మళ్ళీ మళ్ళీ దర్శించాలనిపించే గురువుగారి సుందరరూపం.



Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

రవికుమార్,హైదారాబాద్

గురువుగారు దేహత్యాగము చేసారని తెలిసి నమ్మలేకపోయాను.అప్పటిదాకా నేను గురువుగారిని దర్శించుకోలేదు.

కనీసం చివరిసారి ఇప్పుడైనా గురువుగారి దర్శనం చేసుకోవాలి అని బలంగా మనస్సులో అనిపించింది.

అప్పుడే జాబ్ లో చేరిన నేను,అప్పటికి వేతనం రాక,నా వద్ద డబ్బులు లేక ఎలా అని ఆలోచిస్తూ వున్నాను.

జాబు అనే మొదటి కోరిక తీర్చిన గురువుగారు డబ్బులు అప్పుచేయకుండా శిరిడీ వచ్చేలా చేసి తమ దర్శన భాగ్యము కల్పించారు. 

గురువు గారు మహాసమాధి చెందుతారనగా ముందురోజు నా ఫ్రెండ్ శివ నిజామాబాద్ నుండి హైదరాబాద్ వచ్చి 13 వ తేదీ నిజామాబాద్ సత్సంగ వార్షికోత్సవం ఉందని తిరిగి అదేరోజు నిజామాబాద్ బయలుదేరాడు.

వెళ్లేముందు ఇద్దరివి (తనది,భాను అనే ఫ్రెండ్ ది )బస్ పాస్ లు రెన్యువల్ చేయించమని పాస్ లు మరియు డబ్బులు 500 రూపాయలు ఇచ్చాడు.బస్ పాస్ ‘ఆన్ లైన్ ప్రాబ్లెమ్’ వచ్చి పాస్ రెన్యువల్ చేయలేకపోయాను.

ఆఫీస్లో కొద్దిసేపువుండి టీ త్రాగడానికి హోటల్ కు వెళ్లాను.
అక్కడ గురువుగారి ఫోటో వేసినపేజి(ఆరోజు సాక్షి దినపత్రికలో గురువుగారి మహాసమాధి విషయం తెలుపుతున్న ఫోటో)హోటల్ లో నేను కూర్చునే సీటుకు ఎదురుగా పెట్టి ఉండడం చూసి పేపర్ తీసుకొని చదివాను.

దాంతో గురువుగారిని చూడాలి అనే కోరిక ఇంకా బలమయింది.

టీ త్రాగి బయటకు రాగానే శివ శిరిడీ నుంచి ఫోన్ చేసి,గురువుగారి సుందరరూపాన్ని భౌతికంగా చూడాలి,నువ్వు ఎలాగైనా సరే వీలుకల్పించుకొని తొందరగా రమ్మన్నాడు.

దానితో మనసు ఆగలేదు.సాయంత్రం అజంతా  ఎక్స్ ప్రెస్ కు బయలుదేరాను.

డబ్బులు ఎలా అనుకుంటున్నారా?బస్ పాస్ రెన్యువల్ చేయమని ఇచ్చిన డబ్బులు ఎలాగూ వున్నవి కదా.

రెన్యూవల్ కు వెళ్ళిన ప్రతిసారీ ఎదో కారణంవల్ల తిరిగి రావడము పని కాకపోవడము అవి అంతా గురువుగారు నన్ను శిరిడీకి తీసుకురావడానికి అనుకొని వాటితో పాటు 100రూపాయలు కలుపుకుని శిరిడీ బయలుదేరాను.

నవంబర్ 15,2010 ఉదయం శిరిడీ వచ్చాను.అప్పటికి గురువుగారు శిరిడీ రాలేదు.

మొదటిసారి గురువుగారిని చూడబోయే నాకు,తిరిగి ఎప్పటికి చూడటానికి వీలులేని విధముగా సమాధి కార్యక్రమాలు జరగడం చూసి బాధపడినాను.

గురువుగారు వచ్చిన తరువాత శిరిడీ పొలిమేరకు వెళ్లి గురువుగారికి స్వాగతం పలికి,బాబా నామస్మరణతో బాబా మందిరానికి ప్రదక్షిణ చేయించుకుంటూ,సాయిపథం తీసుకువచ్చాము.

గురువుగారిని ఎప్పుడెప్పుడు దర్శించుకొందామా అని నేను ‘క్యూ’లో నిలబడి,గురువుగారి వద్దకు వెళ్లి తృప్తిగా గురువుగారిని మొదటిసారి చూడడం జరిగింది.

అయినా ‘మళ్ళీ మళ్ళీ దర్శించాలనిపించే’ సుందరరూపం మన గురుదేవులది.

అలా ‘క్యూ’లో తెల్లవారేసరికి నాలుగుసార్లు దర్శనం చేసుకున్నాను.

గురువుగారు అంతకుమునుపు ఉన్న విధంగానే ఇప్పటికీ,ఎప్పటికీ ఉంటారు అనేదే నా నమ్మకం.
ఎందుకంటే మునుపు లేని విధముగా గురువుగారు నాతో మాట్లాడుతున్నట్లు,నాకు మార్గము చూపుతున్నట్లు నాకు అనుభవమై,నా మనస్సుకు స్పష్టత ఏర్పడుతున్నది.
సదా మన మంచిని కోరుకునే గురువుగారు చూపిన శుభ్రమార్గంలో నడవాలి అనేది నా ఆశ.

శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహరాజ్ కీ జై

సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకీ జై

సాయి బాబా       …       సాయి బాబా       …       సాయి బాబా        …       సాయి బాబా

ఎవరయితే నా నామాన్ని సదా అన్ని వేళల మనస్పూర్తిగా ఉచ్ఛరిస్తారో  వారికి అన్ని విధాలా నేను సహాయపడతాను.

మా ఈమెయిలు: saibabaleelas@gmail.com

Latest Miracles:


Sai Baba   ...   Sai Baba ...   Sai Baba  ...   Sai  Baba (click here)

Those who chant my name repetedly, I will protect them always...Sai Baba


Satcharitra (Telugu Audio) by RCM Raju

Sai Satcharitra – English (USA and Indian Accent)

Shirdi Live Today

Sai Baba Miracles