మాత్రమే ఉన్నారు.
వాళ్లలో ఒకాయన దగ్గరకు వచ్చి
“ఏమి కాదు కంగారు పడకు.నీకు తప్పక నయం అవుతుంది అంటూ నాకు చాల దైర్యం చెప్పారు”.
ఆయన నాతో తను ఒక ఫీజియోథెరపిస్ట్ అని చెప్పారు.
నా దగ్గర ఉన్న హాస్పిటల్ IDకార్డు చూసి,నేను పని చేస్తున్న హాస్పిటల్ కి తిరిగి పంపమని అక్కడ ఉన్న డాక్టర్స్ అంతా చూసుకుంటారు”అని మిగతావాళ్ళతో చెప్పారు.ఆయన రాలేదు.
108 కి కాల్ చేసి హాస్పిటల్ కి తీసుకు వెళ్లారు.మా పేరెంట్స్ కూడా వచ్చారు.మా హాస్పటల్ డాక్టర్ చంద్ర శేఖర్ గారు నన్ను “తులసి ఎమర్జెన్సీ హాస్పిటల్”కి పంపమని స్టాఫ్ కి చెప్పారు.
టెస్టులు,ట్రీట్మెంట్ చాల జాగ్రత్తగా చేయమని వాటికీ అయ్యే ఖర్చు ఆయనే ఇస్తానని చెప్పారు.
స్కానింగ్ అయ్యేక చుస్తే నా స్పైన్ లో చాల చిన్న క్రాక్ వచ్చింది అని చెప్పారు.సర్జరీ చేయాల్సి వస్తుంది దాని ఖర్చు 2లక్షలు అవుతుంది అన్నారు.మేము డబ్బు గురించి టెన్షన్ పడ్డాము .ఎందుకంటే మా ఆర్థిక పరిస్థితి రీత్యా అది మాకు కష్టం.డాక్టర్స్ సర్జరీ చేయకుండా మెడిసిన్ వాడి చూద్దాం అని మొదలు పెట్టారు.
“బాబాని ఈ ఆపద నుండి కాపాడమని సర్జరీ లేకుండా ఉండాలని మేము చాలా ప్రార్దించాము.
ఆశ్చర్యం 10 రోజులలో స్పైన్ లో క్రాక్ మాయమయ్యి నన్ను డిశ్చార్జ్ చేసారు.డాక్టర్స్ కూడా ఆశ్చర్యపోయారు.”
నాకు ఒక 20 డేస్ బెడ్ రెస్ట్ చెప్పారు.ఒక 3 నెలల్లో నేను యధావిధిగా తిరిగి నా విధులకు హాజరు అయ్యాను.”
నేను బస్సు లో నాకు సహాయం చేసిన వారికీ ఫోన్ చేసి ధన్యవాదాలు చెప్పాను.”కానీ ఆశ్చర్యం గా నాకు ఫిజియోథెరపిస్ట్ అని చెప్పిన వ్యక్తి ఎంత ప్రయత్నించిన వివరాలు తెల్సుకోలేకపోయాను.
ఆ రోజు నాకు వచ్చి ధైర్యము చెప్పి నన్ను ఆశీర్వదించింది బాబానే అని నా నమ్మకం.
“ఆలోచిస్తే నీకు ఏమి కాదు అంతా డాక్టర్స్ చూసుకుంటారు నువ్వు డ్యూటీ కి హాయిగా వెళ్లగలవు అని భవిష్యత్తు చెప్పగలిగే శక్తి, అభయం ఇవ్వగలిగేది మన సాయిబాబా కి ఇంకా ఎవరికీ ఉంది.”
Latest Miracles:
- బాబా నే స్వయంగా వచ్చి అభయం ఇచ్చారు
- బాబా దయ వల్ల బ్యాగు లో కాష్ తీయలేదు.—Audio
- స్వయంగా బాబా వారి పేరు మీద ఉన్న కాకడ ఆరతి టికెట్స్ మాకు ఇచ్చారు.
- అడవిలో ఏకాకిగా ఉన్న మాకు సహాయం చేసిన బాబా వారు …..!
- శ్రీ సాయిబాబా దయతో నాకు కొత్త జీవితాన్ని ప్రసాదించారు
Sai Baba ... Sai Baba ... Sai Baba ... Sai Baba (click here)
Those who chant my name repetedly, I will protect them always...Sai Baba
2 comments on “బాబా నే స్వయంగా వచ్చి అభయం ఇచ్చారు…2”
Sreenivas
October 26, 2017 at 8:45 amSai Baba…Sai Baba…Sai Baba
GKALPANA
November 16, 2017 at 3:54 pmBABA PLZ HELP ME